మీ భాగస్వామి ప్రేమ నిజమో కాదో ఆరెంజ్ తొక్క చెప్పేస్తుందట.. ఓ రేంజ్‌లో ట్రై చేస్తున్న ప్రేమికులు..

ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ టిక్‌టాక్‌లో కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. ఇది ప్రేమ సంబంధం ఎంత నిజమో చెప్పడానికి ప్రజలకు సహాయపడుతుందని పేర్కొంది. దీన్ని ఆరెంజ్ పీల్ థియరీ అంటారు. ఈ 'కమలా ఫలం తొక్క సిద్ధాంతం' ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం? ఇండిపెండెంట్ ప్రకారం.. మీరు మీ భాగస్వామి అడగకుండానే మీ కోసం కమలాఫలం పండు తొక్కలు తీస్తే, మీ భాగస్వామి మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారని థియరీ చెబుతుంది

మీ భాగస్వామి ప్రేమ నిజమో కాదో ఆరెంజ్ తొక్క చెప్పేస్తుందట.. ఓ రేంజ్‌లో ట్రై చేస్తున్న ప్రేమికులు..
Orange Peel Theory
Follow us
Surya Kala

|

Updated on: Nov 23, 2023 | 2:56 PM

ప్రతి ఒక్కరూ నిజమైన ప్రేమని కోరుకుంటారు.. నిజమైన ప్రేమ కోసం వెతుకుతారు. ప్రేమ కోసం తాము ప్రేమించిన వ్యక్తి కోసం రకాల కలలు కంటారు. అయితే వాస్తవానికి తమ ప్రేమ నిజమైందా కాదా అని తెలుసుకోవాల్సిన  అవసరం లేదు. భవిష్యత్తులో అతను మోసగాడిగా మారే అవకాశం ఉంది. కనుక కొందరు తమకు దొరికిన ప్రేమ నిజమో కాదో తెలుసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ప్రేమ నిజమో కాదో ఇప్పుడు ఆరెంజ్ తొక్కే చెబుతుంది. అలాంటి ఒక వింత ట్రెండ్ ఈ రోజుల్లో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే.. ప్రేమికులు కూడా దీనిని ట్రై చేస్తున్నారు.

ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ టిక్‌టాక్‌లో కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. ఇది ప్రేమ సంబంధం ఎంత నిజమో చెప్పడానికి ప్రజలకు సహాయపడుతుందని పేర్కొంది. దీన్ని ఆరెంజ్ పీల్ థియరీ అంటారు. ఈ ‘కమలా ఫలం తొక్క సిద్ధాంతం’ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం?

ఇండిపెండెంట్ ప్రకారం.. మీరు మీ భాగస్వామి అడగకుండానే మీ కోసం కమలాఫలం పండు తొక్కలు తీస్తే, మీ భాగస్వామి మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారని థియరీ చెబుతుంది. అతను మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. జీవితాన్ని సులభంగా గడపడానికి.. చిన్న చిన్న పనులు చేస్తూ.. తమ భాగస్వామికి అండగా నిలుస్తాడు. అంతేకాదు తమ భాగస్వామికి రక్షకుడుగా నిలుస్తాడనే సిద్ధాంతాన్నిఈ థీరీ చెబుతుంది అని  అంటున్నారు.

ఇవి కూడా చదవండి

టిక్‌టాక్‌లోని మరో మహిళా వినియోగదారు ఒక వీడియోను పంచుకున్నారు. కోడి గుడ్లు పెట్టే ట్రే ను చూసినట్లు చెప్పారు. అందులో అన్ని గుడ్లలోని తెల్లసొనలు సొనలు వేరు చేయబడి ఉన్నాయని పేర్కొంది. జెనా అనే ఈ యూజర్ తన లైఫ్ పార్ట్నర్ తన ఖాళీ సమయంలో తన కోసం ఈ పని చేశారని చెప్పారు. ఇది కూడా నిజమైన ప్రేమకు సంకేతమని చెప్పారు.

చాలా మంది వినియోగదారులు టిక్‌టాక్‌లో తమ అనుభవాలను పంచుకున్నారు. ‘ఆరెంజ్ పీల్ థియరీ’ నిజంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. కొంతమంది ఈ సిద్ధాంతం కుటుంబ సభ్యులు, సమాజంలోని ఇతర వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి ఎలా సహాయపడిందో వివరిస్తూ వీడియోలను కూడా పంచుకున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..