Viral News: వృద్ధుడి పేగుల్లో బతికిన ఈగ.. శరీరంలోపలికి ఎలా ప్రవేశించిందో వైద్యులకు మిస్టరీ..
మిస్సౌరీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు రోగిని విచారించారు. ఈగ అతని ప్రేగులలోకి ఎలా ప్రవేశించిందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అయితే ఇది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఈగ ఆ వృద్ధుడి శరీరంలోకి ఎలా ప్రవేశించిందో అతనికి కూడా తెలియదు. తనకు ఎలాంటి సమస్య లేదని ఆ వ్యక్తి చెప్పాడు. అయితే అతను కోలనోస్కోపీకి ముందు జీర్ణవ్యవస్థ ఖాళీ ఉండే విధంగా ముందు రోజు డ్రింక్స్ మాత్రమే తీసుకున్నాడు. అయితే అతను తన 24 గంటల ఉపవాసానికి ముందు సాయంత్రం పిజ్జా, సలాడ్ తిన్నాడు.
చాలా సార్లు అనేక వింత కేసులు వెలుగులోకి వచ్చి ఆశ్చర్యం కలిగిస్తాయి. అదే సమయంలో కొన్ని కేసులు ఆలోచింపజేసేవిలా ఉంటాయి. ప్రస్తుతం అలాంటి ఒక వింత కేసు ఒకటి చర్చనీయాంశమైంది. వాస్తవానికి అమెరికాలోని మిస్సోరీకి చెందిన వ్యక్తి పేగులో ఓ ఈగ సందడి చేసింది. అది చూసి వైద్యులు షాక్ తిన్నారు. . 63 ఏళ్ల వ్యక్తి తన పెద్దప్రేగు క్యాన్సర్‌కు సంబంధించిన సాధారణ చెకప్ కోసం ఈ ఏడాది ప్రారంభంలో ఆసుపత్రికి వెళ్లాడు. ఈ పరీక్షా విధానంలో పేగుల లోపల కెమెరాను ఉంచారు. అంతా బాగానే ఉందని గమనించారు. అయితే ఇంతలో అసాధారణమైన విషయం వైద్యుల కంట పడింది. ఆ వ్యక్తి పేగుల గోడపై బతికి ఉన్న ఈగ ఉంది.
LadBible నివేదిక ప్రకారం.. మిస్సౌరీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు రోగిని విచారించారు. ఈగ అతని ప్రేగులలోకి ఎలా ప్రవేశించిందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అయితే ఇది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఈగ ఆ వృద్ధుడి శరీరంలోకి ఎలా ప్రవేశించిందో అతనికి కూడా తెలియదు. తనకు ఎలాంటి సమస్య లేదని ఆ వ్యక్తి చెప్పాడు. అయితే అతను కోలనోస్కోపీకి ముందు జీర్ణవ్యవస్థ ఖాళీ ఉండే విధంగా ముందు రోజు డ్రింక్స్ మాత్రమే తీసుకున్నాడు. అయితే అతను తన 24 గంటల ఉపవాసానికి ముందు సాయంత్రం పిజ్జా, సలాడ్ తిన్నాడు. అయితే తాను తిన్న ఆహారంలో ఈగలు ఉన్నాయో లేదో తెలియదన్నాడు.
ఈగ పేగులోకి ఎలా ప్రవేశించిందంటే?
అమెరికన్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ప్రకారం మనిషికి చికిత్స చేస్తున్న వైద్యులు ఈ కేసు చాలా అరుదైన కొలనోస్కోపిక్ పరిశోధనకు సంబంధించినదని చెప్పారు. బతికి ఉన్న ఈగ జీర్ణవ్యవస్థలోని చివరి భాగమైన పెద్దప్రేగులోకి ఎలా చేరిందనేది మిస్టరీ అని చెప్పారు. కొన్ని అరుదైన సందర్భాల్లో మనుషులు పండ్లు లేదా కూరగాయల్లో ఉన్న గుడ్లు లేదా లార్వాలను తినడం జరుగుతుందని.. ఇవి కడుపులోని ఆమ్లా నుంచి తప్పించుకుని ప్రేగుల్లో పెరగడం ప్రారంభిస్తాయని.. దీనిని పేగు మయాసిస్ అని పిలుస్తారు.
పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడగాలని సూచించారు
మిస్సౌరీ విశ్వవిద్యాలయంలో గ్యాస్ట్రోఎంటరాలజీ అధిపతి మాథ్యూ బెచ్‌టోల్డ్, ది ఇండిపెండెంట్‌తో మాట్లాడుతూ ఈగ మనిషి శరీరంలోకి నోటి ద్వారా ప్రవేశించి ఉండవచ్చని తాను అనుమానిస్తున్నట్లు చెప్పారు. డైజెస్టివ్ ఎంజైమ్‌లు, కడుపులోని ఆమ్లాలను ఈగను మింగినట్లయితే అది చచ్చిపోయి ఉండేదని.. అయితే అలా జరిగి ఉంది ఉండదని.. తాము భావిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం జరిగింది దిగ్భ్రాంతికరమైన సంఘటనగా వైద్యులు అభివర్ణించారు. ఎవరైనా సరే పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడుక్కోవాలని.. ఈగలు వాలకుండా చూసుకోవాలని ఆయన సూచించారు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం క్లిక్ చేయండి..