Viral Video: సచివాలయం రోడ్లపై ప్రమాదకర బైక్ స్టంట్స్.. గాల్లో తేలుతున్న వీడియో వైరల్..
హైదరాబాద్ మహానగరం క్రమంగా విస్తరిస్తోంది. నగరవాసుల సౌకర్యాల దృష్ట్యా చుట్టూ అందమైన టూరిజం నిర్మాణాలు, సేద తీరేందుకు పార్కులు, హూస్సేన్ సాగర్ తీరం, విశాలమైన రోడ్లు నిర్మించారు. ఇదే అదనుగా భావించి నగరంలో ఆకతాయిలు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. రోడ్డుపై కాస్త ఖాళీ స్థలం కనిపిస్తే చాలు రేసింగులు, స్టంట్లు చేస్తున్నారు.
హైదరాబాద్ మహానగరం క్రమంగా విస్తరిస్తోంది. నగరవాసుల సౌకర్యాల దృష్ట్యా చుట్టూ అందమైన టూరిజం నిర్మాణాలు, సేద తీరేందుకు పార్కులు, హూస్సేన్ సాగర్ తీరం, విశాలమైన రోడ్లు నిర్మించారు. ఇదే అదనుగా భావించి నగరంలో ఆకతాయిలు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. రోడ్డుపై కాస్త ఖాళీ స్థలం కనిపిస్తే చాలు రేసింగులు, స్టంట్లు చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ తమకు తాము ప్రమాదం కొని తెచ్చుకోవడమే కాకుండా ఎదురుగా వస్తున్న వాళ్లకు అసౌకర్యానికి గురిచేస్తున్నారు. ఒకవేళ ఈ విన్యాసాల్లో అనుకోని ప్రమాదం జరిగితే స్టంట్ చేసేవాళ్ళతో పాటూ పక్కన ఉన్నవాళ్లకు కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. పైగా ఇలాంటి విన్యాసాలకు పాల్పడే వాళ్లు ఎలాంటి రక్షణా చర్యలు తీసుకోక పోవడం గమనార్హం. తలకు హెల్మెట్, కాళ్లకు షూ స్ ధరించకుండా ఇలాంటి వాటికి పాల్పడటం చాలా ప్రమాదం అంటూ హెచ్చరిస్తున్నారు. ఇలాంటివి చేయాలనుకుంటే నిపుణుల పర్యవేక్షణలో నేర్చుకొని ప్రదర్శించడం అంటున్నారు.
కేవలం రాత్రి వేళల్లో మాత్రమే నిర్మానుష్యంగా ఉన్న సమయంలో ఇలాంటి ప్రమాదకరమైన సాహసాలకు పాల్పడుతున్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన నూతనంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయాన్ని వేదికగా చేసుకొని ఇలాంటి ప్రమాదకరమైన బైక్ స్టంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్ పెరుగుతుందని తెగ సంబరపడుతున్నారు. కేవలం సచివాలయం వద్దే కాకుండా.. నక్లెస్ రోడ్డు, పీవీ మార్గ్, సంజీవయ్య పార్క్, ట్యాంక్ బండ్, కేబుల్ బ్రిడ్జ్ తోపాటూ పలు ప్రాంతాల్లోని ఫ్లై ఓవర్లపై బైక్ విన్యాసాలకు పాల్పడుతున్నారు ఆకతాయిలు. మరికొందరైతే ఏకంగా ప్రధాన రహదారులు, మెట్రో స్టేషన్ల కిందనే బైక్ స్టంట్స్ చేస్తూ కనిపించారు. పట్టుమని 15ఏళ్లు కూడా నిండని చిన్న పిల్లలు ఇలాంటి చర్యలకు పాల్పడటంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పోలీసులకు నగర వాసులు విన్నవించుకుంటున్నారు.
ఈ వీడియోలను సోషల్ మీడియాల్లో చూసిన కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఒకరిని మించిన స్టైల్లో మరొకరు సర్కస్ ను తలదన్నేలా ఇలాంటి సాహసాలకు పాల్పడుతున్నారు. కొందరైతే షాక్‌కి గురవుతూ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు బైక్ స్టంట్స్‌కి పాల్పడిన బండి రిజిస్ట్రేషన్ నంబర్ కూడా ట్విట్టర్ ద్వారా పంపించారు. ఈ రకమైన బైక్ స్టంట్లకు పాల్పడుతున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను కోరారు. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు అనేక రాష్ట్రాల్లో జరిగాయి. దీపావళి సందర్భంగా బైక్‌కి ముందు, వెనుక భాగాల్లో టపాసులు అమర్చి వేగంగా ప్రయాణిస్తూ ఇలాంటి విన్యాసాలకు పాల్పడ్డారు చెన్నైకి చెందిన యువకులు. దీనిపై పోలీసులు స్పందించి ఈ ఆకతాయిలను అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..