Barrelakka: బర్రెలక్కకు పెరుగుతోన్న మద్ధతు.. తాజాగా టాలీవుడ్‌ హీరో సపోర్ట్.

'డిగ్రీలు చేసినా.. ఉద్యోగం రాలేదంటూ. అందుకే బర్రెలు కొనుక్కున్నానంటూ' ఓవైపు కామెడీ చేస్తూనే మరోవైపు సెటైర్లు వేస్తూ అప్పట్లో పాపులర్‌ అయ్యింది బర్రెలక్క అలియాస్‌ శిరీష. ఇదే సమయంలో ఆమెకు కష్టాలు సైతం వచ్చాయి. ఆ సమయంలో ఆమెపై కేసు కూడా నమోదైంది. అయితే వెనుకడుగు వేయని శిరీష.. ఈసారి ఏకంగా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో నిలిచింది...

Barrelakka: బర్రెలక్కకు పెరుగుతోన్న మద్ధతు.. తాజాగా టాలీవుడ్‌ హీరో సపోర్ట్.
Barrelakka
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 24, 2023 | 6:55 AM

బర్రెలక్క.. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడీ పేరు హాట్‌ టాపిక్‌గా మారింది. పేద కుటుంబానికి చెందిన ఓ సాధారణ యువతి ఇప్పుడు సోషల్‌ మీడియాతో పాటు, రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘హాయ్‌ ఫ్రెండ్స్‌.. నేను మీ బర్రెలక్కను’ అంటూ యూట్యూబ్‌ వీడియోలతో మొదలైన యువతి ప్రస్థానం, నేడు ఎమ్మెల్యే సీట్‌కు పోటీ చేసే స్థాయికి ఎదిగింది.

‘డిగ్రీలు చేసినా.. ఉద్యోగం రాలేదంటూ. అందుకే బర్రెలు కొనుక్కున్నానంటూ’ ఓవైపు కామెడీ చేస్తూనే మరోవైపు సెటైర్లు వేస్తూ అప్పట్లో పాపులర్‌ అయ్యింది బర్రెలక్క అలియాస్‌ శిరీష. ఇదే సమయంలో ఆమెకు కష్టాలు సైతం వచ్చాయి. ఆ సమయంలో ఆమెపై కేసు కూడా నమోదైంది. అయితే వెనుకడుగు వేయని శిరీష.. ఈసారి ఏకంగా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో నిలిచింది. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌ క్యాండిడేట్‌గా బరిలోకి దిగింది. తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటూ, దూసుకుపోతోంది.

ఈ క్రమంలోనే తాజాగా బర్రెలక్క ఎన్నికల ప్రచారం చేస్తుండగా, కొందరు ఆమె తమ్ముడిపై దాడి చేయడంతో ఆ విషయం కాస్త రచ్చగా మారింది. తనను ప్రచారం కూడా చేసుకోనివ్వడం లేదంటూ కన్నీరు పెట్టుకుంది. దీంతో ఈ వీడియో కాస్త వైరల్‌ కావడంతో అనూహ్యంగా శిరీషకు మద్ధతు పెరిగింది. చాలా మంది ప్రముఖులు బర్రెలక్కకు తమ సంపూర్ణ మద్ధతు తెలుపుతున్నారు. ఇలాంటి వాళ్లు గెలిస్తే రాజకీయాల్లో మార్పు వస్తుందంటూ స్టేట్‌మెంట్స్‌ ఇస్తున్నారు. ఇక మరికొందరైతే ఏకంగా విరాళాలు సైతం అందిస్తున్నారు.

Hero Raja

 

ఇప్పుడు మీడియా డిబేట్స్‌లో పాల్గొనే స్థాయికి ఎదిగిపోయింది శిరీష. ఈ క్రమంలోనే తాజాగా హీరో రాజా కూడా శిరీషకు మద్ధతు పలికారు. రాజా కాంగ్రెస్‌ పార్టీ సభ్యుడనే విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజా.. తమ అదిష్టానం మందలించినా సరే తన సపోర్ట్ మాత్రం బర్రెలక్కకేనని రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలో శిరీష గెలవాలని కోరుకుంటున్నట్టు రాజా చెప్పుకొచ్చారు. ఆమెను కనీసం ప్రచారం కూడా చేసుకోనివ్వడం లేదంటూ రాజా ఆవేదన వ్యక్తం చేశారు.

శిరీష ధైర్యానికి మెచ్చుకోవాల్సిందేనన్న రాజా..ఇలాంటి వాళ్లు గెలిస్తే.. యువతలో కొత్త చైతన్యం వస్తుందని అభిప్రాయపడ్డారు. బర్రెలక్కను గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ తరపున బీరం హర్హనవర్ధన్‌ రెడ్డి (సిట్టిం ఎమ్మెల్యే) పోటీ చేస్తుండగా. జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ నుంచి అల్లెని సుధాకర్ రావు బరిలోకి దిగారు. ఇలాంటి దిగ్గజ నాయకులకు పోటీగా బర్రెలక్క బరిలోకి దిగి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..