- Telugu News Photo Gallery Noni fruit benefits in diabetes control joint pain and digestion Telugu News
Noni Fruit: ఈ ఒక్క పండు తింటే చాలు..100 రకాల వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!
ప్రకృతిలో లభించే అనేక రకాలైన పండ్లు, కాయలు ఎన్నో రోగాలను నయం చేస్తాయి.. అందులో నోని పండు కూడా ఒకటి. దీనినే తొగరు పండు అని కూడా అంటారు. బంగాళాదుంప ఆకారంలో పసుపు, లేత ఆకుపచ్చ రంగులో కనిపించే ఈ పండు చూస్తే గుర్తు పడతారు.. కానీ, ఈ పండు గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. కానీ, ఈ పండు ఆరోగ్యానికి ఔషధ గని వంటిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు..నోని పండు ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Nov 27, 2023 | 8:18 PM

ఈ పండులో విటమిన్ సి, బి3, ఎ, ఐరన్, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. దీని ఆకులు, బెరడు, వేర్లు కూడా పలు రకాల మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఈ నోని పండ్లతో తయారు చేసిన జ్యూస్ రోజు తాగడం ద్వారా మన రోగ నిరోధక శక్తి బలంగా మారుతుంది.

నోని పండు రక్తంలో చక్కెరను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. దీని ఆకులు కూడా మధుమేహానికి మేలు చేస్తాయి. ఈ పండ్లు లేదా జ్యూస్ తాగితే షుగర్ వ్యాధిని కంట్రోల్ అవుతుంది.

ఈ పండులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీని వినియోగం ఎముకల రాపిడిని తగ్గించడం ద్వారా కీళ్ల నొప్పుల సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్ సి ఉన్నాయి. కాబట్టి ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. చర్మ సమస్యలను కూడా తొలగిస్తుంది.

కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలతో బాధపడేవారికి ఈ పండు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. నోని పండ్ల ఆకులలో ఉండే ఔషధ గుణాలు వాపు, ఎరుపు, దురద వంటి చర్మ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి.




