AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: లోకల్‌ ట్రైన్‌లో ఒక్కటైన ప్రేమ జంట.. ప్రయాణీకుల సాక్షిగా దండలు మార్చుకుని.. వీడియో వైరల్‌..

దులుతున్న రైల్లో ఇద్దరు యువతీ యువకులు దండలు మార్చుకున్న వీడియో నెటింట తెగ చక్కర్లు కొడుతోంది. ట్రైన్‌లో ఉన్న ప్రయాణికులంతా చూస్తుండగానే ఆ అమ్మాయి అతన్ని కౌగిలించుకుంది. ఆ తర్వాత అబ్బాయి ఆమెకు ఏదో నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.. ఆ తర్వాత ఆమె మెడలో మంగళసూత్రం కట్టాడు. తర్వాత ఇద్దరూ ఒకరి మెడలో ఒకరు పూల దండలు వేసుకోవడం కూడా కనిపిస్తుంది. అబ్బాయి తాళికట్టాడు.. తరువాత ఇద్దరు దండలు మార్చుకున్నారు.. చుట్టూ ఉన్న జనమంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు..అలా వీరి పెళ్లితంతు పూర్తైంది.. అమ్మాయి మరోసారి

Watch Video: లోకల్‌ ట్రైన్‌లో ఒక్కటైన ప్రేమ జంట.. ప్రయాణీకుల సాక్షిగా దండలు మార్చుకుని.. వీడియో వైరల్‌..
Marriage In Train
Jyothi Gadda
|

Updated on: Nov 27, 2023 | 6:17 PM

Share

భారతదేశంలో ఎక్కువగా కుదుర్చుకున్న వివాహాలే జరుగుతున్నాయి. అంటే కుటుంబ సభ్యుల కోరిక మేరకు మాత్రమే వివాహాలు జరుగుతాయి. కానీ, ఇప్పుడు దేశంలో ప్రేమ వివాహాలు కూడా పెరిగిపోతున్నాయి. అలాంటి వివాహాలు కొన్ని కుటుంబ సభ్యుల అంగీకారంతో జరుగుతుంటాయి. కానీ కొన్నిసార్లు కుటుంబ సభ్యులు ఇలాంటి పిల్లలు చేసుకునే ప్రేమ వివాహాలను ఇష్టపడరు..తమ అమ్మాయి లేదా అబ్బాయిని కోరుకున్న వ్యక్తితో పెళ్లికి వారు అంగీకరించరు..దాంతో ఆ జంట పెళ్లికి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు చాలా సార్లు ఆ జంటలు పారిపోయి పెళ్లి చేసుకోవటం మనం చూస్తుంటాం.. ప్రస్తుతం, అలాంటి ఒక పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇందులో ఒక జంట కదులుతున్న రైలులో వివాహం చేసుకోవడం కనిపించింది. ఈ జంట పెళ్లిని చూసేందుకు రైలులోని ప్రయాణికులంతా ఒక్క చోట భారీ సంఖ్యలో గుమిగూడారు.

కదులుతున్న రైల్లో ఇద్దరు యువతీ యువకులు దండలు మార్చుకున్న వీడియో నెటింట తెగ చక్కర్లు కొడుతోంది. ట్రైన్‌లో ఉన్న ప్రయాణికులంతా చూస్తుండగానే ఆ అమ్మాయి అతన్ని కౌగిలించుకుంది. ఆ తర్వాత అబ్బాయి ఆమెకు ఏదో నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.. ఆ తర్వాత ఆమె మెడలో మంగళసూత్రం కట్టాడు. తర్వాత ఇద్దరూ ఒకరి మెడలో ఒకరు పూల దండలు వేసుకోవడం కూడా కనిపిస్తుంది. అబ్బాయి తాళికట్టాడు.. తరువాత ఇద్దరు దండలు మార్చుకున్నారు.. చుట్టూ ఉన్న జనమంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు..అలా వీరి పెళ్లితంతు పూర్తైంది.. అమ్మాయి మరోసారి సంతోషంతో అతన్ని కౌగిలించుకుంటుంది.. ఆ వెంటనే అతని పాదాలను తాకి నమస్కరించుకుంటుంది. రైలులో ఉన్న వాళ్లల్లో కొందరు ఇదంతా తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. అనంతరం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ జంట లోకల్ రైల్లో అందరి ముందు వివాహం చేసుకుందనే క్యాప్షన్‌తో వీడియోని షేర్‌ చేశారు..

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో max_sudama_1999 పేరు గల IDతో షేర్‌ చేయబడింది. ‘కదులుతున్న రైలులో వివాహం.. బాగా చేసారు. బ్రో అంటూ నెటిజన్లు కామెంట్స్‌తో ప్రశంసలు కుమ్మరిస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు 1 లక్షా 48 వేలకు పైగా వీక్షించగా, 3 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేశారు.

అదే సమయంలో, వీడియోను చూసిన చాలా మంది వినియోగదారులు తమ వివిధ రకాల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇలాంటి పనులు చేయడంలో మన భారతదేశ ప్రజానీకం ముందుంటుందని ఒకరు కామెంట్ చేయగా, ఇది ప్రేమ వివాహం కాదు.. బ్రో.. రైలు వివాహం అంటూ మరో వినియోగదారు ఫన్నీగా కామెంట్‌ చేశారు. ఇలాంటి అరుదైన ఘటనలు కేవలం మన దేశంలో మాత్రమే జరుగుతాయని మరికొందరు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us