Health Tips: ముక్కు దిబ్బడ సమస్యతో ఇబ్బందిపడుతున్నారా..? ఈ వంటింటి చిట్కాలతో తక్షణ ఉపశమనం ..
జలుబు, ముక్కు దిబ్బడ కారణంగా చాలా మందికి తలనొప్పి కూడా వేధిస్తుంది. కానీ, మీరు కొన్ని సులభమైన ఇంటి నివారణలతో దీనికి చక్కటి ఉపశమనం పొందుతారు. నాసికా శ్లేష్మం క్లియర్ చేయడానికి సులభమైన మరియు ప్రభావవంతమైన హోం రెమెడీ మీకు క్షణాల్లో ఊరట నిస్తుంది. మీరు హాయిగా ఊపిరి పీల్చుకునేలా చేస్తుంది. ఇందుకోసం తప్పని సరిగా రెండు, మూడు గంటలకు ఒకసారి ముక్కును శుభ్రం చేసుకోవాలి.
వాతావరణంలో మార్పు, పెరుగుతున్న చలి కారణంగా ప్రజలు తరచుగా జలుబు, దగ్గు, ముక్కు మూసుకుపోవడం వంటి సమస్యలతో సతమతమవుతుంటారు. చలికాలంలో ఇది ప్రతి ఒక్కరికీ సాధారణ సమస్య. కానీ, ఇది మీ గొంతును కూడా ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా చాలా మందికి తలనొప్పి కూడా వేధిస్తుంది. కానీ, మీరు కొన్ని సులభమైన ఇంటి నివారణలతో దీనికి చక్కటి ఉపశమనం పొందుతారు. నాసికా శ్లేష్మం క్లియర్ చేయడానికి సులభమైన మరియు ప్రభావవంతమైన హోం రెమెడీ మీకు క్షణాల్లో ఊరట నిస్తుంది. మీరు హాయిగా ఊపిరి పీల్చుకునేలా చేస్తుంది. ఇందుకోసం తప్పని సరిగా రెండు, మూడు గంటలకు ఒకసారి ముక్కును శుభ్రం చేసుకోవాలి.
1. ముక్కు లోపలి భాగాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి..
వెచ్చని నీటితో ముక్కు లోపల శుభ్రం చేయడం అనేది నాసికా శ్లేష్మం తొలగించడానికి సులభమైన, సమర్థవంతమైన ఇంటి నివారణగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో ఒక చెంచా ఉప్పు కలపండి. దీంతో మీ ముక్కులను శుభ్రం చేసుకోండి.. దీంతో ముక్కులో ఉండే శ్లేష్మం కరుగుతుంది. ఫలితంగా ముక్కు రంధ్రాలు క్లియర్ అవుతాయి.. శ్వాస సరిగ్గా ఆడుతుంది.
2. అల్లం – తేనె వాడకం
అల్లం మరియు తేనె యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి తేనెలో కలపండి. క్షణాల్లో ఫలితాలు కనిపిస్తాయి. ముక్కు దిబ్బడ మిమల్ని విడిచిపెట్టి శ్వాసకు ఎలాంటి అటంకం లేకుండా ఉంటుంది.
3. తులసి ఆకులు..
తులసి ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. ఇవి శ్వాస తీసుకోవడంలో, ముక్కును శుభ్రపరచడంలో సహాయపడతాయి. తులసి ఆకుల సహాయంతో హెర్బల్ టీ తయారు చేసి తాగండి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
4. ఆవాలు
ముక్కు దిబ్బడ నుండి ఉపశమనం పొందడానికి ఆవాలు ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి.. ఆ తర్వాత ఆవపిండిని ఆరబెట్టి, ఒక గుడ్డలో చుట్టి మీ ముక్కుతో తరచూ వాసన చూసేందుకు ప్రయత్నించండి.
5. వేడి టీ
అల్లం, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, ఉప్పుతో వేడి టీ తాగడం వల్ల ముక్కు క్లియర్ అవుతుంది.
6. ఆవాల నూనె
రాత్రి పడుకునే ముందు, మీ ముక్కులో ఒక చుక్క లేదా రెండు చుక్కల ఆవాల నూనె వేయండి. ఇది నాసికా రద్దీని తగ్గించడంలో సహాయపడుతుంది.
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..