ఇండిగో విమానంలో సీటు కుషన్‌ మిస్సింగ్‌.. మహిళా ప్రయాణికురాలికి ఎదురైన వింత అనుభవం.. మరేం చేశారంటే..

ఇండిగో విమానం (6ఈ-6798)లో ప్రయాణించేందుకు తన భార్య సాగరిక టిక్కెట్లు బుక్ చేసినట్లు సుబ్రతా పట్నాయక్ తెలిపారు. సాగరికకు ఎయిర్‌లైన్స్ కిటికీ దగ్గర సీటు నంబర్ 10ఎ కేటాయించింది. అయితే ఫ్లైట్‌ ఎక్కిన సాగరికకు సీట్‌పై కుషన్‌ కనిపించలేదని చెప్పాడు. దాంతో ముందుగా కాస్త కంగారుపడిన సాగరిక చుట్టూ చూసింది.. ఎక్కడైనా సీటు కుషన్‌ పడిపోయి ఉంటుందని భావించి చుట్టుపక్కల వెతికింది. కానీ కుషన్ దొరకలేదు. అనంతరం క్యాబిన్‌ సిబ్బందికి ఫోన్‌ చేసి ఈ విషయం చెప్పారు.

ఇండిగో విమానంలో సీటు కుషన్‌ మిస్సింగ్‌.. మహిళా ప్రయాణికురాలికి ఎదురైన వింత అనుభవం.. మరేం చేశారంటే..
Missing Seat Cushion
Follow us

|

Updated on: Nov 27, 2023 | 4:13 PM

సాధారణంగా అందరూ ప్రయాణాలు చేస్తుంటారు. ఆటోలు, కార్లు, బస్సులు, రైళ్లలో సాధారణం కంటే ఎక్కువ మంది ప్రజలు ప్రయాణిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో కొన్ని కొన్ని సార్లు బస్సులో, రైల్లో సీట్లు విరిగిపోయి ఉండటం, లేదా సీటు కుషన్‌ పాడైపోయి ఉండటం చూస్తుంటాం.. కానీ, విమానంలో ప్రయాణించే వారికి ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా ఉంటుందో ఊహించుకోండి..వినడానికి వింతగా అనిపించినా నిజంగా అలాంటి ఘటనే జరిగింది..ఇండిగో విమానయాన సంస్థకు చెందిన ఓ విమానంలో ఇలాంటి దృశ్యం వెలుగులోకి వచ్చింది. ఇండిగో విమానంలో ప్రయాణించేందుకు వచ్చిన నాగ్‌పూర్‌కు చెందిన సాగరిక పట్నాయక్‌కు ఊహించని షాక్‌ తగిలినట్టైంది.. తనకు కేటాయించిన సీటుకు కుషన్‌ లేకుండానే ఉంది. దాంతో ఆ మహిళ ప్రయాణికురాలు ఒక్కసారిగా అవాక్కైంది. ఏం చేయాలో అర్థంకాక.. ఇక్కడ ఎలా కూర్చుంటారంటూ విమానంలో గందరగోళం సృష్టించింది. దాంతో వెంటనే అలర్ట్‌ అయిన విమాన సిబ్బంది మరొక కుషన్‌ను తీసుకువచ్చారు, ఆ తర్వాత ఆమె తన ప్రయాణాన్ని కొనసాగించింది.. దీనిపై సదరు మహిళ భర్త సుబ్రతా పట్నాయక్ ఎక్స్ పోస్ట్ ద్వారా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఫిర్యాదు చేశారు.

ఆదివారం పూణే నుంచి నాగ్‌పూర్‌కు ఇండిగో విమానం (6ఈ-6798)లో ప్రయాణించేందుకు తన భార్య సాగరిక టిక్కెట్లు బుక్ చేసినట్లు సుబ్రతా పట్నాయక్ తెలిపారు. సాగరికకు ఎయిర్‌లైన్స్ కిటికీ దగ్గర సీటు నంబర్ 10ఎ కేటాయించింది. అయితే ఫ్లైట్‌ ఎక్కిన సాగరికకు సీట్‌పై కుషన్‌ కనిపించలేదని చెప్పాడు. దాంతో ముందుగా కాస్త కంగారుపడిన సాగరిక చుట్టూ చూసింది.. ఎక్కడైనా సీటు కుషన్‌ పడిపోయి ఉంటుందని భావించి చుట్టుపక్కల వెతికింది. కానీ కుషన్ దొరకలేదు. అనంతరం క్యాబిన్‌ సిబ్బందికి ఫోన్‌ చేసి ఈ విషయం చెప్పారు.

ఇవి కూడా చదవండి

విమానంలో బోర్డింగ్ ఇంకా కొనసాగుతోందని, ఫ్లైట్‌ ఎక్కిన తన భార్య మాత్రం మధ్యలోనే నిలబడాల్సి వచ్చిందని అతడు వాపోయాడు. దాంతో ఇతర ప్రయాణీకులకు కూడా తన వల్ల ఇబ్బంది పడ్డారని సుబ్రతా పట్నాయక్ చెప్పారు. తరువాత ఒక సిబ్బంది మరొక సీటు నుండి వేరొక కుషన్ తెచ్చి పెట్టారు. విమానం టేకాఫ్‌కు రెడీ అయ్యేందుకు ముందుగానే.. క్లీనింగ్ టీమ్ విమానాన్ని పూర్తిగా చెక్‌ చేయాల్సి ఉంటుందని చెప్పారు. మరేందుకు ఎవరూ పట్టించుకోలేదో తెలియదని ఆగ్రహంతో చెశారు సుబ్రత.. కానీ, ఇలాంటి కుషన్‌ లేకుండా ఉన్న సీటును ఎవరూ గమనించకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విమానంలోకి ముందుగా ఎక్కిన సిబ్బంది కూడా దీన్ని చూడకపోవటం మరింత ఆశ్చర్యకరంగా ఉందన్నారు.

X (గతంలో ట్విటర్)లో సుబ్రతాకు ప్రత్యుత్తరం ఇస్తూ, కొన్నిసార్లు సీటు కుషన్ దాని వెల్క్రో నుండి వేరు చేసి ఉంటుందని చెప్పారు. దీన్ని క్రూ మెంబర్ మళ్లీ ఇన్‌స్టాల్ చేస్తారని అన్నారు. మీకు ఎదురైన సమస్య పట్ల సమీక్ష కోసం సంబంధిత బృందానికి తెలియజేశామన్నారు.. మీ ఫిర్యాదు పరిగణనలోకి తీసుకున్నామని ఇండిగో తెలియజేసింది. భవిష్యత్తులో వారికి మెరుగైన సేవలందిస్తామని ఆశిస్తున్నామని చెప్పింది.

ఇలాంటి అజాగ్రత్త ఇప్పుడు సర్వసాధారణమైపోయిందని తరచూ ప్రయాణించే కనిష్క్ గుప్తా అన్నారు. నెల రోజుల క్రితం తాను ఢిల్లీ నుంచి కెనడాకు ఇండిగో విమానంలో వెళ్లినట్లు చెప్పారు. విమానంలో స్క్రీన్ పనిచేయకపోవడాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. ఏవియేషన్ అనలిస్ట్, నిపుణుడు ధైర్యషీల్ వందేకర్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ విమానయాన సంస్థలు విరిగిన లేదా ఉపయోగించలేని సీట్లను ప్రయాణికులకు అందించకూడదని అన్నారు. ఈ విషయంలో ఇప్పటికే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఇండిగో ఎయిర్‌లైన్‌ను హెచ్చరించింది. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు జరుగుతుంటే డీజీసీఏ చర్యలు తీసుకోవాలి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..