AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: కారులో డ్రైవర్ లేకుండానే షికారు.. మహిళ ప్రయాణికురాలి అనుభవం అద్భుతమంటూ..వీడియో వైరల్‌

ఈ వీడియో అతి తక్కువ సమయంలో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. దీని వీక్షణలు 14 మిలియన్లకు చేరుకున్నాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా దీనిపై తీవ్రంగా వ్యాఖ్యానిస్తున్నారు. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇది మహిళలకు అత్యంత సురక్షితమైనదని కొందరు అంటున్నారు. దీంతో ఉపాధికి ఇబ్బందులు తలెత్తుతాయని మరికొందరు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి కార్లు ఇండియాకు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నామంటూ మరికొందరు వ్యాఖ్యానించారు.

Watch Video: కారులో డ్రైవర్ లేకుండానే షికారు.. మహిళ ప్రయాణికురాలి అనుభవం అద్భుతమంటూ..వీడియో వైరల్‌
Driverless Car
Jyothi Gadda
|

Updated on: Nov 26, 2023 | 9:41 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికత నిరంతరం అభివృద్ధి చెందుతోంది. 10 సంవత్సరాల క్రితం మనం అనుకున్నవి ప్రస్తుతం సాంకేతికత సహాయంతో నేడు జరిగిపోతున్నాయి. డ్రైవర్ లేకుండా కారు నడవగలదా అని కొన్నిసార్లు మనం ఆశ్చర్యపోతుంటాము.. కానీ, నేడు టెక్నాలజీ ఎంత స్థాయికి చేరుకుందంటే..మార్కెట్లలో డ్రైవర్ లెస్ కార్లు వస్తున్నాయని, రోడ్లపై వెళ్లే డ్రైవర్ లెస్ కార్లను చూసినప్పుడు మనకు ముందుగా గ్రాఫిక్‌ సినిమాలే గుర్తుకు వస్తాయి. కానీ, సినిమాల్లో డ్రైవర్ లేకుండా కారు ఎలా నడుస్తుందో అలాంటి స్టోరీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ భారతీయుడు విదేశాల్లో డ్రైవర్‌లేని కారులో ప్రయాణించిన తర్వాత తన అనుభవాన్ని వివరిస్తున్నాడు. ఆ వీడియో  వైరల్ గా మారి ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది…

వైరల్‌ అవుతున్న వీడియోలో కనిపించిన నేహా దీపక్ షా 2015లో మాస్టర్‌చెఫ్ ఇండియా సీజన్ 4లో పోటీదారుగా నటించారు. ప్రస్తుతం ఆమె కొద్ది రోజుల క్రితం అమెరికాలో సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీలో ప్రయాణించిన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ కారులో ప్రయాణిస్తున్నప్పుడు తనకు టార్జాన్ ది వండర్ గుర్తుకు వచ్చిందని ఆమె చెప్పింది. డ్రైవర్ లేకుండా ఆ కారు ఎలా నడిచిందో తను నెటిజన్లకు వివరిస్తూ వీడియో రిలీజ్ చేసింది. ఈ డ్రైవర్ లేని ప్రయాణంలో తను ఎంతో థ్రిల్‌ అనుభవించానని చెప్పింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, ఇది తన మొదటి డ్రైవర్‌లెస్ సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీ అని రాశారు. తన అనుభవాన్ని వివరిస్తూ.. ఈ ట్యాక్సీలో ప్రయాణిస్తుంటే తనకు భారతీయ సినిమా టార్జాన్ ది వండర్ గుర్తుకు వస్తుందని చెప్పారు. ఆమె ప్రయాణం చాలా అద్భుతంగా సాగిందని వివరించారు.

ఆమె షేర్‌ చేసిన ఈ వీడియో అతి తక్కువ సమయంలో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. దీని వీక్షణలు 14 మిలియన్లకు చేరుకున్నాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా దీనిపై తీవ్రంగా వ్యాఖ్యానిస్తున్నారు. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇది మహిళలకు అత్యంత సురక్షితమైనదని కొందరు అంటున్నారు. దీంతో ఉపాధికి ఇబ్బందులు తలెత్తుతాయని మరికొందరు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి కార్లు ఇండియాకు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నామంటూ మరికొందరు వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్  న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఏపీలో మరో కొత్త రైల్వే లైన్.. మరో ముందడుగు
ఏపీలో మరో కొత్త రైల్వే లైన్.. మరో ముందడుగు
కండక్టర్‌తో పని లేకుండా యాప్‌లోనే టికెట్ పొందొచ్చు.. ఎలా అంటే..?
కండక్టర్‌తో పని లేకుండా యాప్‌లోనే టికెట్ పొందొచ్చు.. ఎలా అంటే..?
ఓటీటీలో రేణూ దేశాయ్ 'కాశీ మజిలీ'.. గుండెను తాకే ఈ పాట విన్నారా?
ఓటీటీలో రేణూ దేశాయ్ 'కాశీ మజిలీ'.. గుండెను తాకే ఈ పాట విన్నారా?
గ్రూప్ దశ తర్వాతే అసలు ఆట.. వరల్డ్‌కప్‌లో ‘సూపర్-7’ స్టేజ్ ఏంటంటే
గ్రూప్ దశ తర్వాతే అసలు ఆట.. వరల్డ్‌కప్‌లో ‘సూపర్-7’ స్టేజ్ ఏంటంటే
ఆసియా గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకాల పంట.. ఒక్కరోజే 4
ఆసియా గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకాల పంట.. ఒక్కరోజే 4
హైదరాబాద్‌లో పాకిస్తాన్‌ కాస్మెటిక్స్‌ కలకలం..!
హైదరాబాద్‌లో పాకిస్తాన్‌ కాస్మెటిక్స్‌ కలకలం..!
ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. వాతావరణశాఖ హెచ్చరిక
ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. వాతావరణశాఖ హెచ్చరిక
రెండో గోల్డ్ మెడల్ కొట్టేందుకు సిద్ధమవుతున్న ఐదుగురు స్టార్స్
రెండో గోల్డ్ మెడల్ కొట్టేందుకు సిద్ధమవుతున్న ఐదుగురు స్టార్స్
రైల్వేలో భారీఉద్యోగ నోటిఫికేషన్‌.. టెన్త్ మార్కులతో నేరుగా జాబ్స్
రైల్వేలో భారీఉద్యోగ నోటిఫికేషన్‌.. టెన్త్ మార్కులతో నేరుగా జాబ్స్
SSC కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల షెడ్యూల్ 2026 వచ్చేసిందోచ్..
SSC కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల షెడ్యూల్ 2026 వచ్చేసిందోచ్..