మెట్రోలో సరిపొయింది.. ఇప్పుడు ఇండియన్ రైల్వే మీద పడ్డారు.. కదులుతున్న రైల్లో రెచ్చిపోయిన అమ్మాయిలు..

ఇలాంటి వారిని అరికట్టడానికి ఇండియన్‌ రైల్వే ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరీ. రైల్వేలు ఇలాంటి వీడియోలను తీసే వారి పట్ల  నిర్లక్ష్యం చేస్తూనే ఉంటే వారు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది.. అలాంటి వ్యక్తుల వీడియోలు మరిన్ని తెరపైకి వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే, భారతదేశంలోని యువత తమ భవిష్యత్తు కంటే సోషల్ మీడియాలో తమ ఫాలోవర్ల గురించి ఎక్కువగా ఆరాటపడుతుంటారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం ఆ అమ్మాయిలు చేసిన పనికి మండిపడుతున్నారు. తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.

మెట్రోలో సరిపొయింది.. ఇప్పుడు ఇండియన్ రైల్వే మీద పడ్డారు.. కదులుతున్న రైల్లో రెచ్చిపోయిన అమ్మాయిలు..
Indian Railway Viral Video
Follow us
Jyothi Gadda

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 26, 2023 | 9:18 PM

ఇప్పటి వరకు ఢిల్లీ మెట్రో అనేక రీల్స్ వీడియోలను చూసి ఉంటారు. దీనిపై పెద్దఎత్తున దుమారం రేగింది. కానీ, అలాంటి వీడియోలు చేసే వాళ్ల చర్యలు మాత్రం ఇప్పటి వరకు ఆగలేదు. ఇటీవల, ఢిల్లీ మెట్రో అనేక అసభ్యకరమైన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత దానిని నిషేధించడానికి అనేక నిబంధనలు విధించబడ్డాయి. ఢిల్లీ మెట్రో ఇప్పటికే అశ్లీల వీడియోలతో అపఖ్యాతి పాలైంది. కానీ ఇప్పుడు భారతీయ రైల్వేలను కూడా వదిలిపెట్టడం లేదు.. కదులుతున్న రైలులో ఇద్దరు అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో ఇద్దరు అమ్మాయిలు భోజ్‌పురి పాటలపై మత్తులో డ్యాన్స్ చేస్తున్నారు. రైలులో మరికొందరు ప్రయాణీకులు ఉన్నారని వారిద్దరూ అస్సలు పట్టించుకోవటం లేదు. అలాగే ఈ అమ్మాయిలకు మరెలాంటి భయం కూడా లేదని అర్థమవుతుంది. బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి వీడియోలు చేయడం నిబంధనలకు విరుద్ధమని బహుశా వారికి తెలియకపోవచ్చు.

కదులుతున్న రైలులో ఇద్దరు అమ్మాయిలు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ పాట చాలా బాగుంది, కానీ అలాంటి వీడియోలు పాటకు కూడా చెడ్డపేరు తెస్తున్నాయి.. అయితే ఈ వీడియో ఎక్కడి నుంచి, ఏ ట్రైన్‌కి చెందినది అనేది వైరల్ అవుతున్న వీడియోలో స్పష్టంగా తెలియలేదు. కానీ, బ్యాక్‌ గ్రౌండ్‌లో చాలా భోజ్‌పురి పాటలు ప్లే చేయబడుతున్నాయి. ఇది ఖచ్చితంగా బీహార్ లేదా యుపిలోని ఏదో ఒక ప్రదేశం నుండి వచ్చిన వీడియో కావచ్చు. ఎందుకంటే, ఈ రెండు రాష్ట్రాల్లో భోజ్‌పురి ఎక్కువగా మాట్లాడతారు. పాటలు కూడా ఎక్కువగా వినిపిస్తుంటాయి.

ఇవి కూడా చదవండి

ఇలాంటి వారిని అరికట్టడానికి ఇండియన్‌ రైల్వే ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరీ. రైల్వేలు ఇలాంటి వీడియోలను తీసే వారి పట్ల  నిర్లక్ష్యం చేస్తూనే ఉంటే వారు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది.. అలాంటి వ్యక్తుల వీడియోలు మరిన్ని తెరపైకి వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే, భారతదేశంలోని యువత తమ భవిష్యత్తు కంటే సోషల్ మీడియాలో తమ ఫాలోవర్ల గురించి ఎక్కువగా ఆరాటపడుతుంటారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం ఆ అమ్మాయిలు చేసిన పనికి మండిపడుతున్నారు. తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..