AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: మహిళ షూ దొంగిలించిన డెలివరీ బాయ్.. మళ్లీ రాత్రి 10 గంటలకు వచ్చి!

మహిళ షూ దొంగిలించాడు ఓ డెలివరీ బాయ్. ఈ మధ్య డెలివరీ బాయ్ లు పలు రకాల దొంగతనాలకు తెగబడుతున్నారు. డెలివరీ పేరు చెప్పి ఇంట్లో చోరీ చేసిన సంఘటనలు ఇప్పటికే చాలా వెలుగు చూశాయి. తాజాగా ఢిల్లీలో బ్లింకిట్ కి చెందిన ఓ డెలివరీ బాయ్ మహిళ షూను దొంగిలించాడు. అలాతే తనఇంటి చుట్టూ ఎలా తిరుగుతున్నాడో.. ఎంత భయానికి గురయ్యారో అన్న విషయాన్ని కెప్టెన్ మోనికా ఖన్నా ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేశారు. హొమ్ డెలివరీ బాయ్ సేవలపై ఆందోళన వ్యక్తం చేశారు. బ్లింకిట్ డెలివరీ వ్యక్తి ఆర్డర్ డెలివరీ చేసిన..

Viral News: మహిళ షూ దొంగిలించిన డెలివరీ బాయ్.. మళ్లీ రాత్రి 10 గంటలకు వచ్చి!
Viral News
Chinni Enni
|

Updated on: Nov 27, 2023 | 2:21 PM

Share

మహిళ షూ దొంగిలించాడు ఓ డెలివరీ బాయ్. ఈ మధ్య డెలివరీ బాయ్ లు పలు రకాల దొంగతనాలకు తెగబడుతున్నారు. డెలివరీ పేరు చెప్పి ఇంట్లో చోరీ చేసిన సంఘటనలు ఇప్పటికే చాలా వెలుగు చూశాయి. తాజాగా ఢిల్లీలో బ్లింకిట్ కి చెందిన ఓ డెలివరీ బాయ్ మహిళ షూను దొంగిలించాడు. అలాతే తనఇంటి చుట్టూ ఎలా తిరుగుతున్నాడో.. ఎంత భయానికి గురయ్యారో అన్న విషయాన్ని కెప్టెన్ మోనికా ఖన్నా ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేశారు. హొమ్ డెలివరీ బాయ్ సేవలపై ఆందోళన వ్యక్తం చేశారు. బ్లింకిట్ డెలివరీ వ్యక్తి ఆర్డర్ డెలివరీ చేసిన తర్వాత తన షూలను ఎలా దొంగిలించాడో ఖన్నా చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని షేర్ చేశారు. ఆర్డర్ ఇచ్చిన కిరాణా సామాగ్రిని డెలివరీ చేసిన తర్వాత అతను లిఫ్ట్ లోకి ప్రేశించి కొన్ని సెకన్ల తర్వాత మళ్లీ కనిపించాడు. ఖన్నా బూట్లను పట్టుకుని తన జాకెట్ లోపల దాచుకున్నాడు.

ఈ సంఘటనతో తీవ్ర భయాందోళనకు గురయ్యాం:

అనంతరం ఖన్నా మాట్లాడుతూ.. బ్లింకిట్ నుండి సరైన వాగ్ధానాలు ఉన్నప్పటికీ.. ఆ వక్తి రాత్రి 10 గంటలకు చెప్పకుండా తిరిగి వచ్చాడు. అంతే కాకుండా బ్లింకిట్ యొక్క గ్రీవెన్స్ ఆఫీసర్ నా చిరునామా గోప్యంగా ఉంచబడుతుందని, డెలివరీ చేసే వ్యక్తి నా ఇంటికి చేరుకోలేడని హామీ ఇచ్చారు. కానీ ఇఫ్పుడు నా భద్రత ఉల్లంఘించ బడింది. డెలివరీ బాయ్ అర్థరాత్రి ఊహించని విధంగా మళ్లీ ఇంటికి చేరుకుని కాలింగ్ బెల్ కొట్టడంతో తను చాలా భయానికి గురైనట్లు ఖన్నా చెప్పుకొచ్చారు.

ఈ సంఘటన హైపర్ లోకల్ డెలివరీల ప్రమాదాన్ని బహిర్గతం చేసిందని ఖన్నా తెలిపారు. ఆ వ్యక్తి తన ఇంటికి తిరిగి రావచ్చని, తన కుటుంబాన్ని నిరంతరం ఆందోళనకు గురి చేస్తుందని ఆమె చెప్పింది. ఈ సంఘటన ఖన్నా కుటుంబాన్ని, ఆమె ఇంటి వద్ద భద్రతను పెంచేలా చేసిందన్నారు. మీరు మా భద్రతకు ఎలా హామీ ఇస్తారు? నిరోధించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అని ఖన్నా బ్లింకిట్ యాజమాన్యాన్ని ప్రశ్నించింది.

నెటిజన్స్ రియాక్షన్స్:

కాగా ఈ సంఘటనపై నెటిజన్లు పలు రకాలు రియాక్ట్ అవుతున్నారు. ‘ది నిజంగానే భయంకరమైన ఘటన.. అతను మళ్లీ వచ్చాడంటే ఎంత ధైర్యం ఉంది’. మరో నెటిజన్.. ‘మీరు మీ డోర్ దగ్గర పెప్పర్ స్ప్రే పెట్టుకోవడం మంచిది. మీకు ఎప్పుడు అవసరం పడుతుందో తెలియదు’. ఇంకో నెటిజన్ స్పందిస్తూ.. 40 ఏళ్లకు చేరువలో ఉన్న ఒక మహిళగా నా సలహా ఏంటంటే.. ఈ వ్యక్తులను మీ ఇంటి గుమ్మం వరకు అనుమతించవద్దు. వారిని మీ డోర్ ముందు నిలబడనివ్వద్దు. నేను ఎప్పుడూ నా డెలివరీ మహిళలను పిలుస్తాను. అలాగే వారిని మెట్ల మీదనే ఉండమనండి. డోర్ ని లోపల నుంచి లాక్ వేసి ఉంచండి. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి’. అని పేర్కొన్నారు.