AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur: సెల్ఫీల పిచ్చి పీక్స్‌కు.. పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో చూశారా?

నేను ముందు అంటే నేను ముందు అంటూ పోటీ పడ్డారు. ఆ పోటీ కాస్తా మాటల యుద్దానికి దారి తీసింది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. అంతటితో ఆగలేదు. ఒకరి జుట్టు మరొకరు పట్టుకున్నారు. పరస్పరం ముష్టి యుద్దానికి దిగారు. ఐదు పది నిమిషాలు కాదు ఏకంగా గంట పాటు ఈ వివాదం కొనసాగింది. ఇంతకు అసలు గొడవ ఎందుకు అంటారు. అదే కదా మీ ప్రశ్న... అయితే ఈ స్టోరీ చదవండి.

Guntur: సెల్ఫీల పిచ్చి పీక్స్‌కు.. పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో చూశారా?
Girls Fighting
T Nagaraju
| Edited By: Ram Naramaneni|

Updated on: Nov 27, 2023 | 2:13 PM

Share

నేను ముందు అంటే నేను ముందు అంటూ పోటీ పడ్డారు. ఆ పోటీ కాస్తా మాటల యుద్దానికి దారి తీసింది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. అంతటితో ఆగలేదు. ఒకరి జుట్టు మరొకరు పట్టుకున్నారు. పరస్పరం ముష్టి యుద్దానికి దిగారు. ఐదు పది నిమిషాలు కాదు ఏకంగా గంట పాటు ఈ వివాదం కొనసాగింది. ఇంతకు అసలు గొడవ ఎందుకు అంటారు. అదే కదా మీ ప్రశ్న… అయితే ఈ స్టోరీ చదవండి…

గుంటూరు నగరంలో ఈ నెల ఆరో తేదిన గాంధీ పార్క్ ను ప్రారంభించారు. నగరంలో ఉన్న అతి పెద్ద ఏకైక పార్క్ గాంధీ పార్కే కావటంతో పెద్ద ఎత్తున చిన్న పిల్లలతో మహిళలు క్యూ కడుతున్నారు. ఇక వీకెండ్స్ లో అయితే వేలల్లోనే పార్క్ ను సందర్శించడానికి స్థానికులు వస్తున్నారు. పార్క్ ను ఆధునీకరించడంతో పాటు చిన్న పిల్లల కోసం ప్రత్యేకం గేమ్ జో్న్, టాయ్ ట్రెయిన్, సెల్ఫీ పాయింట్ వంటివి ఏర్పాటు చేశారు. దీంతో పార్క్ కు వచ్చే స్థానికులు సెల్ఫీ పాయింట్ వద్ద సెల్ఫీలు తీసుకునేందుకు మక్కువ చూపుతున్నారు. చిన్నారులతో పాటు పెద్దలు కూడా వింగ్స్ సెల్ఫీ పాయింట్ ఫోటో దిగేవందుకు పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఈ వింగ్స్ సెల్ఫీ పాయింటే వివాదానికి కారణమైంది. నిన్న ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున స్థానికులు పార్క్ కు వచ్చారు. దీంతో సెల్పీ పాయింట్ వద్ద రష్ పెరిగింది. ఒకరి తర్వాత మరొకరు సెల్ఫీ దిగడానికి సమయం పట్టింది.

ఈ క్రమంలోనే ఇద్దరూ మహిళల మధ్య వివాదం మొదలైంది. మేము ముందు సెల్ఫీ దిగాలంటే మేము అంటూ పోటీ పడ్డారు. దీంతో మాటల యుద్దం దాటి చేతల యుద్దానికి దారితీసింది. ఒకరి జుట్టూ మరొకరు పట్టుకుని పరస్పరం దాడులు చేసుకున్నారు. అయితే మహిళలు కొట్టుకుంటుంటే చుట్టూ చేరిన మగవాళ్లు మాత్రం వాళ్లని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మరొక వైపు సెక్యూరిటీ గార్డ్స్ కూడా గొడవ ఆపేందుకు రాలేదు. దీంతో దాదాపు గంట పాటు మహిళలు ఘర్షణ పడ్డారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘర్షణను కొంతమంది సెల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ వీడియో హల్ చల్ చేసింది. పార్క్ లో గొడవలు జరగకుండా చూడాల్సిన సిబ్బంది నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

అమ్మాయిల కొట్లాట.. వీడియో

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..