Koose Munisamy Veerappan OTT: ఓటీటీలోకి వీరప్పన్‌ వెబ్‌ సిరీస్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ జీవిత కథ ఆధారంగా చేసుకుని ఇప్పటికే పలు సినిమాలు, డాక్యుమెంటరీలు వచ్చాయి. ఇప్పుడు ఆయన జీవితంలోని మరిన్ని రహస్యాలను చెబుతామంటూ మరో వెబ్‌ సిరీస్‌ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కూసే మునిస్వామి వీరప్పన్ అనే పేరుతో తెరకెక్కిన ఈ డాక్యుమెంటరీ వెబ్‌ సిరీస్‌

Koose Munisamy Veerappan OTT: ఓటీటీలోకి వీరప్పన్‌ వెబ్‌ సిరీస్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Koose Munisamy Veerappan Web Series
Follow us
Basha Shek

|

Updated on: Nov 26, 2023 | 5:27 PM

గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ జీవిత కథ ఆధారంగా చేసుకుని ఇప్పటికే పలు సినిమాలు, డాక్యుమెంటరీలు వచ్చాయి. ఇప్పుడు ఆయన జీవితంలోని మరిన్ని రహస్యాలను చెబుతామంటూ మరో వెబ్‌ సిరీస్‌ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కూసే మునిస్వామి వీరప్పన్ అనే పేరుతో తెరకెక్కిన ఈ డాక్యుమెంటరీ వెబ్‌ సిరీస్‌ డిసెంబర్ 8 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ డాక్యుమెంటరీ సిరీస్‌ అందుబాటులోకి రానుంది. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది జీ 5. అలాగే కూసే మునిస్వామి వీరప్పన్ సిరీస్‌ ట్రైలర్‌ను కూడా రిలీజ్‌ చేసింది. వీరప్పన్‌ జీవితానికి సంబంధించి లోతైన అధ్యయనం చేసి ఈ ఒరిజినల్‌ సిరీస్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో వీరప్సన్‌ సన్నిహితులు, అలాగే ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసు అధికారుల వెర్షన్‌ను కూడా ట్రైలర్‌ లో చూపించారు.

వీరప్పన్‌ చుట్టూ జరిగిన పలు ఘటనలను ఈ డాక్యుమెంటరీ సిరీస్‌లో పొందు పరిచారు. ట్రైలర్‌ చివరిలో వీరప్పన్ స్వయంగా నెరేషన్ ఇవ్వడం గమనార్హం. కాగా అడవుల్లోకి పారిపోయి దాచుకుని దాదాపు మూడు దశాబ్దాల పాటు తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలకు చుక్కలు చూపించాడు. ఆయన జీవితాన్ని ఆధారంగా చేసుకున గతంలో రామ్‌ గోపాల్‌ వర్మ కిల్లింగ్‌ వీరప్పన్‌ సినిమాను తెరకెక్కించారు. ఇందులో బందిపోటును పట్టుకునే పోలీస్‌ అధికారి పాత్రలో కన్నడ సూపర్‌ స్టార్‌ శివ రాజ్‌ కుమార్‌ నటించాడు. ఇక కన్నడ, తమిళ్‌ భాషల్లోనూ వీరప్పన్‌పై పలు సినిమాలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

డిసెంబర్ 8 నుంచి అందుబాటులోకి..

కూసే మునిస్వామి వీరప్పన్ డాక్యుమెంటరీ సిరీస్ ట్రైలర్..

తెలుగులోనూ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే