Chaaver OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో మలయాళ యాక్షన్‌ థ్రిల్లర్‌.. తెలుగులో కూడా స్ట్రీమింగ్‌.. ఎక్కడంటే?

ఓటీటీల పుణ్యమా అని మలయాళ సినిమాలకు దేశ వ్యాప్తంగా క్రేజ్‌ వచ్చింది. ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ మాలీవుడ్‌ మూవీస్‌కు బాగా కనెక్ట్‌ అవుతున్నారు. అందుకే పలు ఓటీటీ సంస్థలు ప్రతి వారం మలయాళ సినిమాలను తెలుగులోకి డబ్‌ చేసి మరీ ఇక్కడి ఆడియెన్స్‌కు అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

Chaaver OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో మలయాళ యాక్షన్‌ థ్రిల్లర్‌.. తెలుగులో కూడా స్ట్రీమింగ్‌.. ఎక్కడంటే?
Chaaver Movie
Follow us
Basha Shek

|

Updated on: Nov 25, 2023 | 8:35 AM

ఓటీటీల పుణ్యమా అని మలయాళ సినిమాలకు దేశ వ్యాప్తంగా క్రేజ్‌ వచ్చింది. ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ మాలీవుడ్‌ మూవీస్‌కు బాగా కనెక్ట్‌ అవుతున్నారు. అందుకే పలు ఓటీటీ సంస్థలు ప్రతి వారం మలయాళ సినిమాలను తెలుగులోకి డబ్‌ చేసి మరీ ఇక్కడి ఆడియెన్స్‌కు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అలా వచ్చిన 2018, పద్మినీ, ఆర్‌డీఎక్స్‌, కన్నూర్ స్క్వాడ్‌ సినిమాలు తెలుగు ఓటీటీ ప్రేక్షకులను బాగా అలరించాయి. ఇప్పుడు మరొక మలయాళ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అదే మలయాళ వర్సటైల్‌ హీరో కుంచకో బోబన్‌ నటించిన చావర్‌. అక్టోబర్‌ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అక్కడ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. పొలిటికల్ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ చావర్‌ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సోనీ లివ్‌ ఈ సూపర్‌ హిట్‌ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (నవంబర్‌ 24) నుంచి చావర్‌ సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇక చావర్‌ సినిమా కథ విషయానికి వస్తే.. న‌లుగురు రాజ‌కీయ గుండాలు ఓ హ‌త్య కేసులో ఇరుక్కోవ‌డం దాని నుంచి త‌ప్పించుకునేందుకు వారు చేసే పోరాటంతో సినిమా సాగుతుంది. పొలిటిక‌ల్‌ పార్టీలు న‌డిపే రాజ‌కీయం, ప‌గ‌లు, ప్ర‌తీకారాల నేప‌థ్యంలో ఆద్యంతం ఎంతో ఉత్కంఠ రేపుతుంది. దీనికి బ్యా గ్రౌండ్‌ మ్యూజిక్‌ స్పెషల్ అట్రాక్షన్‌. టిను పప్పచన్‌ తెరకెక్కించిన చావర్ సినిమాలో ఆంటోని వ‌ర్గీస్‌, అర్జున్ ఆశోక‌న్‌, స‌జ్జిన్ గోపు, సంగీత మాధవన్‌ నాయర్‌, జోయ్‌ మాథ్యూ, రెంజి పానికర్‌, అనురూప్‌, మనోజ్‌, దీపక్‌ పరంబోల్, అరుణ్‌ నారాయణన్‌ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. జస్టిన్‌ వర్గీస్‌ స్వరాలు సమకూర్చారు. అరుణ్‌ నారాయణన్‌ ప్రొడక్షన్స్‌, కావ్యా ఫిల్మ్‌ కంపెనీ బ్యానర్స్‌పై అరుణ్‌ నారాయణన్‌, వేణు సంయుక్తంగా చావర్ సినిమాను నిర్మించారు. జింటో జార్జ్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. మంచి యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాలు చూడాలనుకునేవారికి చావర్‌ మంచి ఛాయిస్‌ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

సోనీ లివ్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..