AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hi Nanna Trailer: ‘నేనంటే అమ్మకు ఎందుకు ఇష్టం లేదు’.. కన్నీళ్లు పెట్టిస్తోన్ననాని ‘హాయ్‌ నాన్న’ ట్రైలర్‌

దసరా వంటి బ్లాక్‌ బస్టర్‌ మూవీ తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన చిత్రం హాయ్‌ నాన్న. సీతారామం బ్యూటీ మృణాళ్‌ ఠాకూర్‌ ఇందులో హీరోయిన్‌గా నటించింది. శ్రుతి హాసన్‌ సెకెండ్ లీడ్‌లో మెరిసింది. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో కొత్త దర్శకుడు శౌర్యువ్‌ హాయ్‌ నాన్నను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్స్‌, సాంగ్స్‌ నాని సినిమాపై అంచనాలు పెంచేశాయి.

Hi Nanna Trailer: 'నేనంటే అమ్మకు ఎందుకు ఇష్టం లేదు'.. కన్నీళ్లు పెట్టిస్తోన్ననాని 'హాయ్‌ నాన్న' ట్రైలర్‌
Hi Nanna Movie
Basha Shek
|

Updated on: Nov 24, 2023 | 8:06 PM

Share

దసరా వంటి బ్లాక్‌ బస్టర్‌ మూవీ తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన చిత్రం హాయ్‌ నాన్న. సీతారామం బ్యూటీ మృణాళ్‌ ఠాకూర్‌ ఇందులో హీరోయిన్‌గా నటించింది. శ్రుతి హాసన్‌ సెకెండ్ లీడ్‌లో మెరిసింది. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో కొత్త దర్శకుడు శౌర్యువ్‌ హాయ్‌ నాన్నను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్స్‌, సాంగ్స్‌ నాని సినిమాపై అంచనాలు పెంచేశాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్‌ 7న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా హాయ్ నాన్న ట్రైలర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో విరాజ్ పాత్రలో నాని, యష్న క్యారెక్టర్‌లో మృణాల్ కనిపించనున్నారు. నాని కూతురు మహీ పాత్రలో బేబి కియారా ఖన్నా నటించింది. కూతురికి విరాజ్ (నాని) కథ చెబుతున్నట్టుగా హాయ్‌ నాన్న ట్రైలర్ మొదలవుతుంది. తన అమ్మ కథ చెప్పాలని కూతురు అడుగుతుంటుంది. దీంతో అమ్మ కథ చెప్పేందుకు విరాజ్‌ సిద్ధమవ్వగా, అమ్మగా తననే ఊహించుకోవాలని మహీతో యష్న చెబుతుంది. అప్పుడు తన ప్రేమకథను విరాజ్ చెబుతారు. అయితే ఆ తర్వాత గొడవలు పడి భార్యతో నాని విడిపోయినట్టుగా ఈ ట్రైలర్‌లో చూపించారు. ఇందులో శ్రుతి హాసన్‌ కూడా కనిపించింది.

ఎంతో ఎమోషనల్‌గా సాగిన హాయ్‌ నాన్న ట్రైలర్‌లో సంభాషణలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ‘నేనంటే అమ్మకు ఎందుకు ఇష్టం లేదు’ అని మహీ చెప్పడం, ‘నేనెక్కడ తప్పు చేశాను, నా ప్రేమ సరిపోవడం లేదా మహీ’ అని నాని చెప్పిన మాటలు హృదయాన్ని హత్తుకుంటున్నాయి. ‘ఇంకా చెప్పొద్దు నాన్న.. ఇంటికి వెళ్లిపోదాం పద’ అని మహీ ఎమోషనల్‌ డైలాగ్‌తో హాయ్‌ నాన్న ట్రైలర్‌ ముగుస్తుంది. వైరా ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజేందర్‌ రెడ్డి హాయ్‌ నాన్న సినిమాను నిర్మించారు. ఖుషీ ఫేమ్‌ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. కోలీవుడ్‌ నటుడు జయరాం, సీనియర్ నటి మీరా జాస్మిన్‌, బాలీవుడ్ నటుడు అంగద్‌ బేడీ తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి

హాయ్ నాన్న సినిమా ట్రైలర్..

హాయ్ నాన్న సినిమాలో మృణాళ్ ఠాకూర్..

డిసెంబర్ ఏడో తేదీన గ్రాండ్ రిలీజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..