Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌ పొడిగింపు లేనట్టే.. టాప్‌ 7 కంటెస్టెంట్స్‌తో గ్రాండ్‌ ఫినాలే.. ఎప్పుడంటే?

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తోన్న బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే 11 వారాలు పూర్తి చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్‌ షోకు మరి కొన్ని రోజుల్లో శుభం కార్డు పడనుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 3న అట్టహాసంగా ప్రారంభమైన బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌లో మొదట 14 మంది కంటెస్టెంట్లు హౌజ్‌ లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఐదుగురు కంటెస్టెంట్స్‌ ఎలిమినేట్‌ అయ్యాక

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌ పొడిగింపు లేనట్టే.. టాప్‌ 7 కంటెస్టెంట్స్‌తో  గ్రాండ్‌ ఫినాలే.. ఎప్పుడంటే?
Bigg Boss 7 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Nov 23, 2023 | 8:46 PM

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తోన్న బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే 11 వారాలు పూర్తి చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్‌ షోకు మరి కొన్ని రోజుల్లో శుభం కార్డు పడనుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 3న అట్టహాసంగా ప్రారంభమైన బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌లో మొదట 14 మంది కంటెస్టెంట్లు హౌజ్‌ లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఐదుగురు కంటెస్టెంట్స్‌ ఎలిమినేట్‌ అయ్యాక మరో ఐదుగురు సభ్యులు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో ఎంట్రీ ఇచ్చారు. అలా ఏడో సీజన్‌లో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‌ పాల్గొన్నారు. ఇందులో 10 మంది అమ్మాయిలు కాగా వీరిలో ఇప్పటికే ఆరుగురు ఎలిమినేట్‌ అయ్యారు. మరో నలుగురు అమ్మాయిలతో కలిపి ఇప్పుడు మొత్తం 10 మంది కంటెస్టెంట్స్‌ హౌజ్‌లో మిగిలారు. ప్రస్తుతం 12 వారం తుది అంకానికి చేరుకుంది. ఈ వీక్‌ కూడా ఒకరు కాకుండా ఇద్దరు సభ్యులు ఎలిమినేట్‌ అవుతారని బిగ్‌ బాస్‌ హింట్‌ ఇచ్చాడు. అంటే 13వ వారంలో 8 మంది సభ్యులు ఇంట్లో మిగులుతారు.

ఉల్టా పుల్టా అంటూ ప్రతిసారి ఏదో ఒక ట్విస్ట్‌ ఇస్తోన్న బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలేను కూడా డిఫరెంట్‌ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అంటే ప్రతిసారిలా టాప్‌-5 కి బదులుగా టాప్‌ -7 కంటెస్టెంట్స్‌తో ఈ సారి గ్రాండ్‌ ఫినాలేను నిర్వహించే యోచనలో ఉన్నారట . గ్రాండ్‌ ఫినాలేకు కూడా డిసెంబర్‌ 17న ముహూర్తం ఫిక్స్‌ చేశారని సోషల్‌ మీడియాలో టాక్‌ వినిపిస్తోంది. కాగా బిగ్ బాస్‌ ఏడో సీజన్‌ను మరో రెండు వారాలు పొడిగించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడీ ఆలోచనను వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏడుగురు కంటెస్టెంట్స్‌ తో గ్రాండ్‌ ఫినాలేను అట్టహాసంగా నిర్వహించాలనే బిగ్‌ బాస్‌ నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే నాగార్జున ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..

ఏడుగురు కంటెస్టెంట్స్ తో గ్రాండ్ ఫినాలే..

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

బిగ్ బాస్ 12వ వారం ఓటింగ్ రిజల్ట్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే