Pulimada OTT: ఓటీటీలోకి మరో మలయాళ బ్లాక్‌ బస్టర్‌.. ఐశ్వర్య రాజేష్‌ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

ఇరట్టా, 2018, పద్మినీ, జర్నీ ఆఫ్‌ 18 ప్లస్, కాసర్‌ గోల్డ్‌, రీసెంట్‌గా కన్నూర్‌ స్వ్కాడ్‌ తదితర సినిమాలు ఓటీటీ ఆడియెన్స్‌ను బాగా అలరించాయి. అలాంటి ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడానికి మరో మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ ఓటీటీలోకి వస్తోంది. అదే ఇరట్టా సినిమాతో తెలుగులో ఒక్కసారిగా ఫేమస్‌ అయిన జోజు జార్జ్‌ హీరోగా నటించిన

Pulimada OTT: ఓటీటీలోకి మరో మలయాళ బ్లాక్‌ బస్టర్‌.. ఐశ్వర్య రాజేష్‌ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Pulimada Movie
Follow us
Basha Shek

|

Updated on: Nov 22, 2023 | 8:16 PM

ఓటీటీలు వచ్చాక మలయాళ సినిమాలకు బాగా క్రేజ్‌ పెరిగింది. ముఖ్యంగా తెలుగు నాట మాలీవుడ్ మూవీస్‌కు బాగా ఆదరణ దక్కుతోంది. ఆకట్టుకునే కథా కథనాలను ఎంతో వాస్తవికంగా, హృద్యంగా తెరకెక్కించడం తెలుగు ఆడియెన్స్‌కు తెగ నచ్చేస్తున్నాయి. అందుకే పలు ఓటీటీ సంస్థలు లేటెస్ట్‌ మలయాళ సినిమాలతో పాటు గతంలో థియేటర్లలో రిలీజై సూపర్‌ హిట్‌ సినిమాలను డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు తెస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులను సులభంగా అర్థం చేసుకోవడానికి వీలుగా తెలుగు డబ్బింగ్‌ చేసి మరీ ఇక్కడి ఆడియెన్స్‌కు అందుబాటులోకి తెస్తున్నాయి. ఇరట్టా, 2018, పద్మినీ, జర్నీ ఆఫ్‌ 18 ప్లస్, కాసర్‌ గోల్డ్‌, రీసెంట్‌గా కన్నూర్‌ స్వ్కాడ్‌ తదితర సినిమాలు ఓటీటీ ఆడియెన్స్‌ను బాగా అలరించాయి. అలాంటి ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడానికి మరో మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ ఓటీటీలోకి వస్తోంది. అదే ఇరట్టా సినిమాతో తెలుగులో ఒక్కసారిగా ఫేమస్‌ అయిన జోజు జార్జ్‌ హీరోగా నటించిన పులి మడ. ఇందులో మన తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్‌గా నటించింది. అక్టోబర్‌ 26న థియేటర్లలో విడుదలైన ఈ థ్రిల్లర్‌ మూవీ అక్కడి ప్రేక్షకులను బాగా అలరించింది. ఇప్పుడీ పులి మడ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్‌ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో గురువారం (నవంబర్‌ 23) నుంచి పులి మడ సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు నెట్‌ ఫ్లిక్స్‌ సంస్థ ప్రకటించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది.

ఇవి కూడా చదవండి

ఏకే సజన్ తెరకెక్కించిన పులి మడ సినిమాలో వినోద్ జోస్, లిజోమోల్ జోస్, జాఫర్ ఇడుక్కి, జానీ ఆంటోని, బాలచంద్ర మీనన్, సోనా నాయర్, కృష్ణ ప్రబ, పౌలీ వల్సన్, జాలీ చిరయాత్, అబూ సలీం, అబిన్ బినో, ఫారా షిబ్లా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రాజేష్‌ దామోదరన్‌, సిజో వడక్కన్‌ నిర్మించిన ఈ సినిమాకు ఇషాన్‌ దేవ్‌ ,అనిల్‌ జాన్సన్‌ సంగీతం అందించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. పులి మడ సినిమా విన్సెంట్ స్కారియా (జోజు) అనే 40 ఏళ్ల కానిస్టేబుల్ చుట్టూ తిరుగుతుంది. అతనికి మానసిక సమస్యలతో బాధపడుతోన్న తన తల్లి ఉంటుంది. దీంతో పాటు తనకు కాబోయే భార్య (ఐశ్వర్య రాజేష్) బాయ్ ఫ్రెండ్ తో కలిసి లేచిపోవడంతో విన్సెంట్ జీవితం తలకిందులవుతోంది. మరి విన్సెంట్ ఏం చేశాడు అన్నది తెలుసుకోవాలంటే ఈ థ్రిల్లర్‌ మూవీ చూడాల్సిందే.

మరికొన్ని గంట ల్లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే