AHA OTT: ట్యాలెంట్‌ను నిరూపించుకునేందుకు ‘ఆహా’ సూపర్ ఛాన్స్.. సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ ఎప్పటినుంచంటే?
తెలుగు ఆడియెన్స్‌ను నిరంతరం ఆకట్టుకుంటూ తిరుగులేని ఆదరణతో దూసుకెళ్తోన్న వన్ అండ్ ఓన్లీ తెలుగు 100% ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా, ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్‌ను ఆవిష్కరించింది. ఈ సినీ కోలాహలం పండుగను తలపించనుంది. పండుగను మాత్రమే కాదు చక్కగా కథను చెప్పటం, క్రియేటివిటీ, తిరుగులేని స్ఫూర్తిని తెలియజేస్తుంది.
తెలుగు ఆడియెన్స్‌ను నిరంతరం ఆకట్టుకుంటూ తిరుగులేని ఆదరణతో దూసుకెళ్తోన్న వన్ అండ్ ఓన్లీ తెలుగు 100% ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా, ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్‌ను ఆవిష్కరించింది. ఈ సినీ కోలాహలం పండుగను తలపించనుంది. పండుగను మాత్రమే కాదు చక్కగా కథను చెప్పటం, క్రియేటివిటీ, తిరుగులేని స్ఫూర్తిని తెలియజేస్తుంది. ఈ సంచలనాత్మక ఉత్సవంలో సినిమాలను ప్రదర్శించటంతో పాటు గ్రూప్ డిస్కషన్స్, షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్, ప్యానెట్ డిస్కషన్స్ జరుగుతాయి. వర్ధమాన దర్శకులు తమ ప్రతిభను వెల్లడి చేసుకోవటానికి ఇదొక వేదికగా పని చేయనుంది. ఔత్సాహికులు ఘనంగా జరగనున్న సెలబ్రేషన్స్‌లో పాల్గొనవచ్చు. ఇందుకోసం ఆహా బ్లాగ్ యాప్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు.
ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనాల్సినవారిన మూడు భాగాలుగా విభజించారు. షార్ట్ ఫిల్మ్ విభాగంలో 3-15 నిమిషాల వ్యవధి ఉన్న షార్ట్ ఫిల్మ్‌ను పంపాలి. ఇక రెండో విభాగం షార్ట్స్ షార్ట్.. దీని కోసం మూడు నిమిషాల కంటే తక్కువగా ఉన్న షార్ట్స్ షార్ట్‌ను పంపాల్సి ఉంటుంది. అలాగే మ్యూజిక్ వీడియో విభాగం కోసం ఐదు నిమిషాల కంటే తక్కువగా ఉన్న వీడియోను చిత్రీకరించి పంపాలి. జనవరి 1, 2020 నుంచి ఉన్న డిసెంబర్ 10, 2023 వరకు ఉన్న సినిమాల కంటెంట్‌తో వీడియోలను చిత్రీకరించి పంపాల్సి ఉంటుంది..
ప్రస్తుతం తెలుగులో ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. భవిష్యత్తులో తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లోనూ ఈ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ మెంబర్స్‌గా టాలీవుడ్‌కి చెందిన స్టార్ మేకర్స్ వర్క్ చేయనున్నారు. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో రకాల సేవలు అందించిన జీవితా రాజశేఖర్.. మాస్‌ను ప్రభావితం చేయగల కథ, కథనాలు రూపొందించటంలో దిట్ట అయిన డైరెక్టర్ హరీష్ శంకర్.. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ వి.ఎన్.ఆదిత్య… డిఫరెంట్ స్టోరీలు, మేకింగ్‌తో, టాలెంట్‌తో తెలుగు సినిమాలపై ముద్ర వేసిన డైరెక్టర్ చందు మొండేటి.. తన ప్రతిభతో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న నిర్మాత, దర్శకుడు సాయి రాజేష్.. ఇండియన్ టెలివిజన్ చీఫ్ ఎడిటర్‌గా పని చేసిన అనీల్ వాన్వరి ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరీ మెంబర్స్‌గా పని చేస్తున్నారు. డిసెంబర్ 20 నుంచి ఈ తెలుగు ఫిల్మ్ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించనున్నారు. దీనికి సౌత్ ఇండియాలోని ప్రముఖ సినీ సెలబ్రిటీలు పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా…ఆహా సీఈవో రవికాంత్ సబ్నవిస్ మాట్లాడుతూ ‘‘సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్‌ను ఆహాలో ప్రారంభించడం ఆనందంగా ఉంది. తెలుగు చిత్ర సీమలో ఉన్న ప్రతిభను అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఫెస్టివల్‌ను ప్రారంభించాం. మా ఆడియెన్స్ కోసం ప్రత్యేకమైన కంటెంట్ ఇచ్చే ప్రయత్నంలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం’’ అని అన్నారు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి.విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ ‘‘ఆహాతో కలిసి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం ఆనందంగా ఉంది. సౌత్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతిభావంతుల్ని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..