LEO OTT: విజయ్‌ ‘లియో’ అఫీషియల్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

థియేటర్లలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన లియో ఓటీటీలో ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా? అని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే విజయ్‌ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్ గురించి పలు వార్తలు వచ్చాయి. నవంబర్‌ 17న వస్తుందని, లేదు.. నవంబర్‌ 21న స్ట్రీమింగ్‌ అవుతుందని ప్రచారం జరిగింది. అయితే వీటన్నిటికీ చెక్‌ పెడుతూ లియో సినిమా స్ట్రీమింగ్‌ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది.

LEO OTT: విజయ్‌ 'లియో' అఫీషియల్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Leo Movie
Follow us
Basha Shek

|

Updated on: Nov 20, 2023 | 1:54 PM

మాస్టర్ వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత విజయ్‌ దళపతి- లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా లియో. దసరా కానుకగా అక్టోబర్‌ 19న విడుదలైన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది. తమిళ్‌తో పాటు తెలుగులోనూ భారీ వసూళ్లు సొంతం చేసకుంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.600 కోట్ల కలెక్షన్లు రాబట్టి విజయ్‌ కెరీర్‌లోనే భారీ హిట్‌గా నిలిచింది. లియో సినిమాలో విజయ్‌ సరసన త్రిష హీరోయిన్‌గా నటించింది. అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్‌, కోలీవుడ్ డైరెక్టర్‌ గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన లియో ఓటీటీలో ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా? అని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే విజయ్‌ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్ గురించి పలు వార్తలు వచ్చాయి. నవంబర్‌ 17న వస్తుందని, లేదు.. నవంబర్‌ 21న స్ట్రీమింగ్‌ అవుతుందని ప్రచారం జరిగింది. అయితే వీటన్నిటికీ చెక్‌ పెడుతూ లియో సినిమా స్ట్రీమింగ్‌ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్‌. ఈ సందర్భంగా రెండు తేదీలను ప్రకటించింది. భారత్‌లో నవంబర్‌ 24 నుంచి లియో స్ట్రీమింగ్ కానుండగా.. ప్రపంచ వ్యాప్తంగా మాత్రం నవంబర్‌ 28 నుంచి అందుబాటులోకి రానున్నట్లు నెట్‌ ఫ్లిక్స్‌ ప్రకటించింది.

భారత్‌లో నవంబర్‌ 24న తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో లియో సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో బ్యానర్‌పై లలిత్‌ కుమార్‌, జగదీష్‌ పళని స్వామి భారీ బడ్జెట్‌తో లియో సినిమాను నిర్మించారు. మిస్కిన్‌, మడోన్నా సెబాస్టియన్‌, జార్జ్‌, మన్సూర్‌ అలీఖాన్‌, ప్రియా ఆనంద్‌, మాథ్యూ థామస్‌, బాబూ ఆంటోని, లీలా శామ్సన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్‌ స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో ఈ బ్లాక్‌ బస్టర్‌ సినిమాను మిస్‌ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

భారత్ లో నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్..

లియో మూవీ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే