Naga Chaitanya: యంగ్ హీరోలకు నయా రూట్ చూపిస్తున్న నాగ చైతన్య..

చైతూ రూట్ మ్యాప్ వేసారు.. మిగిలిన వాళ్ల చూపులు అటు వైపు పడతాయా లేదా..?  మార్కెట్ బాగా ఉన్న హీరోలు కేవలం సినిమాలు మాత్రమే చేయాలి.. ఓటిటి వైపు చూడకూడదు అనే ఫార్ములా ఫాలో అవుతున్నారు మన దగ్గర. బాలీవుడ్‌లో అలాంటిదేం లేదు.. అక్కడ అజయ్ దేవ్‌గన్ లాంటి స్టార్స్ కూడా ఓటిటిలో నటించారు. కథ నచ్చితే వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నారు.

Naga Chaitanya: యంగ్ హీరోలకు నయా రూట్ చూపిస్తున్న నాగ చైతన్య..
naga chaitanya
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 20, 2023 | 4:26 PM

నాగ చైతన్య చూపించిన దారిలో మిగిలిన హీరోలు కూడా వెళ్తారా..? ఇన్నాళ్లూ వెండితెరపై మ్యాజిక్ చేసిన హీరోలు.. ఇకపై డిజిటల్‌లోనూ మాయ చేస్తారా..? చిన్నా చితకా హీరోలు ఇప్పటికే ఇటు సినిమాలు, అటు ఓటిటిలో బిజీగా ఉన్నారు. మరి మీడియం రేంజ్, స్టార్ హీరోల పరిస్థితేంటి..? చైతూ రూట్ మ్యాప్ వేసారు.. మిగిలిన వాళ్ల చూపులు అటు వైపు పడతాయా లేదా..?  మార్కెట్ బాగా ఉన్న హీరోలు కేవలం సినిమాలు మాత్రమే చేయాలి.. ఓటిటి వైపు చూడకూడదు అనే ఫార్ములా ఫాలో అవుతున్నారు మన దగ్గర. బాలీవుడ్‌లో అలాంటిదేం లేదు.. అక్కడ అజయ్ దేవ్‌గన్ లాంటి స్టార్స్ కూడా ఓటిటిలో నటించారు. కథ నచ్చితే వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నారు. కానీ టాలీవుడ్‌లో టాక్ షోస్, రియాలిటీ షోస్ వరకు ఓకే కానీ.. హీరోలు వెబ్ సిరీస్‌లు చేసే ట్రెండ్ రాలేదు.

చిరంజీవి, నాగార్జున, బాలయ్య నుంచి ఎన్టీఆర్, నాని, రానా వరకు అంతా హోస్టులుగా మారారు.. షోస్ చేసారు కానీ వెబ్ సిరీస్‌ల వైపు మాత్రం చూడలేదు. ఫస్ట్ టైమ్ తెలుగులో ఓ మీడియం రేంజ్ హీరో వెబ్ సిరీస్ చేస్తున్నారు.. అతడే నాగ చైతన్య. దూతతో ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారు చైతూ. విక్రమ్ కే కుమార్ దీనికి దర్శకుడు. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న దూత.. డిసెంబర్ 1న వచ్చేస్తున్నాడు.

దూత వెబ్ సిరీస్ రెండేళ్ల కిందే ప్రకటించినా అనివార్య కారణాలతో ఆలస్యమైంది. ఇన్నాళ్లకు బయటికి వచ్చేస్తుంది దూత. ఇప్పటికైతే పెద్దగా మార్కెట్ లేని హీరోలు.. శ్రీకాంత్, జగపతిబాబు లాంటి సీనియర్స్ వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు. చైతూ క్లిక్ అయితే.. అందరి చూపు వెబ్ సిరీస్‌ల వైపు పడటం ఖాయం. చూడాలిక.. నాగ చైతన్య రూట్‌లో ఎంతమంది హీరోలు వెళ్తారో..?

నాగ చైతన్య ట్విట్టర్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?