Chiranjeevi: మెగా స్పీడ్‌కు మరోసారి బ్రేక్స్.. 2024లో చిరు కనిపించడం కష్టమేనా..
పాపం ప్రతీ సినిమాతో సిక్స్ కొట్టాలనే బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు చిరంజీవి. కానీ ఏదో ఒక సినిమా మాత్రమే బౌండరీ దాటితే.. మిగిలినవి బెడిసి కొడుతున్నాయి. ఈ మధ్యే భోళా శంకర్ ఇచ్చిన షాక్‌తో రీమేక్స్‌కు బ్రేక్ ఇచ్చి.. స్ట్రెయిట్ స్టోరీస్ చేయాలని ఫిక్స్ అయిపోయారు మెగాస్టార్. ఈ క్రమంలోనే కళ్యాణ్ కృష్ణను కూర్చోబెట్టి.. వశిష్టను లైన్‌లోకి తీసుకొచ్చారు చిరు.
అనుకున్నది అనుకున్నట్లు జరగడానికి ఇదేం సినిమా కాదు. అక్కడంటే స్క్రిప్ట్ ఎలా రాసుకుంటే అలా ముందుకెళ్తుంది కథ. కానీ రియల్ లైఫ్ అలా కాదుగా.. అందుకే అనుకునేదొక్కటి అయితే.. అక్కడ జరుగుతున్నది మరోటి. పాపం చిరంజీవి విషయంలోనే ఇది రిపీట్ అవుతుంది. మరి ఆయనకు వచ్చిన కష్టమేంటి..? మెగాస్టార్ విషయంలోనే సీన్ ఎందుకు రివర్స్‌లో జరుగుతుంది..? అసలు విషయం ఏంటంటే .. పాపం ప్రతీ సినిమాతో సిక్స్ కొట్టాలనే బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు చిరంజీవి. కానీ ఏదో ఒక సినిమా మాత్రమే బౌండరీ దాటితే.. మిగిలినవి బెడిసి కొడుతున్నాయి. ఈ మధ్యే భోళా శంకర్ ఇచ్చిన షాక్‌తో రీమేక్స్‌కు బ్రేక్ ఇచ్చి.. స్ట్రెయిట్ స్టోరీస్ చేయాలని ఫిక్స్ అయిపోయారు మెగాస్టార్. ఈ క్రమంలోనే కళ్యాణ్ కృష్ణను కూర్చోబెట్టి.. వశిష్టను లైన్‌లోకి తీసుకొచ్చారు చిరు.
సైరా తర్వాత మూడేళ్లు బ్రేక్ రావడంతో.. ఇకపై వరస సినిమాలు చేస్తానంటూ మాటిచ్చారు చిరు. అన్నట్లుగానే 2022 సమ్మర్ నుంచి 2023 ఆగస్ట్‌లోపు ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్‌లతో వచ్చారు. అందులో వాల్తేరు వీరయ్య మాత్రమే హిట్ కాగా.. మిగిలిన మూడు అంచనాలు అందుకోలేదు. దాంతో ఇకపై అతివేగం ప్రమాదకరం అని.. నిదానమే ప్రధానం వైపు వెళ్లారు చిరు.
కళ్యాణ్ కృష్ణతో సినిమా ఇప్పట్లో లేనట్లే. వశిష్ట ప్రాజెక్ట్ ఫాంటసీ డ్రామా కావడంతో గ్రాఫిక్స్‌తోనే ఎక్కువగా పని ఉంటుంది. డిసెంబర్ నుంచి ఇది సెట్స్‌పైకి రానుంది. ఈ గ్యాప్‌లో ఓ సినిమా చేయాలనేది చిరు ప్లాన్. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడిని కలిసినట్లు తెలుస్తుంది. ఎలా చూసుకున్నా.. 2024లో చిరు కనిపించడం కష్టమే. అంటే మెగా స్పీడ్‌కు మరోసారి బ్రేక్స్ పడినట్లే.
‘ఖైదీ’ చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత ‘ఖైదీ’ని చేసింది.
నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం ! ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిది.
ఖైదీ విడుదలై నేటికి 40 సంవత్సరాలయిన సందర్భంగా ఒక సారి ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ , ఆ చిత్ర… pic.twitter.com/raY4AOTAoH
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 28, 2023
In the good old days, films used to begin with music compositions, and #Mega156 has brought the tradition back to Telugu Cinema 💫🔮
Beginning the MEGA MASS BEYOND UNIVERSE with a celebratory song composition followed by an auspicious Pooja Ceremony ❤️
Wishing everyone a very… pic.twitter.com/CRuG2f7fot
— UV Creations (@UV_Creations) October 24, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..