Jr NTR- Dulquer Salmaan: ఎన్టీఆర్, దుల్కర్ సల్మాన్ మల్టీస్టారర్ మూవీ.. డైరెక్టర్ ఎవరంటే..
ఆర్ఆర్ఆర్ కంటే ముందే మన హీరోలో మల్టీస్టారర్ సినిమాలు చేశారు. ఇక ఇప్పుడు ఓ క్రేజీ కాంబోలో మల్టీస్టారర్ రానుందంటూ ఫిలిం సర్కిల్స్ లో వార్తలు ఎన్టీఆర్ మరోసారి వేరే హీరోతో కలిసి నటించనున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ వార్ సీక్వెల్ చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాల హవా పెరుగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ను సొంతం చేసుకోవడంతో ఇప్పుడు అందరు మల్టీస్టారర్ సినిమాలపైనే దృష్టి పెడుతున్నారు. ఆర్ఆర్ఆర్ కంటే ముందే మన హీరోలో మల్టీస్టారర్ సినిమాలు చేశారు. ఇక ఇప్పుడు ఓ క్రేజీ కాంబోలో మల్టీస్టారర్ రానుందంటూ ఫిలిం సర్కిల్స్ లో వార్తలు ఎన్టీఆర్ మరోసారి వేరే హీరోతో కలిసి నటించనున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ వార్ సీక్వెల్ చేస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న దేవర సినిమా పూర్తయిన వెంటనే తారక్ వార్ సీక్వెల్ లో జాయిన్ కానున్నాడు.
ఈ క్రమంలో ఇప్పుడు మరో మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడంటూ వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఇక ఎన్టీఆర్ తో కలిసి నటించనున్న హీరో మరెవరో కాదు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. తాజాగా దర్శకుడు పవన్ సాధినేని ఎన్టీఆర్ దుల్కర్ సల్మాన్ ను కలిశాడు.
పవన్ సాధినేని.. ప్రేమ ఇష్క్ కాదల్, సేనాపతి లాంటి సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తాజాగా ఎన్టీఆర్, దుల్కర్ సల్మాన్ ను కలిసిన పవన్..ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఓ చక్కటి సాయంత్రం అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దాంతో పవన్ ఎన్టీఆర్, దుల్కర్ తో సినిమా చేయనున్నాడని. లైన్ వినిపించేందుకు వారిని కలిశాడని టాక్ మొదలైంది. ఇప్పుడు ఈ వార్త ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతుంది. ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఆతర్వాత వార్ సీక్వెల్ చేయనున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ తోనూ ఓ సినిమా చేయనున్నాడు. అటు దుల్కర్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తెలుగు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.
దుల్కర్ సల్మాన్ తో పవన్ సాధినేని
View this post on Instagram
ఎన్టీఆర్ తో పవన్ సాధినేని
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..