Bigg Boss 7 Telugu: సింహానికి ఆకలెక్కువ.. పల్లవి ప్రశాంత్‌కు పవర్ ఎక్కువ.. రతికాకు మాస్ వార్నింగ్ ఇచ్చిన రైతుబిడ్డ

ఈసారి హౌస్ లో ఉండే వారిని ఓ జంగల్ సెటప్ లోకి తీసుకువెళ్లి అక్కడ ఒక సింహం బొమ్మను ఉంచాడు. ఆ సింహం చాలా ఆకలిగా ఉంది. హౌస్ లో ఉండటానికి ఎవరైతే అనర్హులు అనుకుంటున్నారో వారు ఇద్దరిని నామినేట్ చేయాలి వారి ఫోటోలను అతికించి ఉన్న మాంసం ముక్కలను సింహం నోట్లో వేయాలి అని చెప్పాడు బిగ్ బాస్. ముందుగా వదిలిన ప్రోమోలో అమర్ యావర్ మధ్య గొడవ జరిగినట్టు చూపించారు.

Bigg Boss 7 Telugu: సింహానికి ఆకలెక్కువ.. పల్లవి ప్రశాంత్‌కు పవర్ ఎక్కువ.. రతికాకు మాస్ వార్నింగ్ ఇచ్చిన రైతుబిడ్డ
Bigg Boss 7 Telugu
Follow us

|

Updated on: Nov 20, 2023 | 5:34 PM

బిగ్ బస్ హౌస్ లో నామినేషన్స్ మొదలయ్యాయి. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు నో చివరివరకు తీసుకు వచ్చి నో ఎలిమినేషన్ అని షాక్ ఇచ్చారు నాగ్. దాంతో అశ్విని, గౌతమ్ ఊపిరి పీల్చుకున్నారు. ఇక సోమవారం కావడంతో నామినేషన్ మొదలు పెట్టాడు బిగ్ బాస్. ఈసారి హౌస్ లో ఉండే వారిని ఓ జంగల్ సెటప్ లోకి తీసుకువెళ్లి అక్కడ ఒక సింహం బొమ్మను ఉంచాడు. ఆ సింహం చాలా ఆకలిగా ఉంది. హౌస్ లో ఉండటానికి ఎవరైతే అనర్హులు అనుకుంటున్నారో వారు ఇద్దరిని నామినేట్ చేయాలి వారి ఫోటోలను అతికించి ఉన్న మాంసం ముక్కలను సింహం నోట్లో వేయాలి అని చెప్పాడు బిగ్ బాస్. ముందుగా వదిలిన ప్రోమోలో అమర్ యావర్ మధ్య గొడవ జరిగినట్టు చూపించారు. ఆతర్వాత అర్జున్ కూడా యావర్ ను నామినేట్ చేశాడు. గౌతమ్ , ప్రశాంత్ ను నామినేట్ చేశాడు. ఈ క్రమంలో యావర్, గౌతమ్ , ప్రశాంత్ మధ్య వాదన జరిగింది.

ఆతర్వాత రతికా అమర్ ను నామినేట్ చేసింది. దానికి అమర్ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. నా పద్ధతి అదే, నా ఆట అదే, నా వేట అదే అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఆతర్వాత అర్జున్ శివాజీని నామినేట్ చేశాడు. ఇదంతా మొదటి ప్రోమోలో చూపించారు. తాజాగా సెకండ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో రతికా ప్రశాంత్ ను అమర్ ను నామినేట్ చేసింది. ఈ క్రమంలో అమర్ , రతికా మధ్య ఇంట్రెస్టింగ్ వాదన జరిగిందని అర్ధమవుతుంది. ఆతర్వాత ప్రశాంత్ గౌతమ్ ను నామినేట్ చేయడం . ఈ ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరగడం చూపించారు. అలాగె రతికా ప్రశాంత్ మధ్య కూడా వాదన గట్టిగానే జరిగిందని తెలుస్తోంది. ప్రశాంత్ పై గౌతమ్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. గౌతమ్ పంచ గురించి ప్రశాంత్ మాట్లాడుతూ.. ఆ పంచ ఊడిపోకుండా చూసుకో అనడంతో పంచ తెలుగోడి సంస్కృతి దాని గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడొద్దు అంటూ రెచ్చిపోయాడు గౌతమ్. ఇక లాస్ట్ లో ప్రశాంత్ రతికాకు ఓ పవర్ ఫుల్ డైలాగ్ కొట్టాడు. అక్క సింహానికి ఆకలెక్కువ.. పల్లవి ప్రశాంత్ కు పవర్ ఎక్కువ.. సింహం ఆకలి కోసం వేటాడిద్ది .. ప్రశాంత్ ఆకలి కోసం ఆట ఆడతాడు అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.