Dhanush: ఆ పని చేసి పోలీసులకు చిక్కిన ధనుష్ కొడుకు.. చివరకు
ఐశ్వర్య, ధనుష్ 2022లో విడాకులు తీసుకున్నారు. ఇద్దరూ తమిళ చిత్ర పరిశ్రమలో బిజీగా ఉన్నారు. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె దర్శకత్వం వహించిన 'లాల్ సలామ్' చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. అటు ధనుష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్నారు ధనుష్ .
మాజీ జంట ధనుష్ , ఐశ్వర్య రజనీకాంత్ కొడుకు యాత్ర రాజా తాజాగా వార్తల్లో నిలిచాడు. అతని వెతుకుంటూ పోలీసులు వచ్చారు ఐశ్వర్య రజనీకాంత్ ఇంటికి వచ్చారు. ఇంతకు యాత్ర రాజా చేసిన తప్పు ఏమిటి ? ధనుష్ కు ఇద్దరు కొడుకులు అన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు ప్రస్తుతం చదువుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ధనుష్ తన కుమారుల ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. ధనుష్ పెద్ద కొడుకు అచ్చం తండ్రిలానే ఉంటాడు. ఇక సెలబ్రిటీ పిల్లలు లగ్జరీ బైక్‌లు, కార్లపై ఆసక్తి చూపుతున్నారు. అదేవిధంగా ధనుష్ కొడుకు యాత్రకు కూడా బైక్‌లంటే పిచ్చి. తాజాగా ఆయన సూపర్ స్పోడ్స్ బైక్ నడుపుతున్న వీడియో వైరల్‌గా మారింది. మరో వ్యక్తి బైక్ నడపడం నేర్పిస్తూ కనిపించాడు.
అసలు విషయం ఏంటంటే. లైసెన్స్ లేకుండా బైక్ నడపడం నేరం. ధనుష్ కొడుకు ఇప్పుడు అదే నేరం చేశాడు. యాత్ర వయసు ఇంకా 17 ఏళ్లు మాత్రమే. ద్విచక్ర వాహనం నడపడానికి 18 ఏళ్లు నిండి లైసెన్స్ పొందాలి. నిబంధనలు ఉల్లంఘించిన అతనికి పోలీసులు జరిమానా విధించారు. బైక్ నడుపుతున్న సమయంలో యాత్ర హెల్మెట్ ధరించలేదు. ఈ వైరల్ వీడియో చూసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.
వైరల్ వీడియోలో, యాత్ర ముసుగు ధరించి ఉన్నాడు.యాత్ర గురించి కనుక్కునేందుకు ఐశ్వర్య రజనీకాంత్ ఇంటికి వచ్చారట పోలీసులు. ‘అవును, ఇతను మా అబ్బాయి’ అని ఐశ్వర్య చెప్పడంతో… ఆ తర్వాత పోలీసులు జరిమానా విధించినట్లు సమాచారం. యాత్ర చట్టాన్ని ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో వెయ్యి రూపాయల జరిమానా విధించారు. 2004లో రజనీకాంత్ కూతురు ఐశ్వర్యతో ధనుష్ వివాహం జరిగింది. వీరికి యాత్రరాజు, లింగరాజు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. ఐశ్వర్య, ధనుష్ 2022లో విడాకులు తీసుకున్నారు. ఇద్దరూ తమిళ చిత్ర పరిశ్రమలో బిజీగా ఉన్నారు. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె దర్శకత్వం వహించిన ‘లాల్ సలామ్’ చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. అటు ధనుష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్నారు ధనుష్ .
View this post on Instagram
ధనుష్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్
View this post on Instagram
ధనుష్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.