OTT Movies: ఈ వారం ఓటీటీల్లో బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు, సిరీస్‌లు.. విజయ్‌ ‘లియో’తో సహా ఫుల్‌ లిస్ట్‌ ఇదే

వైష్ణవ్ తేజ్‌, శ్రీలీల ఆది కేశవ, కోటబొమ్మాళి పీఎస్, ధృవనక్షత్రం వంటి ఇంట్రెస్టింగ్ సినిమాలు ఈ వారం థియేటర్లలో విడుదలవుతున్నాయి. అదే సమయంలో ఓటీటీలో కూడా దాదాపు 20కు పైగా సినిమాలు వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌కి రెడీ అయిపోయాయి. ఈ వారం ఓటీటీ ఆడియెన్స్‌లో చాలామంది దృష్టి విజయ్‌ దళపతి లియో సినిమాపైనే ఉంది.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు, సిరీస్‌లు.. విజయ్‌ 'లియో'తో సహా ఫుల్‌ లిస్ట్‌ ఇదే
OTT Movies
Follow us
Basha Shek

|

Updated on: Nov 20, 2023 | 11:50 AM

ప్రపంచ కప్‌ ఫీవర్‌ ముగిసింది. దీంతో మళ్లీ సినిమాలు వరుసగా థియేటర్లలోకి అడుగుపెడుతున్నాయి. అలా ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు సిల్వర్‌ స్క్రీన్‌పై సందడి చేయనున్నాయి. వైష్ణవ్ తేజ్‌, శ్రీలీల ఆది కేశవ, కోటబొమ్మాళి పీఎస్, ధృవనక్షత్రం వంటి ఇంట్రెస్టింగ్ సినిమాలు ఈ వారం థియేటర్లలో విడుదలవుతున్నాయి. అదే సమయంలో ఓటీటీలో కూడా దాదాపు 20కు పైగా సినిమాలు వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌కి రెడీ అయిపోయాయి. ఈ వారం ఓటీటీ ఆడియెన్స్‌లో చాలామంది దృష్టి విజయ్‌ దళపతి లియో సినిమాపైనే ఉంది. థియేటర్లలో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రానుందా? అని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక వెబ్‌ సిరీస్‌ల్లో సంచలనం సృష్టించిన స్క్విడ్‌ గేమ్‌: ది ఛాలెంజ్‌ కూడా ఈ వారమే అందుబాటులోకి రానుంది. అలాగే ఆర్య ది విలేజ్‌ వెబ్ సిరీస్‌ కూడా ఆసక్త కలిగిస్తోంది. మరి వీటితో పాటు ఈ వారం పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ కు రానున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లేంటో తెలుసుకుందాం రండి.

నెట్‌ఫ్లిక్స్

  • స్టాంప్డ్ ఫ్రమ్ ద బిగినింగ్ (ఇంగ్లిష్ మూవీ) – నవంబరు 20
  • లియో (తెలుగు మూవీ) – నవంబరు 24
  • స్క‍్విడ్ గేమ్: ద ఛాలెంజ్ (తెలుగు డబ్బింగ్ వెబ్‌ సిరీస్) – నవంబరు 22
  • మై డామెన్ (జపనీస్ వెబ్‌ సిరీస్) – నవంబరు 23
  • పులిమడ (మలయాళ మూవీ) – నవంబరు 23
  • లాస్ట్ కాల్ ఫర్ ఇస్తాంబుల్ (టర్కిష్ మూవీ) – నవంబరు 24
  • గ్రాన్ టరిష్మో (ఇంగ్లిష్ మూవీ) – నవంబరు 24
  • ద మెషీన్ (ఇంగ్లిష్ సినిమా) – నవంబరు 26

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • ద విలేజ్ (తమిళ్ వెబ్‌ సిరీస్) – నవంబరు 24
  • ఎల్ఫ్ మీ (ఇటాలియన్ మూవీ) – నవంబరు 24

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • ఫర్గో: సీజన్ 5 (ఇంగ్లిష్ వెబ్‌ సిరీస్) – నవంబరు 21
  • చిన్నా (తెలుగు డబ్బింగ్ మూవీ) – నవంబరు 23

జీ5

  • ద ఆమ్ ఆద్మీ ఫ్యామిలీ: సీజన్ 4 (హిందీ వెబ్‌ సిరీస్) – నవంబరు 24

జియో సినిమా

  • ద గుడ్ ఓల్డ్ డేస్ (తెలుగు వెబ్‌ సిరీస్) – నవంబరు 23

బుక్ మై షో

  • ఒపెన్ హైమర్ (ఇంగ్లిష్ మూవీ) – నవంబరు 22
  • UFO స్వీడన్ (స్వీడిష్ సినిమా) – నవంబరు 24

సోనీ లివ్

  • చావెర్ (మలయాళ మూవీ) – నవంబరు 24
  • సతియా సోతనాయ్ (తమిళ సినిమా) – నవంబరు 24

ఆహా

  • అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిసన్ (యానిమల్ మూవీ టీమ్ ఎపిసోడ్) – నవంబరు 24

యాపిల్ ప్లస్ టీవీ

  • హన్నా వడ్డింగ్‌హమ్: హోమ్ ఫర్ క్రిస్మస్ (ఇంగ్లిష్ మూవీ) – నవంబరు 22

ఈటీవీ విన్

  • ఒడియన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – నవంబరు 24

అమెజాన్ మినీ టీవీ

  • స్లమ్ గల్ఫ్ (హిందీ వెబ్‌ సిరీస్) – నవంబరు 22

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.