Bigg Boss 7 Telugu: బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన బిగ్‌ బాస్‌.. ఎలిమినేషన్‌పై అనూహ్య నిర్ణయం.. శోభను సేవ్‌ చేసేందుకే

ప్రముఖ తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 7లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆడియెన్స్‌ నుంచి వచ్చిన ఓట్లను ఆధారంగా చేసుకుఇ ప్రతి వారం ఒక కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌ అవుతోన్న సంగతి తెలిసిందే. అలా బిగ్‌బాస్‌ సీజన్-7లో ఇప్పటివరకు 10 వారాల్లో 10 మంది హౌస్ బయటకు వెళ్లిపోయారు. అయితే 11 వారం మాత్రం బిగ్‌ బాస్‌ బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చాడు. నామినేషన్స్‌ లిస్టులో ఉన్న..

Bigg Boss 7 Telugu: బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన బిగ్‌ బాస్‌.. ఎలిమినేషన్‌పై అనూహ్య నిర్ణయం.. శోభను సేవ్‌ చేసేందుకే
Bigg Boss 7 Telugu
Follow us

|

Updated on: Nov 20, 2023 | 9:20 AM

ప్రముఖ తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 7లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆడియెన్స్‌ నుంచి వచ్చిన ఓట్లను ఆధారంగా చేసుకుఇ ప్రతి వారం ఒక కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌ అవుతోన్న సంగతి తెలిసిందే. అలా బిగ్‌బాస్‌ సీజన్-7లో ఇప్పటివరకు 10 వారాల్లో 10 మంది హౌస్ బయటకు వెళ్లిపోయారు. అయితే 11 వారం మాత్రం బిగ్‌ బాస్‌ బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చాడు. నామినేషన్స్‌ లిస్టులో ఉన్న గౌతమ్ కృష్ణ, శోభాశెట్టి, అశ్విని శ్రీ, అర్జున్‌ అంబటి, ప్రియాంక జైన్‌, అమర్‌ దీప్‌ చౌదరి, ప్రిన్స్‌ యావర్‌, రతికా రోజ్‌ అందరూ సేఫ్‌ అయినట్లు హోస్ట్‌ నాగార్జున ప్రకటించారు. అయితే వచ్చే వారం డబుల్ ఎలిమినేషన్‌ ఉంటుందని కంటెస్టెంట్స్‌ను గట్టిగా హెచ్చరించారు. అయితే శోభా శెట్టిని కాపాడడానికే బిగ్‌ బాస్‌ నో ఎలిమినేషన్‌ ప్రాసెస్‌ తీసుకొచ్చారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఆదివారం ఎపిసోడ్‌ విషయానికొస్తే.. మొదటి నుంచే ఎలిమినేషన్‌ ఉన్నట్లుగానే అంతా సాగింది. కంటెస్టెంట్స్‌కు కొన్ని టాస్కులు పెట్టాడు. మొదటగా ప్రిన్స్‌ యావర్, ప్రియాంకను సేఫ్ అంటూ ప్రకటించారు నాగార్జున. ఆ తర్వాత కాసేపటికి అంబటి అర్జున్, అమర్ దీప్‌ సేఫ్ అయ్యారు.

ఇంకో ఫన్నీ టాస్క్ పెట్టిన నాగార్జున శోభా శెట్టి, రతికలను కూడా సేవ్ చేశారు. ఇక చివరిగా మిగిలిన గౌతమ్, అశ్వినీలను గార్డెన్ ఏరియాలోకి రమ్మన్నారు. దీంతో వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్‌ అవుతారని ఆడియెన్స్‌ భావించారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్‌ ఇచ్చాడు. గౌతమ్, అశ్విని శ్రీల ముందు రెండు బాక్సులు ఉంచి అందులో చేయి పెట్టి పైకి తీయాలన్నారు. ఎవరి చేతికి రెడ్ కలర్ ఉంటుందో వాళ్లు ఎలిమినేట్, గ్రీన్ ఉన్న వాళ్లు సేఫ్ అన్నారు. అయితే అనూహ్యంగా ఇద్దరి చేతులకు గ్రీన్‌ కలర్‌ అంటుకోవడంతో అశ్విని, గౌతమ్‌లతో పాటు, హౌజ్‌ మేట్స్‌ కూడా ఆశ్చర్యపోయారు. ఇద్దరూ సేఫ్‌ అయినట్లు నాగార్జున ప్రకటించారు. కాగా 11 వారం నో ఎలిమినేషన్‌కు గల కారణాన్ని కూడా వివరించారు బిగ్‌ బాస్‌. యావర్‌ ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ తిరిగి ఇచ్చేయడంతోనే ఈ వారం ఎలిమినేషన్‌ లేకుండా చేస్తున్నట్లు నాగ్‌ తెలిపారు. అయితే వచ్చే వారం డబుల్ ఎలిమినేషన్‌ ఉంటుందని హౌజ్‌ మేట్స్‌ను గట్టిగానే హెచ్చరించారు. ఇక ఈ ఆదివారం బిగ్‌బాస్‌ హౌజ్‌లో ‘కోట బొమ్మాళి పీఎస్‌’ మూవీ టీమ్‌ వచ్చి సందడి చేసింది. శ్రీకాంత్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌లు నాగార్జునతో కలిసి కంటెస్టెంట్స్‌తో ముచ్చటించారు.\

ఇవి కూడా చదవండి

 ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్.. నాగ్  వార్నింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మైక్రోవేవ్ లో ఈ ఆహారలను వేడి చేస్తున్నారా.. అలా అస్సలు చేయకండి!
మైక్రోవేవ్ లో ఈ ఆహారలను వేడి చేస్తున్నారా.. అలా అస్సలు చేయకండి!
 మైగ్రేన్ తో ఇబ్బంది పడేవారు ఖచ్చితంగా ఈ ఆహారాలను తీసుకోకూడదు!
 మైగ్రేన్ తో ఇబ్బంది పడేవారు ఖచ్చితంగా ఈ ఆహారాలను తీసుకోకూడదు!
ఈ కాలంలో పచ్చి కొబ్బరి తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఈ కాలంలో పచ్చి కొబ్బరి తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
లాంగ్ టూర్ల కోసం ఈ బైక్‌లు బెస్ట్.. సౌకర్యవంతమైన సీట్లు..
లాంగ్ టూర్ల కోసం ఈ బైక్‌లు బెస్ట్.. సౌకర్యవంతమైన సీట్లు..
గుడ్ న్యూస్.. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఏకంగా రూ. 20,000 తగ్గింపు..
గుడ్ న్యూస్.. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఏకంగా రూ. 20,000 తగ్గింపు..
పెద్ద టీవీ కొనాలంటే ఇదే బెస్ట్ టైం.. అమెజాన్లో సూపర్ ఆఫర్స్..
పెద్ద టీవీ కొనాలంటే ఇదే బెస్ట్ టైం.. అమెజాన్లో సూపర్ ఆఫర్స్..
డిసెంబర్లో లాంచ్ కానున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..
డిసెంబర్లో లాంచ్ కానున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..
ఇంటర్వ్యూ టిప్స్‌.. గూగుల్‌ ఎక్స్‌పర్ట్‌ నుంచి.. మిస్‌ కాకండి..
ఇంటర్వ్యూ టిప్స్‌.. గూగుల్‌ ఎక్స్‌పర్ట్‌ నుంచి.. మిస్‌ కాకండి..
మీ కంపెనీ మీ పీఎఫ్‌ నెలానెలా జమ చేస్తుందా? చెక్‌ చేయడం చాలా ఈజీ
మీ కంపెనీ మీ పీఎఫ్‌ నెలానెలా జమ చేస్తుందా? చెక్‌ చేయడం చాలా ఈజీ
ఒక్కసారి రూ. లక్ష పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా రూ. 4లక్షల వరకూ
ఒక్కసారి రూ. లక్ష పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా రూ. 4లక్షల వరకూ