Brahmamudi, November 20th episode: కృష్ణమూర్తికి తెలిసిన అప్పూ ప్రేమ.. రాహుల్ ‘ప్లాన్ బి’.. రంగంలోకి రాజ్!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కృష్ణ మూర్తికి అప్పూ ప్రేమ విషయం చెప్తుంది కనకం. అప్పూని ఎప్పుడూ దాని ఇష్ట ప్రకారమే పెంచాను. కానీ అది ఆడపిల్లలా ఉండాలని ఎన్ని సార్లు చెప్పినా అది వినిపించు కోలేదు. అయితే అది ఆడపిల్ల అన్న విషయం ఇప్పుడు తెలిసింది. అప్పూ.. కళ్యాణ్ బాబుని ప్రేమించింది. ఇది విన్న కృష్ణ మూర్తి షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావ్ కనకం అని అంటాడు. అవునండి.. కళ్యాణ్ బాబు పెళ్లి కుదిరాకే అప్పూ ప్రవర్తనలో మార్పు వచ్చిందని కనకం చెప్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నావే అని కృష్ణ మూర్తి అడిగితే.. మీరు ఎలాంటి మానసిక స్థితిలో..

Brahmamudi, November 20th episode: కృష్ణమూర్తికి తెలిసిన అప్పూ ప్రేమ.. రాహుల్ 'ప్లాన్ బి'.. రంగంలోకి రాజ్!
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Nov 20, 2023 | 11:05 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కృష్ణ మూర్తికి అప్పూ ప్రేమ విషయం చెప్తుంది కనకం. అప్పూని ఎప్పుడూ దాని ఇష్ట ప్రకారమే పెంచాను. కానీ అది ఆడపిల్లలా ఉండాలని ఎన్ని సార్లు చెప్పినా అది వినిపించు కోలేదు. అయితే అది ఆడపిల్ల అన్న విషయం ఇప్పుడు తెలిసింది. అప్పూ.. కళ్యాణ్ బాబుని ప్రేమించింది. ఇది విన్న కృష్ణ మూర్తి షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావ్ కనకం అని అంటాడు. అవునండి.. కళ్యాణ్ బాబు పెళ్లి కుదిరాకే అప్పూ ప్రవర్తనలో మార్పు వచ్చిందని కనకం చెప్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నావే అని కృష్ణ మూర్తి అడిగితే.. మీరు ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నారో.. నాకూ అలాగే ఉందండి అని కనకం అంటుంది. తప్పుని ఎదిరించిన పిల్ల.. తప్పు ఎలా చేసిందే. నేను వెళ్లి దానితో మాట్లాడతాను అని కృష్ణ మూర్తి అంటే.. వద్దయ్యా ఈ విషయం నాకు తెలిసినందుకే నా మొహం చూడటం లేదు. ఇప్పుడు నీకు కూడా తెలిసిందని తెలిస్తే ఇక అది ఇంట్లోనే ఉండదేమో అని అంటుంది కనకం.

అప్పూ ప్రేమ విషయం ఇక్కడే సమాధి అయిపోవాలి.. ఆ భారం నీదే కనకం: కృష్ణ మూర్తి

ఇప్పటికే ఇద్దరి ఆడ పిల్లల్ని వల వేసి అక్కడికి పంపించారని మాటలు అంటున్నారు. ఇప్పుడు దీన్ని కూడా పంపిస్తే.. వాళ్లు అనే మాటలతో మనం బ్రతికి ఉండలేం. నేను కోలుకోలేక పోతున్నా కనకం అని కృష్ణ మూర్తి బాధ పడతాడు. ఏది ఏమైనా అప్పూ ఇంగితం తెలిసిన పిల్ల అని కృష్ణ మూర్తి అంటే.. నాకూ అలాగే ఉందయ్యా.. కానీ అప్పూ ఏమైపోతుందని భయంగా ఉందని కనకం అంటుంది. అదృష్టం కొద్దీ కళ్యాణ్.. అనామికను ప్రేమించాడు కాబట్టి సరిపోయింది. లేదంటే అప్పూ అతని మీద ఆశలు పెంచుకునేది. అది బయట పడితే వాళ్లు అందరూ అనే మాట నిజం అయ్యేది. కావాలనే పథకం వేసి ముగ్గురు కూతుళ్లని.. వాళ్ల వారసులకు వల వేసేటట్టు చేసి కోడళ్లుగా పంపించామన్న నింద పడేది. ఇది ఈ రాత్రే ఈ ఇంట్లోనే సమాధి అయి పోవాలి. ఆ భారం అంతా నీదే అని కృష్ణ మూర్తి ఆవేశంగా చెప్తాడు.

ఇవి కూడా చదవండి

అరుణ్ విషయం రాజ్ కి చెప్పిన పెద్దావిడ:

ఈ సీన్ కట్ చేస్తే.. రాజ్ ఆఫీసుకు వెళ్లడానికి తయారవుతాడు. అప్పుడే ఇందిరా దేవి పిలిచి.. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటుంది. ఏంటి నాన్నమ్మా.. అంత ముఖ్యమైన విషయం అని రాజ్ అడుగుతాడు. ఎవరికి చెప్పాలో.. ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. అందుకే నీతో చెప్తున్నా అని అరుణ్ ఫొటో చూపిస్తుంది పెద్దావిడ. ఆ ఫొటో చూడగానే స్వప్న మాట్లాడిన విషయం గుర్తు తెచ్చుకుంటాడు రాజ్. ఎవరు పంపించారో.. ఎందుకు పంపించారో తెలీదు.. ఈ ఫొటోలు కొరియర్ లో ఇంట్లోకి వచ్చాయి. ఈ ఫొటోతో పాటు స్వప్నతో ఈ అబ్బాయి దిగిన ఫొటోలు కూడా ఉన్నాయి. ఈ ఫొటోలు ఎవరి కంటా కనిపించకుండా వాటిని చింపేశాను. స్వప్నని అడిగితే.. ఇతను ఎవరో తెలీదని అబద్ధం చెప్పింది. కానీ తనేమైనా తప్పు చేస్తుందా అని అనిపించింది. కానీ నిజం తెలీకుండా నిందలు వేయడం పద్దతి కాదు కదా అని పెద్దావిడ అంటుంది. కానీ దీని వల్ల ఇంట్లో ఏమైనా గొడవలకు దారి తీస్తుందని భయంగా ఉంది. అసలే రుద్రాణి గురించి తెలుసు కదా.. ప్రస్తుతం తాతయ్యకు కూడా బాగోలేదు. ఈ టైమ్ లో గొడవలు జరగడం నాకు ఇష్టం లేదని.. అరుణ్ గురించి కనుక్కో అని చెప్తుంది ఇందిరా దేవి.

అరుణ్ గురించి కళావతిని అడిగిన రాజ్.. కంగారులో కావ్య:

ఆ అరుణ్ ఫొటో తీసుకెళ్లి.. కళావతిని అడుగుతాడు రాజ్. ఇక రాజ్ మళ్లీ బెడ్ రూమ్ లోకి రాగానే.. ఆఫీస్ కి టైమ్ అవుతుందని ఎంత స్పీడ్ లో వెళ్లారో.. మళ్లీ అంత స్పీడ్ లో వచ్చారేంటి? మళ్లీ నన్ను చూడాలని అనిపించిందా అని కావ్య అడుగుతుంది. నిన్ను చూడటం కంటే.. ఆ సూర్యుడిని చూడటం బెటర్ అని అంటాడు రాజ్. చూడాల్సింది.. ఓ నాలుగు రోజులు కళ్లు కనిపించడం లేదని ఇంట్లో తిరిగే వారు అని కావ్య అనగానే.. రాజ్ కోపంగా ఏయ్ నన్ను చెప్పనిస్తావా.. అవసరం రాగానే రెచ్చి పోతావ్ కదా అని అంటాడు. మీ చిరాకు పడే ఫేస్ చూడటం కంటే.. ఏంటి అసలు విషయం చెప్పండి అని కావ్య అంటుంది. ఇక ఆ తర్వాత అరుణ్ ఫొటో చూపించి ఇతను ఎవరో తెలుసా అని రాజ్ అడుగుతాడు. అది చూసిన కావ్య షాక్ అవుతుంది. అసలు అరుణ్ ఫొటో ఈయన దగ్గరకు ఎందుకు వచ్చింది? అంటూ మనసులో మాట్లాడుతుంది కావ్య. ఎందుకు అడుగుతున్నారని ని కావ్య అడగ్గా.. ఏయ్ ఏంటి ఆలోచనలో పడ్డావ్ అని రాజ్ అనగానే.. అబ్బా.. అతని పేరు అరుణ్ అండి మా అక్క కాలేజ్ ఫ్రెండ్. డాక్టర్ చదివాడు అని చెప్తుంది. డాక్టరా.. అని రాజ్ ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత కావ్య కూడా టెన్షన్ పడుతుంది. అక్కకి అడిగితే ఏమీ తెలీదని చెబుతుంది. కానీ ఇప్పుడు ఈయన అరుణ్ గురించి అడుగుతున్నాడు. అసలు ఏం జరిగిందని కావ్య ఆలోచిస్తుంది.

ఇంటికి వచ్చిన కళ్యాణ్.. చిరాకు పడ్డ కృష్ణ మూర్తి, అప్పూ:

ఈ సీన్ కట్ చేస్తే.. అప్పూ కోసం వస్తాడు కళ్యాణ్. అతన్ని చూసిన ఇంట్లోని వాళ్లందరూ షాక్ అవుతారు. ఏంటి ఇంకా రెడీ కాలేదా.. మెసేజ్ పెట్టాను కదా అని కళ్యాణ్ అంటే.. అస్తమానూ ఫోన్ పట్టుకుని కూర్చుంటారా.. అని అప్పూ అంటే.. సరేలే వెళ్లు త్వరగా రెడీ అవ్వు. నీ గోల నీదేనే కానీ నా విషయం ఆలోచించవా అప్పూ చాలా సీరియస్ అవుతుంది. నీ గురించి నా కంటే ఆలోచించే వాళ్లు ఉన్నారా.. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు నువ్వు ఎవర్ని కలుస్తావ్.. కోపం వస్తే ఏం చేస్తావ్ అని చెప్పనా అని కళ్యాణ్ అంటాడు. కానీ నా మనసులో మాట తెలుసుకోలేక పోయావ్ రా భయ్ అని అప్పూ మనసులో అనుకుంటుంది.

అప్పూ నీతో రావడం కుదరదని చెప్పేసిన కృష్ణమూర్తి:

బాబూ.. అప్పూ నీతో రావడం కుదరదు అని అంటాడు. అదేంటి అంకుల్ అలా అన్నారు. అప్పూ నాతో రావడం మీకు ఇష్టం లేదా అని కళ్యాణ్ అంటాడు. అయ్యో అదేం లేదు బాబూ.. అప్పూ చాలా రోజుల నుంచి కాలేజ్ కి వెళ్లడం లేదు. అందుకే వాళ్ల నాన్నని తీసుకెళ్లి కాలేజ్ లో మాట్లాడితే దాన్ని ఎగ్జామ్స్ లో కూర్చో బెట్టమని చెప్పారని కనకం అంటుంది. అవును చదువును అస్సలు నెగ్లెట్ చేయ కూడదు. సరే ఇవాళ కాలేజ్ కి వెళ్లు.. రేపు, ఎల్లుండి వీకెండ్ కదా.. మనం బయటకు వెళ్దాం ఓకేనా అంకుల్ అని కళ్యాణ్ అడిగితే.. కృష్ణ మూర్తి సీరియస్ గా ముఖం పక్కకి తిప్పుకుంటాడు. ఇక అప్పుడు కనకం మ్యానేజ్ చేస్తుంది. సరే అయితే రేపు వస్తానే.. ఏ పనీ పెట్టుకోకు అనామికతో కలిసి షాపింగ్ కి వెళ్దాం బాయ్ అని చెప్పి కళ్యాణ్ వెళ్లి పోతాడు.

స్వప్నపై మరోసారి సీరియస్ అయిన కావ్య.. నాకేం తెలీదన్న స్వప్న:

ఆ తర్వాత స్వప్ప దగ్గరకు వచ్చి సీరియస్ అవుతుంది కావ్య. ఏంటే పొద్దున్నే నా మీద అరుస్తున్నావ్.. రాజ్ తిట్టాడా అని స్వప్న అడుగుతుంది. కాదు అనుమానం పడుతున్నారు. అనుమానిస్తుంది నిన్ను.. నన్ను కాదు. ఏంటి అలా చేస్తే నా మొగుడు చేయాలి కానీ రాజ్ ఏంటి? అని షాక్ అవుతుంది స్వప్న. నీ ప్రవర్తన తేడాగా ఉంటే ఆయనేంటి? ఇంట్లో అందరూ అనుమానిస్తారు. నేనేం చేశాను.. నేను ఏ తప్పూ చేయలేదని స్వప్న అంటే.. నువ్వు నాకు అరుణ్ విషయంలో అబద్ధం చెప్పావ్ అని కావ్య అంటే.. ఇప్పుడు కూడా అదే అంటున్నా అరుణ్ నాతో కేవలం మాట్లాడటానికి మాత్రమే వచ్చాడు. అయితే ఏంటి అని స్వప్న అంటే.. అయితే అరుణ్ ఫొటో మా ఆయన దగ్గరకు ఎలా వచ్చింది? అని కావ్య అడుగుతుంది. అయితే అరుణ్ ఫొటో తీసుకెళ్లి అమ్మమ్మ.. రాజ్ కి ఇచ్చింది అన్న మాట.. ఇప్పుడు దీనికి చెప్తే.. నిజం చెప్పమని గోల చేస్తుంది. నాకేం తెలీదు కావ్య అని స్వప్న అంటుంది.

ఏ తప్పూ లేకుండా నేనెందుకు భయ పడతానన్న స్పప్న:

మరి అరుణ్ ఫొటో మా ఆయన దగ్గరకు ఎందుకు వచ్చిందని కావ్య అంటే.. అది రాజ్ ని అడుగు నాకేం తెలుసు అని స్వప్న అంటుంది. అంటే నాకు నిజం చెప్పవా.. సరే మరోసారి ఈ ఇంట్లో దోషిగా నిలబడకు అంటున్నా అని కావ్య అంటే.. చూడు నువ్వు భయ పడేంతగా అక్కడ ఏమీ లేదు.. వాడికీ నాకూ ఏం సంబంధం లేదు. రాజ్ ఎందుకు అడిగాడో తెలుసు కోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. నేను తప్పు చేస్తేనే ఎవ్వర్నీ పట్టించు కోను. అలాంటిది. ఏ తప్పూ లేకుండా అరుణ్ విషయంలో నేనెందుకు భయ పడతాను. ఎవరు వచ్చి అడిగినా నేను ఖచ్చితంగా చెప్పగలను.. అరుణ్ నా ఫ్రెండ్ అని చెప్తుంది స్వప్న. ఇదంతా పై నుంచి రాహుల్ వింటాడు. ఈ విషయంలో ఎవరు ఎన్ని ఎంక్వైరీలు చేసినా నాకు భయం లేదని అక్కడి నుంచి వెళ్లి పోతుంది స్వప్న.

రాహుల్ ‘ప్లాన్ బి’.. రంగంలోకి దిగిన రాజ్:

అక్క అంత స్ట్రాంగ్ గా చెప్తుందంటే నిజంగానే ఏ తప్పూ జరగలేదు. అనవసరంగా నేనే భయ పడుతున్నా అని కావ్య మనసులో అనుకుంటుంది. ఇదంతా విన్ రాహుల్.. నా పెళ్లానికి కాన్ఫిడెన్స్ బలంగానే ఉంది. ఇక స్టేజ్ 2 మొదలు పెట్టాల్సిందే. వెంటనే అరుణ్ కి కాల్ చేసి.. నా పెళ్లానికి ఫోన్ చేసి డబ్బులు అడుగు అని అంటాడు రాహుల్. ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి.. అంత డబ్బు స్వప్న దగ్గర ఎక్కడిది.. మీరేమైనా ఇచ్చారా అని అరుణ్ అంటే.. ఇలాంటి తొక్కలో ప్రశ్నలు అడిగితే నీ హాస్పిటల్ కి పర్మిషన్ రాదు అని రాహుల్ అంటాడు. ఇక రాజ్ కారులో ఆఫీసుకు వెళ్తూ.. స్వప్న విషయం గురించి ఆలోచిస్తాడు. వెంటనే కారు ఆపి.. పోలీస్ కి కాల్ చేసి మీకు ఒక ఫొటో పంపిస్తాను.. తన పేరు అరుణ్ తన గురించి మొత్తం డిటైల్స్ కావాలి అని రాజ్ అంటాడు. ఈవినింగ్ వరకూ చెప్తానని పోలీసు అంటాడు.