World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌ ప్లేయర్.. ఫ్యాన్స్ ఫైర్

ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై క్రికెట్‌ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లందరూ ప్రపంచ కప్‌తో సరదాగా ఫొటోలు దిగారు.

World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌ ప్లేయర్.. ఫ్యాన్స్ ఫైర్
Sachin, Mitchell Marsh
Follow us
Basha Shek

|

Updated on: Nov 20, 2023 | 11:15 AM

రికార్డు స్థాయిలో ఆరోసారి వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో టీమ్‌ఇండియాను ఓడించి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా జట్టు 42 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఈ లక్ష్యాన్ని చేరుకుంది. కాగా ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై క్రికెట్‌ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లందరూ ప్రపంచ కప్‌తో సరదాగా ఫొటోలు దిగారు. అయితే ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ మాత్రం వరల్డ్‌ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగుతూ ఫొటోలకు పోజులిచ్చాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రతిష్ఠాత్మక, గౌరవప్రదమైన ప్రపంచకప్‌ను ఇలా అవమానించడం తగదంటూ క్రికెట్‌ అభిమానులు ఆసీస్‌ ప్లేయర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అదే సమయంలో 2011లో టీమిండియా వరల్డ్‌ కప్‌ గెల్చిన నాటి ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటున్నారు ఫ్యాన్స్‌. సచిన్‌, ధోనిలు ప్రపంచ కప్‌ను ముద్దాడుతున్న ఫొటోలను కంపేర్‌ చేస్తూ ఆసీస్‌ క్రికెటర్లను ట్రోల్స్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇలా అమర్యాదగా ప్రవర్తించడం ఇదేమి మొదటిసారి కాదు. 2006లో భారత్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఇలాగే వ్యవహరించారు. అప్పుడు బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉన్న శరద్ పవార్..ఆస్ట్రేలియాకు విన్నింగ్‌ ట్రోఫీని అందించారు. అయితే అప్పటి కెప్టెన్ రికీ పాంటింగ్ స్టేజ్ దిగిపోవాలని శరద్ పవార్ ను నెట్టిసిన ఘటనను మరోసారి గుర్తుచేసుకుంటున్నారు ఫ్యాన్స్‌.

ఇవి కూడా చదవండి

తీరు మారని ఆసీస్..

సచిన్ ను చూసి నేర్చుకోండి..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?

జనం మెచ్చిన సేద్యం..! టెర్రస్‌ గార్డెనింగ్‌పై ఉచిత శిక్షణ..

ఈ స్కోర్ బాగుంటే క్షణాల్లో బ్యాంకు రుణం..!

ఇంట్లో కూరగాయలు పండించుకొండిలా టెర్రస్ గార్డెన్ పై ఫ్రీ ట్రైనింగ్

వయనాడ్‌లో గాంధీ ఫ్యామిలీకే మరోసారి పట్టం..!

హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..

కష్టపడ్డ సొమ్ము ఎక్కడికిపోదు..! 72 చోరీ కేసుల్లో 102 మంది అరెస్ట్

జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..

మీకు ఈ విషయం తెలుసా? బంగారం అమ్మేటప్పుడు ధర ఎందుకు తగ్గుతుంది?
మీకు ఈ విషయం తెలుసా? బంగారం అమ్మేటప్పుడు ధర ఎందుకు తగ్గుతుంది?
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!

అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..

ఒకటో తరగతికీ 4.27 లక్షలు ఫీజు.. మధ్యతరగతి తండ్రి ఆవేదన

ఎలన్ మస్క్ కొత్త టెక్నాలజీతో.. అరగంటలో ఢిల్లీ టూ అమెరికా

పుష్ప2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. ఇచ్చిపడేసిన బన్నీ టీం

అలా మాట్లాడితే.. ఆ మనిషిని తప్పుబట్టినట్టు కాదు