AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC world cup 2023: ఆఖరి ప్రపంచ కప్‌ ఆడేశారా? లిస్టులో రోహిత్‌, షమీతో సహా ఎవరెవరున్నారంటే?

సుమారు నెలరోజులకు పైగా క్రికెట్‌ అభిమానులను అలరించిన వన్డే ప్రపంచకప్‌ ఆదివారం (నవంబర్‌ 19) తో ముగిసింది. ఐసీసీ టోర్నీల్లో రారాజుగా వెలుగొందుతోన్న ఆస్ట్రేలియానే మరోసారి విశ్వవిజేతగా ఆవిర్భవించింది. ఇక స్వదేశంలో జరిగిన ఈ మేజర్ టోర్నీలో వరుస విజయాలతో ఊపుమీదున్న భారత జట్టు ఆఖరి మెట్టుపై బోల్తాపడింది. ఇక మరో వన్డే ప్రపంచ కప్‌ కోసం మరో నాలుగేళ్లు రావాల్సిందే.

ICC world cup 2023: ఆఖరి ప్రపంచ కప్‌ ఆడేశారా? లిస్టులో రోహిత్‌, షమీతో సహా ఎవరెవరున్నారంటే?
Team India
Follow us
Basha Shek

|

Updated on: Nov 20, 2023 | 3:00 PM

సుమారు నెలరోజులకు పైగా క్రికెట్‌ అభిమానులను అలరించిన వన్డే ప్రపంచకప్‌ ఆదివారం (నవంబర్‌ 19) తో ముగిసింది. ఐసీసీ టోర్నీల్లో రారాజుగా వెలుగొందుతోన్న ఆస్ట్రేలియానే మరోసారి విశ్వవిజేతగా ఆవిర్భవించింది. ఇక స్వదేశంలో జరిగిన ఈ మేజర్ టోర్నీలో వరుస విజయాలతో ఊపుమీదున్న భారత జట్టు ఆఖరి మెట్టుపై బోల్తాపడింది. ఇక మరో వన్డే ప్రపంచ కప్‌ కోసం మరో నాలుగేళ్లు రావాల్సిందే. ఈ నేపథ్యంలో కొంత మంది స్టార్‌ ఆటగాళ్లు తమ ఆఖరి ప్రపంచ కప్‌ ఆడేశారనే చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. ప్రస్తుతం హిట్‌ మ్యాన్‌ వయసు 36 ఏళ్లు. ఇప్పటికే ఫిట్‌నెస్‌ సమస్యలతో ఇబ్బంది పడుతోన్న రోహిత్ 2027 వన్డే ప్రపంచ కప్‌లో ఆడడమే అనుమానమే. ఇప్పటికే టీ 20లకు దూరమైన అతను 40 ఏళ్ల వయసులో ప్రపంచ కప్‌ ఆడడం కష్టమేనని భావించవచ్చు. ఈ లిస్టులో ఉన్న మరో పేరు విరాట్‌ కోహ్లీ. ప్రస్తుతం అతని వయసు 35 ఏళ్లు. అయితే ఫిట్‌నెస్‌లో మేటి అయిన విరాట్ రాబోయే ప్రపంచ కప్‌లోనూ ఆడతాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఏదైనా ఆశ్చర్యకర నిర్ణయం తీసుకుంటే తప్ప.

ఇక 33 ఏళ్ల మహమ్మద్‌ షమీ కూడా దాదాపుగా ప్రపంచ కప్‌ నకు గుడ్‌ బై చెప్పేసినట్లే. ప్రస్తుత ప్రపంచ కప్‌లో వికెట్ల వర్షం కురిపించిన ఈ స్టార్ పేసర్‌ వన్డే జట్టులో కొనసాగే అవకాశాలు దాదాపుగా లేనట్లే. అలాగే రవి చంద్రన్‌ అశ్విన్‌ (37), రవీంద్ర జడేజా (34) కూడా ఆఖరి ప్రపంచ కప్‌ ఆడేశారని చెప్పవచ్చు. ఇక ఇతర జట్ల విషయానికి వస్తే.. ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌, శ్రీలంక స్టార్‌ ప్లేయర్‌ ఏంజెలో మాథ్యూస్‌ కూడా రిటైర్మెంట్‌ తీసుకునే యోచనలో ఉన్నారు. వీరితో పాటు 37 ఏళ్ల డేవిడ్‌ వార్నర్‌, 34 ఏళ్ల స్టీవ్‌ స్మిత్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, స్టొయినిస్‌, 33 ఏళ్ల స్టార్క్‌ (ఆస్ట్రేలియా), 33 ఏళ్ల కేన్‌ విలియమ్సన్‌, 34 ఏళ్ల బౌల్ట్‌, సౌథీ (న్యూజిలాండ్‌), 36 ఏళ్ల షకిబుల్‌ హసన్‌, ముష్ఫికర్‌ రహీం (బంగ్లాదేశ్‌), డేవిడ్‌ మలన్‌, మొయిన్‌ అలీ, క్రిస్‌వోక్స్‌, ఆదిల్‌ రషీద్‌ (ఇంగ్లాండ్‌), టెంబా బవుమా, డేవిడ్‌ మిల్లర్‌, వాండర్‌ డసన్‌ (దక్షిణాఫ్రికా), 38 ఏళ్ల మహమ్మద్‌ నబి (అఫ్గానిస్థాన్‌) తదితర ప్లేయర్లకూ ఇదే చివరి ప్రపంచకప్‌ అనడంలోనూ సందేహం లేదు. కాగా ఇదే దక్షిణా ఫ్రికా స్టార్‌ బ్యాటర్‌ అండ్‌ వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ (దక్షిణాఫ్రికా), డేవిడ్‌ విల్లీ (ఇంగ్లాండ్‌) ఈ ప్రపంచకప్‌తో వన్డేలకు గుడ్‌ బై చెప్పేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చిన్నారి ప్రాణం తీసిన పల్లిగింజ.. ఇంట్లో సరదాగా ఆడుకుంటూ...
చిన్నారి ప్రాణం తీసిన పల్లిగింజ.. ఇంట్లో సరదాగా ఆడుకుంటూ...
పండ్లు, కూరగాయలలో పురుగు మందులను గుర్తించడానికి పతంజలి పరిశోధన..
పండ్లు, కూరగాయలలో పురుగు మందులను గుర్తించడానికి పతంజలి పరిశోధన..
నల్ల వెల్లుల్లితో ఇన్ని లాభాలా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
నల్ల వెల్లుల్లితో ఇన్ని లాభాలా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
క్రికెట్ కోసం ఎంతో ఇష్టమైన ఆ రెండింటిని వదిలేసిన వైభవ్ సూర్యవంశీ
క్రికెట్ కోసం ఎంతో ఇష్టమైన ఆ రెండింటిని వదిలేసిన వైభవ్ సూర్యవంశీ
సీఐ కోసం జట్లు పట్టుకున్న ఇద్దరు మహిళలు.. చివరకు
సీఐ కోసం జట్లు పట్టుకున్న ఇద్దరు మహిళలు.. చివరకు
నెయ్యి కాఫీ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు తెలుసా?
నెయ్యి కాఫీ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు తెలుసా?
జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌.. రూ.895కే 336 రోజుల వ్యాలిడిటీ!
జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌.. రూ.895కే 336 రోజుల వ్యాలిడిటీ!
అడవిలో శవమై కనిపించిన ఫ్యామిలీ మ్యాన్ నటుడు.. అసలు ఏం జరిగిందంటే?
అడవిలో శవమై కనిపించిన ఫ్యామిలీ మ్యాన్ నటుడు.. అసలు ఏం జరిగిందంటే?
ఏం అందం మావ..! శ్రీలీలకు పోటీ అంటున్నారుగా..
ఏం అందం మావ..! శ్రీలీలకు పోటీ అంటున్నారుగా..
4 మిత్ర గ్రహాల యుతి.. ఆ రాశులకు నిత్య కల్యాణం పచ్చ తోరణం
4 మిత్ర గ్రహాల యుతి.. ఆ రాశులకు నిత్య కల్యాణం పచ్చ తోరణం