Bigg Boss 7 Telugu: సీక్రెట్ టాస్కులో శివాజీ ఫెయిల్.. డాక్టర్ బాబును చంపేసిన చెల్లెలు..
నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం శివాజీపై అనుమానం వ్యక్తం చేశారు అమర్ దీప్, అర్జున్. పదే పదే వాష్ రూంకు వెళ్లడంతో అతడిపై అనుమానం బలపడింది. ఇక ఇప్పటికే స్టోర్ రూంకు వెళ్లడం ద్వారా ప్రశాంత్ డెడ్ కాగా.. అక్కడకు అతడిని ఎవరు పంపారో తెలుసుకుంటే అతనే మర్డర్లు చేస్తున్నట్లు అని అర్జున్ అంటే వెంటనే శివాజీ పేరు చెప్పేశాడు అమర్ దీప్. "తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తాడు.. వీళ్లందర్నీ ఓ వైపు తిప్పి ఆడారు చూశారు అన మాట వస్తుంది.. ఆ మాట కోసమే అందర్నీ తప్పు దారి పట్టిస్తున్నాడు" ఇదే శివాజీ అన్న గేమ్ ప్లాన్
బిగ్బాస్ హౌస్‍లో పోలీసులు వర్సెస్ కిల్లర్ ఆట మరింత ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఇంట్లో వరుసగా హత్యలు జరుగుతుండగా.. హత్య చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు కష్టపడిపోతున్నారు ఇన్విస్టిగేషన్ ఆఫీసర్స్ అమర్ దీప్, అర్జున్. మరోవైపు వరుసగా హత్యలు చేస్తూ ఎవరికీ దొరక్కుండా తప్పించుకుంటున్నాడు శివాజీ. కానీ నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం శివాజీపై అనుమానం వ్యక్తం చేశారు అమర్ దీప్, అర్జున్. పదే పదే వాష్ రూంకు వెళ్లడంతో అతడిపై అనుమానం బలపడింది. ఇక ఇప్పటికే స్టోర్ రూంకు వెళ్లడం ద్వారా ప్రశాంత్ డెడ్ కాగా.. అక్కడకు అతడిని ఎవరు పంపారో తెలుసుకుంటే అతనే మర్డర్లు చేస్తున్నట్లు అని అర్జున్ అంటే వెంటనే శివాజీ పేరు చెప్పేశాడు అమర్ దీప్. “తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తాడు.. వీళ్లందర్నీ ఓ వైపు తిప్పి ఆడారు చూశారు అన మాట వస్తుంది.. ఆ మాట కోసమే అందర్నీ తప్పు దారి పట్టిస్తున్నాడు” ఇదే శివాజీ అన్న గేమ్ ప్లాన్ అంటూ అసలు విషయం కనిపెట్టేస్తాడు అమర్ దీప్. ఇక ఆ తర్వాత బిగ్బాస్ ఆదేశం ప్రకారం అశ్వినిని చంపేస్తాడు శివాజీ.
కోల్గెట్ తో మిర్రర్ పై క్రై అశ్విని అని రాయడంతో ఆమె చనిపోతుంది. అయితే ఇన్విస్టిగేషన్ ఆఫీసర్స్ మాత్రం అశ్వినిని విచారిస్తూ ఉంటారు. అయితే రతిక మాత్రం శివాజీపై అనుమానం వయ్క్తం చేస్తూ అతడి చేతుల్ని చూస్తుంది. ఏం చేస్తున్నావ్..పిచ్చా అంటూ శివాజీ అనడంతో నాకు అనుమానంగా ఉందంటుంది రతిక. ఇక ఇదే విషయాన్ని పోలీసులకు చేప్పేస్తుంది. ఇక తర్వాత అమర్ దీప్ శివాజీ రాసిన పేస్ట్ తీసుకురావడం.. దానికి వెంట్రుక ఉండడంతో శివాజీపై మరింత అనుమానం బలపడుతుంది. అటు శోభా, ప్రియాంక, గౌతమ్ సైతం శివాజీపై అనుమానం వ్యక్తం చేస్తారు. ఇక ఆ తర్వాత గౌతమ్ ను డెడ్ చేయాలని. డెడ్ స్టిక్కర్ గౌతమ్ కు అంటించాలని చెప్తారు బిగ్బాస్. అయితే శివాజీ తీసుకుంటుండగా అమర్ చూసేస్తాడు. ఏంటది అని అడిగితే అబద్ధం చేప్పేస్తాడు. కానీ చివరకు ఆ డెత్ స్టిక్కర్ అమర్ చూడడంతో శివాజీ సీక్రెట్ టాస్కులో ఫెయిల్ అవుతాడు.
ఇక ఆ తర్వాత ఇంట్లో హత్యలను ప్రియాంక చేయాలని చెప్పగా.. గౌతమ్ ను ప్రియాంక మర్డర్ చేయాలని శివాజీతో చెప్పిస్తారు. శివాజీ ఫోన్ ఇస్తుంటే మీ మాట ఎలా నమ్మాలని..మీరు నన్ను మర్డర్ చేయరని గ్యారంటీ ఏంటీ అంటూ అనుమానం వ్యక్తం చేసింది ప్రియాంక. ఇక శివాజీ ఫోన్ ఇవ్వడంతో అతడు చెప్పినట్లే డెత్ స్టిక్కర్ ను గౌతమ్ కు అంటించడంతో అతడు చనిపోతాడు. దీంతో అర్జున్ కు ప్రియాంక పై అనుమానం వస్తుంది. ముందుగా రతికను జైల్లో వేస్తారు అర్జున్, అమర్. ఆ తర్వాత శివాజీని జైలులో వేస్తారు అమర్ దీప్, అర్జున్.