Maanas: ‘బ్రహ్మముడి’ మానస్‌ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో కాబోయే భార్యతో డ్యాన్స్‌.. వీడియో

ప్రముఖ నటుడు, బ్రహ్మముడి ఫేమ్‌ మానస్‌ నాగుల పల్లి మరికొన్ని గంటల్లో తన బ్యాచిలర్‌ లైఫ్‌కు బై బై చెప్పనున్నాడు. బుధవారం (నవంబర్‌ 22) రాత్రి సరిగ్గా 8..55 గంటలకు శ్రీజ అనే అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేయనున్నాడీ బుల్లితెర స్టార్‌. విజయవాడ వేదికగా వీరి వివాహం గ్రాండ్‌గా జరగనుంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇరు కుటుంబ సభ్యులతో పాటు బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్స్‌ ..

Maanas: 'బ్రహ్మముడి' మానస్‌ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో కాబోయే భార్యతో డ్యాన్స్‌.. వీడియో
Maanas Marriage
Follow us
Basha Shek

|

Updated on: Nov 22, 2023 | 5:30 PM

ప్రముఖ నటుడు, బ్రహ్మముడి ఫేమ్‌ మానస్‌ నాగుల పల్లి మరికొన్ని గంటల్లో తన బ్యాచిలర్‌ లైఫ్‌కు బై బై చెప్పనున్నాడు. బుధవారం (నవంబర్‌ 22) రాత్రి సరిగ్గా 8..55 గంటలకు శ్రీజ అనే అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేయనున్నాడీ బుల్లితెర స్టార్‌. విజయవాడ వేదికగా వీరి వివాహం గ్రాండ్‌గా జరగనుంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇరు కుటుంబ సభ్యులతో పాటు బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్స్‌ ప్రముఖ నటులు ఇప్పటికే పెళ్లి వేదిక దగ్గరకు చేరుకున్నారు. కాగా ప్రి వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా మానస్‌-శ్రీజ హల్డీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాబోయే దంపతులిద్దరూ ఒకరి మీద ఒకరు పసుపు నీళ్లు గుమ్మరించుకున్నారు. అనంతరం ఇద్దరూ కలిసి సంతోషంగా స్టెప్పులేశారు. ఈ వేడుకల్లో బిగ్‌ బాస్‌ కంఎటస్టెంట్స్‌ ఆర్జే కాజల్‌, శుభ శ్రీ రాయగురు, హమీదా, టేస్టీ తాజాతో పాటు తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం మానస్‌- శ్రీజల హల్డీ ఫంక్షన్‌ ఫొటోస్‌, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పలువురు బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే దంపతులకు ముందస్తు పెళ్లి శుభాకాంక్షలు, అభినందనలు చెబుతున్నారు.

మానస్‌ అసలు పేరు సాయి రోహిత్‌. పద్మిని- వెంకటరావు నాగులపల్లిల ఏకైక సంతానం. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించాడు. సోడా గాలిసోడా, ప్రేమికుడు, గ్యాంగ్‌ ఆఫ్‌ గబ్బర్‌ సింగ్‌, కాయ్‌ రాజా కాయ్‌ వంటి సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించి మెప్పించాడు. ఇకె బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌తో బాగా పాపులర్‌ అయ్యాడు. ఇక బ్రహ్మముడి సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు ఫేవరెట్‌ నటుడిగా మారిపోయాడు. ఇందులో రాజ్‌ పాత్రలో అతని నటన అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక మానస్‌- శ్రీజలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

హల్దీ వేడుకల్లో మానస్- శ్రీజ

కాబోయే భార్యతో కలిసి మానస్ సూపర్బ్ స్టెప్పులు..

View this post on Instagram

A post shared by Tasty Teja (@tastyteja)

మానస్, శ్రీజల నిశ్చితార్థ వేడుక..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే