Bigg Boss : బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ రచ్చ.. షూతో కొట్టిన కంటెస్టెంట్..

తెలుగులో కూడా బిగ్ బాస్ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇప్పటికే ఆరు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు. ఇప్పుడు సీజన్ 7 కూడా టెలికాస్ట్ అవుతుంది. మరికొద్ది వారాల్లో బిగ్ బాస్ 7 సీజన్ పూర్తికానుంది. ఇక ఇప్పుడు హిందీఇండస్ట్రీలోనూ బిగ్ బాస్ షో జరుగుతోంది. బిగ్ బాస్ హౌస్ లో భార్యాభర్తలు కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. 

Bigg Boss : బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ రచ్చ.. షూతో కొట్టిన కంటెస్టెంట్..
Bigg Boss
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 22, 2023 | 5:55 PM

బిగ్ బాస్ షో అంటేనే రచ్చ. గడవలు, గోలలు , అరుపులు, ఏడుపులతో గందరగోళంగా ఉంటుంది. బిగ్ బాస్ అనేది అతిపెద్ద రియాలిటీ గేమ్ షో.. ఇప్పటికే అనేక భాషల్లో ఈ గేమ్ షో రన్ అవుతుంది. తెలుగులో కూడా బిగ్ బాస్ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇప్పటికే ఆరు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు. ఇప్పుడు సీజన్ 7 కూడా టెలికాస్ట్ అవుతుంది. మరికొద్ది వారాల్లో బిగ్ బాస్ 7 సీజన్ పూర్తికానుంది. ఇక ఇప్పుడు హిందీ ఇండస్ట్రీలోనూ బిగ్ బాస్ షో జరుగుతోంది. గతంలో బిగ్ బాస్ హౌస్ లో భార్యాభర్తలు కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే.

బాలీవుడ్ బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు అంకితా లోఖండే , విక్కీ జైన్ పాల్గొన్నారు.. బాలీవుడ్‌లో సెలబ్రెటీస్ అయిన ‘ బిగ్ బాస్ హిందీ సీజన్ 17’ షోలో పాల్గొన్నారు. భార్య భర్తలు అయిన అంకితా లోఖండే , విక్కీ జైన్ బయట అన్యూణ్యంగా ఉన్న వీరు. బిగ్ బాస్ లో మాత్రం ఈ దంపతులు బద్ధ శత్రువుల్లా పోట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అంకిత లోఖండే తన భర్తను షూతో కొట్టింది .

బిగ్ బాస్ హౌస్ లో లంచ్ గురించి చర్చ జరిగింది. విక్కీ జైన్ మాటలకు అంకితా లోఖండేకి నచ్చలేదు. ఇద్దరి మధ్య వాదన జరిగింది. గొడవ ముదరడంతో అంకిత లోఖండే సహనం కోల్పోయింది. భర్తను చెంపదెబ్బ కొట్టి కొట్టింది. ఈ క్రమంలో షో కూడా విసిరేసింది.  విక్కీ జైన్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు.

భార్య చెంపదెబ్బ తిన్న తర్వాత కూడా విక్కీ జైన్ కూల్‌గా ప్రవర్తించాడు. ఆ క్షణాన్ని చాలా సరదాగా తీసుకున్నాడు. ‘భార్య చాలా ఖరీదైన బూట్లతో కొట్టింది’ అని అని కామెడీ చేసే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ అంకితా లోఖండే ప్రవర్తించిన తీరు మిగతా కంటెస్టెంట్స్‌ని షాక్ కు గురిచేసింది. అంకిత గత ఎపిసోడ్‌లలో కూడా తన భర్తపై చాలా ఆరోపణలు చేసింది.

అంకితా లోఖండే హిందీ టెలివిజన్ ద్వారా గుర్తింపు పొందింది. ఆమె సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కలిసి ‘పవిత్ర రిష్తా’ సీరియల్‌లో నటించింది. నిజ జీవితంలోనూ వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే కొన్నాళ్ల తర్వాత అంకితా లోఖండే, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విడిపోయారు. ఆ తర్వాత రియా చరకవర్తితో సుశాంత్ ప్రేమలో పడ్డాడు. అంకిత విక్కీ జైన్‌ను వివాహం చేసుకుంది. ఇప్పుడు వీరిద్దరూ బిగ్ బాస్ లో పాల్గొన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.