AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guess The Actress: డెంగ్యూ బారిన స్టార్‌ హీరోయిన్‌.. 8 రోజులుగా ఆస్పత్రిలోనే.. ఎవరో గుర్తు పట్టారా?

కవైపు స్టార్‌ హీరోల సరసన గ్లామర్‌ పాత్రలు పోషిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌తోనూ మెప్పిస్తుంటుందీ అందాల తార. ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ సడెన్‌గా డెంగ్యూ బారిన పడింది. సుమారు 8 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటోంది. సిల్వర్‌ స్క్రీన్‌పై ఎంతో అందంగా కనిపించే ఈ సొగసరి ఇప్పుడు మాత్రం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.

Guess The Actress: డెంగ్యూ బారిన  స్టార్‌ హీరోయిన్‌.. 8 రోజులుగా ఆస్పత్రిలోనే.. ఎవరో గుర్తు పట్టారా?
Actress
Basha Shek
|

Updated on: Nov 22, 2023 | 6:40 PM

Share

పై ఫొటోలో ఉన్న స్టార్‌ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ హిందీ సినిమాలు చూసే వారికి ఈమె బాగా పరిచయం. బాలీవుడ్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న నటీమణుల్లో ఈమె కూడా ఒకరు. ఒకవైపు స్టార్‌ హీరోల సరసన గ్లామర్‌ పాత్రలు పోషిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌తోనూ మెప్పిస్తుంటుందీ అందాల తార. ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ సడెన్‌గా డెంగ్యూ బారిన పడింది. సుమారు 8 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటోంది. సిల్వర్‌ స్క్రీన్‌పై ఎంతో అందంగా కనిపించే ఈ సొగసరి ఇప్పుడు మాత్రం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. బహూశా డెంగ్యూ ఎఫెక్ట్‌తో బాగా బలహీనంగా మారిపోయింది. ఇంతకీ ఈ అందాల తార ఎవరో గుర్తుపట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా? ఈ బ్యూటీ మరెవరో కాదు హిందీ సినీ పరిశ్రమకు చెందిన భూమి పడ్నేకర్‌. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నసడెన్‌గా ఆస్పత్రిలో కనిపించింది. తన ఆరోగ్యం క్షీణించడమే దీనికి కారణం. ఆసుపత్రిలో ఉన్న నటి ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో బయటకు రావడంతో అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా భూమి పెడ్నేకర్ స్వయంగా ఆసుపత్రి నుండి ఒక చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఆ ఫోటోను పోస్ట్ చేస్తూ తనకు డెంగ్యూ వచ్చిందని ఫ్యాన్స్‌తో తెలిపింది. అలాగే తన ఆరోగ్య పరిస్థితి గురించి అభిమానులకు తెలియజేసింది. భూమి పెడ్నేకర్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాదు, డెంగ్యూ రోగుల సంఖ్య పెరుగుతున్నందున అభిమానులు జాగ్రత్తగా ఉండాలని తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలని నటి సలహా ఇచ్చింది. ‘డెంగ్యూ దోమ ఎనిమిది రోజులుగా నన్ను చాలా ఇబ్బంది పెడుతోంది. కానీ ఈ రోజు నేను నిద్ర లేచాను. ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా నాకు, నా కుటుంబానికి చాలా కష్టంగా ఉంది. అటువంటి సమయంలో మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడం, దోమల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం చాలా ముఖ్యం. మన రోగనిరోధక వ్యవస్థ కాలుష్యం వల్ల ప్రభావితమవుతుంది. నాకు తెలిసి చాలా మందికి డెంగ్యూ ఉంది. ఒక అదృశ్య వైరస్ నా ఆరోగ్యాన్ని నాశనం చేసింది’ అని భూమి చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

డెంగ్యూ నరకం చూపిస్తోంది..

ఇక తనకు చికిత్సను అందించిన డాక్టర్లు, నర్సులు, కుటుంబ సభ్యులకు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపింది భూమి పడ్నేకర్‌. నటి పోస్ట్‌పై అభిమానులు కూడా లైక్‌లు, కామెంట్‌ల వర్షం కురిపిస్తున్నారు. భూమి కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. భూమి పెడ్నేకర్ నటించిన ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’ చిత్రం ఇటీవల విడుదలైంది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా అలరించలేకపోయింది. ఇప్పుడు భూమి రాబోయే సినిమా కోసం అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.

డాక్టర్లకు థ్యాంక్స్..