AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha-Mansoor Ali Khan: క్షమించడమే గొప్ప విషయం.. మన్సూర్‌తో వివాదానికి ముగింపు పలికిన త్రిష

జాతీయ మహిళా కమిషన్‌ సైతం మన్సూర్‌ కామెంట్స్‌పై మండిపడింది. సుమోటోగా కేసు కూడా నమోదు చేసింది. త్రిషకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అయితే తనపై విమర్శలు వస్తోన్నా ఏ మాత్రం పట్టనట్టు వ్యవహరించాడీ సీనియర్‌ నటుడు. పైగా తానేం తప్పు చేయలేదంటూ త్రిషకు క్షమాపణలు చెప్పబోనని బీరాలు పలికాడు.

Trisha-Mansoor Ali Khan: క్షమించడమే గొప్ప విషయం.. మన్సూర్‌తో వివాదానికి ముగింపు పలికిన త్రిష
Mansoor Ali Khan, Trisha
Basha Shek
|

Updated on: Nov 24, 2023 | 7:28 PM

Share

స్టార్‌ హీరోయిన్‌ త్రిషపై ప్రముఖ నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులందరూ మన్సూర్‌ వ్యాఖ్యలను ఖండించారు. మెగాస్టార్‌ చిరంజీవి, ఆర్కే రోజా, నితిన్‌, లోకేష్‌ కనగరాజ్‌, మాళవికా మోహనన్‌, కుష్బూ ఇలా.. పలువురు సినీ ప్రముఖులు త్రిషకు అండగా నిలిచారు. జాతీయ మహిళా కమిషన్‌ సైతం మన్సూర్‌ కామెంట్స్‌పై మండిపడింది. సుమోటోగా కేసు కూడా నమోదు చేసింది. త్రిషకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అయితే తనపై విమర్శలు వస్తోన్నా ఏ మాత్రం పట్టనట్టు వ్యవహరించాడీ సీనియర్‌ నటుడు. పైగా తానేం తప్పు చేయలేదంటూ త్రిషకు క్షమాపణలు చెప్పబోనని బీరాలు పలికాడు. అయితే మన్సూర్‌ మీద కేసుల నమోదయ్యాయి. నడిగర్‌ సంఘం ఈ నటుడిపై ఆంక్షలు కూడా విధించింది. దీంతో మన్సూర్‌ దిగి రాక తప్పలేదు. త్రిషకు క్షమాపణలు చెప్పక తప్పలేదు. అయితే ఈ క్షమాపణలోనూ ‘కత్తి పట్టకుండా, రక్తం లేకుండా గెలిచా. అహింసా మార్గం వైపే నిలబడ్డాను’ అంటూ ఏదో మహాత్ముడిలా సూక్తులు వల్లించాడు.

అయితే త్రిష మాత్రం మరోసారి తన పెద్ద మనసును చాటుకుంది. మన్సూర్‌ అలీఖాన్‌ క్షమాపణ వ్యాఖ్యలను పరిగణణలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు ‘తప్పులు చేయడం మానవ సహజం.. వాటిని క్షమించడమే చాలా గొప్ప విషయం’ అంటూ త్రిష ట్వీట్ వేసింది. అంటే మన్సూర్‌ను త్రిష కూడా క్షమించేసినట్టుగానే కనిపిస్తోంది. ప్రస్తుతం త్రిష ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఇంతటితో నైనా ఈ వివాదం సద్దుమణుగుతుందో లేదో చూడాలి. కాగా తనపై చేసిన కామెంట్లకు గానూ ఇక ఎప్పటికీ మన్సూర్‌ అలీఖాన్‌తో నటించనని త్రిష తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ లియో సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్లలోనే మన్సూర్‌ త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు.

ఇవి కూడా చదవండి

త్రిష ట్వీట్..

మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలపై త్రిష రియాక్షన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.