Animal Trailer: నాన్న మీద ఈగ వాలితే ఢిల్లీ నైనా తగలబెడతా.. రణ్‌బీర్‌, రష్మిక ‘యానిమల్‌’ ట్రైలర్‌ చూశారా?

అర్జున్‌ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్‌ డైరెక్టర్ల లిస్టులోకి మారిపోయారు సందీప్‌ రెడ్డి వంగా. ఇదే సినిమాను కబీర్‌ సింగ్‌గా హిందీలోనూ తెరకెక్కించి బ్లాక్‌ బస్టర్‌ హిట్ కొట్టారు. ఇప్పుడు మరోసారి బాలీవుడ్‌లోనే తన అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు సందీప్‌ రెడ్డి. ఆయన దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తోన్న సినిమా 'యానిమల్'. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది.

Animal Trailer: నాన్న మీద ఈగ వాలితే ఢిల్లీ నైనా తగలబెడతా..  రణ్‌బీర్‌, రష్మిక 'యానిమల్‌' ట్రైలర్‌ చూశారా?
Animal Movie
Follow us
Basha Shek

|

Updated on: Nov 23, 2023 | 6:40 PM

అర్జున్‌ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్‌ డైరెక్టర్ల లిస్టులోకి మారిపోయారు సందీప్‌ రెడ్డి వంగా. ఇదే సినిమాను కబీర్‌ సింగ్‌గా హిందీలోనూ తెరకెక్కించి బ్లాక్‌ బస్టర్‌ హిట్ కొట్టారు. ఇప్పుడు మరోసారి బాలీవుడ్‌లోనే తన అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు సందీప్‌ రెడ్డి. ఆయన దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తోన్న సినిమా ‘యానిమల్’. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.యానిమల్‌ ట్రైలర్‌లో ఫస్ట్ టు లాస్ట్ ఫ్రేమ్‌ ప్రతి క్షణాన్నీ తండ్రీ కొడుకుల థీమ్‌తోనే డిజైన్‌ చేశారు సందీప్‌ రెడ్డి వంగా. అనిల్‌ కపూర్‌, రణ్‌బీర్‌ కపూర్‌ మధ్య వచ్చే సన్నివేశాలే కాదు, రష్మికతో ఉన్నవి, బాబీ డియోల్‌తో కనిపించినవి.. ఇలా ప్రతి షాట్‌లోనూ కనిపించిన ఎమోషన్‌ ఫాదర్‌ సెంటిమెంట్‌. ట్రైలర్‌లో ఫర్వాలేదుగానీ, సినిమాలో కూడా ఫస్ట్ టు లాస్ట్ ఫ్రేమ్‌ ఇలాగే ఉంటే పరిస్థితి ఏంటి? మూడు గంటల 21 నిమిషాల 23 సెకన్ల 16 ఫ్రేముల నిడివి ఉంది మూవీ. మరి ఇంత డ్యూరేషన్‌ని స్క్రీన్‌ మీద ఓపిగ్గా చూసే పరిస్థితి ఉంటుందా? అంత గొప్ప మ్యాజిక్‌ని సందీప్‌ క్రియేట్‌ చేస్తారా? అనే అనుమానాలు వినిపిస్తున్నాయి.

తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో..

అర్జున్‌ రెడ్డి రీమేక్‌ తర్వాత సందీప్‌ చేస్తున్న సినిమా ఇది. స్క్రీన్‌ మీద ఆ మేజిక్‌ గట్టిగా కనిపిస్తేగానీ జనాలకు కనెక్ట్ కాదు. మరి యాక్షన్‌ కా బాప్‌ అన్నట్టు తీసిన యానిమల్‌ యాక్షన్‌ ప్రియులను మెప్పిస్తుందా? అమ్మాయిని మనసారా ప్రేమించిన అర్జున్‌ రెడ్డి లవ్‌నే అందరూ సైకిక్‌ లవ్‌ అని అన్నారు. ఇప్పుడు యానిమల్‌లో తండ్రి మీద రణ్‌బీర్‌ చూపించే లవ్‌ కూడా అలాగే కనిపిస్తోందని అంటున్నారు క్రిటిక్స్. సందీప్‌రెడ్డి మార్క్ ప్రేమ ఇలాగే ఉంటుందంటూ కామెంట్లు చేస్తున్నారు. కేజీయఫ్‌లో యష్‌ వాడిన గన్‌కి పెద్దమ్మ అని పేరు పెట్టుకుంటే, ఇప్పుడు యానిమల్‌లో సందీప్‌ రెడ్డి వాడిన గన్‌ పెద్దమ్మకే పెద్దమ్మలా ఉందంటున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి

యానిమల్ తెలుగు ట్రైలర్ ఇదిగో..

యానిమల్ సినిమాలో రష్మిక మందన్నా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే