Pawan Kalyan: పవన్ వద్దకు అనుకోని అతిథి.. ఆసక్తికర పోస్ట్ చేసిన పవర్ స్టార్..
తాజాగా తన ఇన్ స్టాలో ఆసక్తికర వీడియో షేర్ చేశారు పవన్. బేగంపేట ఎయిర్ పోర్టులో తనకు ఓ అనుకోని అతిథి కలిసిందని తెలిపారు. "నేను బేగం పేట ఎయిర్ పోర్టులో బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్నాను. ఆ సమయంలో నా కోసం ఓ సర్ ప్రైజ్ అతిథి వచ్చారు. తను పోలీస్ డాగ్ స్వ్కాడ్ లో ఉండే బిందు. నాతో చాలా స్నేహంగా ఉంది. తన తోకని ఆసక్తిగా ఊపుతూ నాలో ఉత్సాహం నింపింది. నా మనసుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. టేకాప్ కు ముందు ఊహించని విధంగా ఓ అందమైన అనుభూతిని ఇచ్చింది" అంటూ పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. ఇప్పుడు ఆయన చేతిలో ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీరమల్లు చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ మూడు చిత్రాలపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే..కొద్ది రోజులుగా రాజకీయాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆయన తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్ స్టాలో ఆసక్తికర వీడియో షేర్ చేశారు పవన్. బేగంపేట ఎయిర్ పోర్టులో తనకు ఓ అనుకోని అతిథి కలిసిందని తెలిపారు. “నేను బేగం పేట ఎయిర్ పోర్టులో బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్నాను. ఆ సమయంలో నా కోసం ఓ సర్ ప్రైజ్ అతిథి వచ్చారు. తను పోలీస్ డాగ్ స్వ్కాడ్ లో ఉండే బిందు. నాతో చాలా స్నేహంగా ఉంది. తన తోకని ఆసక్తిగా ఊపుతూ నాలో ఉత్సాహం నింపింది. నా మనసుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. టేకాప్ కు ముందు ఊహించని విధంగా ఓ అందమైన అనుభూతిని ఇచ్చింది” అంటూ పవన్ కళ్యాణ్ ఆ డాగ్ తో కలిసి సరదాగా గడిపిన క్షణాలను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేశారు పవన్ కళ్యాణ్.
చాలా కాలంగా ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలను ఊపయోగిస్తున్నారు పవన్. ఇక ఇటీవలే కొత్త ఇన్ స్టా ఖాతా ఓపెన్ చేశారు. ప్రస్తుతం ఆయనకు ఇన్ స్టాలో 2.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ట్విట్టర్ వేదికగా ఎప్పుడూ రాజకీయాల గురించి పోస్టులు పెడుతుంటారు పవన్. కానీ ఇన్ స్టాలో మాత్రం రాజకీయాలకు సంబంధించిన విషయాలను చాలా తక్కువగా షేర్ చేస్తుంటారు. రెండు వారాల కింద నరేంద్ర మోడీ సభ గురించి మాత్రమే ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఇక ఇప్పుడు బేగంపేట్ ఎయిర్ పోర్టులో కలిసిన అనుకోని అతిథి గురించి ఓ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం పవన్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.
View this post on Instagram
ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే.. సాహో మూవీ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమా చేస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుంది. అలాగే డైరెక్టర్ హరిష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు. ఇందులో శ్రీలీల నటిస్తుండగా.. ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ అయిన హరి హర వీరమల్లు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ భారీ అంచనాల మధ్య ఎదురుచూస్తున్న చిత్రాలు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.