Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan: మా పోస్టర్లు, కటౌట్‌లపై పోసే పాలను చిన్నారులకు పంచండి.. ఫ్యాన్స్‌కు సల్మాన్‌ విజ్ఞప్తి

గత కొన్నేళ్లుగా సల్మాన్‌ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద వరుసగా బోల్తా పడుతున్నాయి. అయితే టైగర్‌ 3 మాత్రం అంచనాలకు మించి వసూళ్లు రాబడుతోంది. దీంతో చిత్రబృందంతో పాటు అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే తన సినిమా హిట్టయినా సల్మాన్‌ ఖాన్‌ మాత్రం అసంతృప్తితో ఉన్నారట. దీనికి కారణం అతని అభిమానులేనట. '

Salman Khan: మా పోస్టర్లు, కటౌట్‌లపై పోసే పాలను చిన్నారులకు పంచండి.. ఫ్యాన్స్‌కు సల్మాన్‌ విజ్ఞప్తి
Salman Khan, Katrina Kaif
Follow us
Basha Shek

|

Updated on: Nov 24, 2023 | 6:35 PM

బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ 3’ చిత్రం ఇటీవల విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. దీపావళి కానుకగా నవంబర్‌ 12న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే సుమారు రెండు వారాలు రన్‌ పూర్తి చేసుకున్న టైగర్‌ 3 దాదాపు రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిందని ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా సల్మాన్‌ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద వరుసగా బోల్తా పడుతున్నాయి. అయితే టైగర్‌ 3 మాత్రం అంచనాలకు మించి వసూళ్లు రాబడుతోంది. దీంతో చిత్రబృందంతో పాటు అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే తన సినిమా హిట్టయినా సల్మాన్‌ ఖాన్‌ మాత్రం అసంతృప్తితో ఉన్నారట. దీనికి కారణం అతని అభిమానులేనట. ‘టైగర్ 3’ సినిమా ప్రదర్శింపబడుతున్న ఓ థియేటర్‌లో సల్లూ అభిమానులు పటాకులు పేల్చారు. పటాకులు కాల్చడంతో థియేటర్‌లోని ప్రేక్షకులు లేచి బయటకు పరుగులు తీశారు.దీంతో థియేటర్ కూడా దెబ్బతింది. సల్లూ అభిమానుల ఈ దారుణమైన ప్రవర్తనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు అభిమానులు, నెటిజన్లు దీనిని తీవ్రంగా ఖండించారు.

నటుడు సల్మాన్ ఖాన్ కూడా అభిమానుల చర్యపై మండి పడ్డాడు. ‘ఇది చాలా చెడ్డ పని. సినిమాల్లో పటాకులు కాల్చడం చాలా ప్రమాదకరమైన విషయం. ఎవరూ అలాంటి పని చేయకూడదు’ అని సలహా ఇచ్చాడు సల్మాన్‌. అలాగే ఇక ముందు తన కటౌట్‌కు పాలభిషేకం చేయద్దన్నాడు సల్లూ భాయ్‌. ‘మా పోస్టర్లు, కటౌట్లపై పాలు పోసి వృథా చేయడం చాలా పెద్ద తప్పు. దయచేసి ఆ పాలను చిన్నారలకు పంచండి’ అని సల్మాన్‌ తన ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశాడు. ఈ దీపావళి పండుగకు ‘టైగర్ 3’ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్ కలిసి నటించారు. షారుక్ ఖాన్ కూడా ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ రా ఏజెంట్ పాత్రలో కనిపించాడు. 2012లో విడుదలైన ‘ఏక్ థా టైగర్’ సినిమా సిరీస్‌ను నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ కొనసాగిస్తోంది. ఇప్పుడు ‘టైగర్ 3’ కూడా మొదటి రెండు సినిమాల్లాగే సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో హృతిక్‌ రోషన్‌ కూడా ఓ క్యామియో రోల్‌లో కనిపించాడు.

ఇవి కూడా చదవండి

టైగర్ 3 ప్రమోషన్లలో సల్మాన్, కత్రినా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..