- Telugu News Photo Gallery Cinema photos Hero Pawan Kalyan Next Movie OG Update by Bollywood actor emraan hashmi Telugu Entertainment Photos
Pawan Kalyan – OG: నార్త్ స్టార్ ఒక్క మాటతో పవన్ ఫ్యాన్స్ కు పూనకాలు పక్కా.! OG అప్డేట్.
కొన్నిసార్లు అంతేనండీ... ఇక ఏమీ ఉండదని అనుకున్న చోటే ట్రెండింగ్ మొదలవుతుంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ విషయంలోనూ అదే జరుగుతోంది. నార్త్ స్టార్ చెప్పిన ఓ మాటతో తెగ వైరల్ అవుతోంది ఓజీ. బ్రో సినిమాను స్పీడు స్పీడుగా చేసేసి, జనాల ముందుకు తీసుకొచ్చిన పవన్ కల్యాణ్, ఆ తర్వాత మాత్రం కాస్త నెమ్మదించారు. సెట్స్ మీద ఒకటీ, రెండూ కాదు, మూడు సినిమాలున్నా, ఏది ఎప్పుడు వస్తుందో క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.
Updated on: Nov 24, 2023 | 7:07 PM

కొన్నిసార్లు అంతేనండీ... ఇక ఏమీ ఉండదని అనుకున్న చోటే ట్రెండింగ్ మొదలవుతుంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ విషయంలోనూ అదే జరుగుతోంది. నార్త్ స్టార్ చెప్పిన ఓ మాటతో తెగ వైరల్ అవుతోంది ఓజీ.

బ్రో సినిమాను స్పీడు స్పీడుగా చేసేసి, జనాల ముందుకు తీసుకొచ్చిన పవన్ కల్యాణ్, ఆ తర్వాత మాత్రం కాస్త నెమ్మదించారు. సెట్స్ మీద ఒకటీ, రెండూ కాదు, మూడు సినిమాలున్నా, ఏది ఎప్పుడు వస్తుందో క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.

అప్పుడెప్పుడో మొదలైన హరిహరవీరమల్లుతో పవర్‌స్టార్ ప్యాన్ ఇండియా ఎంట్రీని చూద్దామనుకున్న ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఇప్పట్లో ఎండ్ కార్డ్ అయితే పడేటట్టు లేదు.

కానీ పవన్ కల్యాణ్ ఓజీ సినిమా గురించి ట్రెండ్ అవుతున్న ఓ క్లిప్ మాత్రం వాళ్లల్లో కొత్త జోష్ నింపుతోంది. పవన్ కల్యాణ్ ఓజీ గురించి బాలీవుడ్‌లో స్పందించారు ఇమ్రాన్ హష్మి.

సౌత్‌లో పవన్ కల్యాణ్ ఓజీలో నటిస్తున్నాననంటూ ఆయన చెప్పిన మాటలు ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి. ఓజీ కోసం సుజీత్ క్రియేట్ చేసిన వరల్డ్ సూపర్‌గా ఉందంటూ మెచ్చుకున్నారు..

ఇమ్రాన్ హష్మి రీసెంట్ టైమ్స్ లో పవన్ కల్యాణ్ రీమేకులతోనే రికార్డులు క్రియేట్ చేస్తుంటే, ఇప్పుడు స్ట్రెయిట్ సినిమాను ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఫిదా అయ్యేలా రిలీజ్ చేస్తే, ఊరికే ఉంటామా?

కలెక్షన్లు కుమ్మరించేస్తాం. అందులోనూ పవన్‌కల్యాణ్ ఫేవరేట్ మార్షల్ ఆర్ట్స్ జోనర్‌లో తెరకెక్కుతోంది. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ ఎవరో బాక్సాఫీస్‌కి బోధించేస్తాం అంటున్నారు పవర్‌ఫ్యాన్స్.




