AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Urvashi Rautela: ‘బ్రో అది వరల్డ్‌ కప్‌.. కొంచెం రెస్పెక్ట్‌ ఇవ్వు’ మిచెల్‌ మార్ష్‌కు ఇచ్చి పడేసిన ఊర్వశి

ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ మిచెల్‌ మార్ష్‌ వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి మరీ చిల్‌ బీరు తాగడం క్రికెట్‌ అభిమానులకు షాక్‌కు గురిచేసింది. దీనికి సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో మిచెల్‌ మార్ష్‌ను ఒక ఆట ఆడేసుకున్నారు టీమిండియా ఫ్యాన్స్‌. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ట్రోఫీని అలా అవమానించడం తగదంటూ ఆసీస్‌ ఆల్‌రౌండర్‌పై మండిపడుతున్నారు

Urvashi Rautela: 'బ్రో అది వరల్డ్‌ కప్‌.. కొంచెం రెస్పెక్ట్‌ ఇవ్వు' మిచెల్‌ మార్ష్‌కు ఇచ్చి పడేసిన ఊర్వశి
Urvashi Rautela, Mitchell Marsh
Basha Shek
|

Updated on: Nov 24, 2023 | 5:26 PM

Share

ప్రపంచ కప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా జట్టు భారత జట్టుపై ఘన విజయం సాధించింది. టీమిండియా విధించిన 240 పరుగుల లక్ష్యాన్ని కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది.అదే సమయంలో కోట్లాది మంది భారతీయ అభిమానులకు కన్నీళ్లు మిగిల్చింది. ఆస్ట్రేలియా విజయానంతరం ఆ జట్టు ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. డ్రెస్సింగ్‌ రూమ్‌లోనూ గ్రాండ్‌గా సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ మిచెల్‌ మార్ష్‌ వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి మరీ చిల్‌ బీరు తాగడం క్రికెట్‌ అభిమానులకు షాక్‌కు గురిచేసింది. దీనికి సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో మిచెల్‌ మార్ష్‌ను ఒక ఆట ఆడేసుకున్నారు టీమిండియా ఫ్యాన్స్‌. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ట్రోఫీని అలా అవమానించడం తగదంటూ ఆసీస్‌ ఆల్‌రౌండర్‌పై మండిపడుతున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా కూడా మిచెల్‌ మార్ష్‌కు ఇచ్చి పడేసింది. గతంలో ప్రపంచకప్‌ గెల్చుకున్న కపిల్‌ దేవ్‌ నెత్తి మీద ట్రోఫీ పెట్టుకున్న ఫొటోలు, మిచెల్‌ మార్ష్‌ ఫొటోలను కంపేర్‌ చేస్తూ ‘ బ్రో అది వరల్డ్‌ కప్‌.. కొంచెం రెస్పెక్ట్‌ ఇవ్వు’ అని ఇచ్చి పడేసింది.

ఇవి కూడా చదవండి

ఇది కరెక్ట్ కాదు బ్రో..

ఇక మరొక పోస్ట్‌లో సాకర్‌ వరల్డ్‌ కప్‌తో లియోనాల్‌ మెస్సీ దిగిన ఫొటోను పంచుకున్న ఊర్వశి రౌతెలా.. ‘ వరల్డ్‌ కప్‌ ట్రోఫీపై కాళ్లు పెట్టుకుంటే కూల్‌గా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావ్‌.. కానీ అది కరెక్ట్‌ కాదు’ అంటూ మరొసారి కౌంటర్‌ ఇచ్చింది. ఇలా ఊర్వశి షేర్‌ చేసిన పోస్టులకు నెటిజన్ల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. కాగా ప్రపంచ కప్‌ ప్రారంభానికి ముందు వరల్డ్‌ కప్‌ ట్రోఫీతో ఫొటోలు దిగింది ఊర్వశి. ప్రతిష్ఠాత్మక ఈఫిల్‌ టవర్‌ వద్ద ప్రపంచ కప్‌ ట్రోఫీని ముద్దాడుతూ ఫొటోలకు పోజులిచ్చింది. ఈ నేపథ్యంలో వరల్డ్‌ కప్‌ ట్రోఫీతో మార్ష్‌ అమర్యాదగా ప్రవర్తించడంతో ఇలా వరుసగా కౌంటర్లు ఇచ్చి పడేసింది.

ఊర్వశి రౌతెలా పోస్టులివిగో..

ప్రపంచ కప్ ట్రోఫీతో ఊర్వశి రౌతెలా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భక్తులకు గుడ్‌న్యూస్.. అన్ని టీటీడీ ఆలయాల్లోనూ అన్నప్రసాద వితరణ
భక్తులకు గుడ్‌న్యూస్.. అన్ని టీటీడీ ఆలయాల్లోనూ అన్నప్రసాద వితరణ
డిస్ట్రిబ్యూటర్స్ బయ్యర్స్ కూడా ఫుల్ హ్యాపీ
డిస్ట్రిబ్యూటర్స్ బయ్యర్స్ కూడా ఫుల్ హ్యాపీ
భారత్‌ ఎకానమి రేంజ్‌ ఇదీ.. అంచనాలను పెంచిన ఐఎంఎఫ్‌
భారత్‌ ఎకానమి రేంజ్‌ ఇదీ.. అంచనాలను పెంచిన ఐఎంఎఫ్‌
ఇలా చేస్తే దెబ్బకు డయాబెటిస్‌ రివర్స్..
ఇలా చేస్తే దెబ్బకు డయాబెటిస్‌ రివర్స్..
రాత్రిపూట అకస్మాత్తుగా మేల్కొంటున్నారా..? ప్రమాదంలో ఉన్నట్లే..
రాత్రిపూట అకస్మాత్తుగా మేల్కొంటున్నారా..? ప్రమాదంలో ఉన్నట్లే..
సెకండ్ హ్యాండ్ బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? తక్కువ వడ్డీకే రుణాలు
సెకండ్ హ్యాండ్ బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? తక్కువ వడ్డీకే రుణాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మేనేజర్ పోస్టుల కోసం అప్లై చేయండి
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మేనేజర్ పోస్టుల కోసం అప్లై చేయండి
విరాట్, రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
విరాట్, రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
విరాట్ కోహ్లీని ఇమిటేట్ చేసిన యూవీ..చూస్తే కడుపుబ్బ నవ్వాల్సిందే
విరాట్ కోహ్లీని ఇమిటేట్ చేసిన యూవీ..చూస్తే కడుపుబ్బ నవ్వాల్సిందే
రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే!
రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే!