- Telugu News Photo Gallery Cinema photos Hero Suriya Kanguva Movie plans to release in 38 languages Telugu Entertainment Photos
Suriya – Kanguva: రాజమౌళిని బీట్ చేయడానికి రెడీ అవుతున్న సూర్య.! సక్సెస్ అవుతారా.?
పిండి కొద్దీ రొట్టె అనేది పాత మాట. రొట్టెను బట్టి పిండిని ఎక్కువ తక్కువ కలుపుకోవడం ఇప్పుడు స్ట్రాటజీ. సూర్య హీరోగా నటిస్తున్న కంగువ టీమ్ కూడా ఇలాంటి స్ట్రాటజీనే ఫాలో అవుతోంది. గతంలో పోలిస్తే ప్లాన్‌ని డబుల్ ఎక్సెల్ సైజ్‌కి మారుస్తోంది. కంగువ సినిమా 38 భాషల్లో విడుదలవుతోంది. ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో విన్నా ఇదే మాటే. అందులోనూ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ విషయం మీద ఓపెన్ కావడంతో ఫిదా అయిపోతున్నారు మూవీ లవర్స్.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Anil kumar poka
Updated on: Nov 24, 2023 | 5:55 PM

పిండి కొద్దీ రొట్టె అనేది పాత మాట. రొట్టెను బట్టి పిండిని ఎక్కువ తక్కువ కలుపుకోవడం ఇప్పుడు స్ట్రాటజీ. సూర్య హీరోగా నటిస్తున్న కంగువ టీమ్ కూడా ఇలాంటి స్ట్రాటజీనే ఫాలో అవుతోంది. గతంలో పోలిస్తే ప్లాన్‌ని డబుల్ ఎక్సెల్ సైజ్‌కి మారుస్తోంది.

కంగువ సినిమా 38 భాషల్లో విడుదలవుతోంది. ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో విన్నా ఇదే మాటే. అందులోనూ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ విషయం మీద ఓపెన్ కావడంతో ఫిదా అయిపోతున్నారు మూవీ లవర్స్.

సినిమాను ప్రారంభించినప్పుడు జస్ట్ 10 భారతీయ భాషల్లో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు సైజ్ అమాంతం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా 38 భాషల్లో విడుదల చేయడానికి ఫిక్స్ అయ్యారు. భాషల పరంగానే కాదు, టెక్నికల్‌గానూ కేక పుట్టించే డెసిషన్స్ తీసుకున్నారు మేకర్స్.

2డీ, త్రీడీ వెర్షన్స్ తో పాటు ఐమాక్స్ వెర్షన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటిదాకా ఏ భారతీయ సినిమా కూడా ఈ రేంజ్ రిలీజ్‌ని ఎక్స్ పీరియన్స్ చేయలేదు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది కంగువ.

వెయ్యేళ్ల క్రితం జరిగిన అంశాలతో రూపొందిస్తున్నారు. సూర్య ప్రధానంగా మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తారు. కానీ, సినిమాలో భాగంగా పదికి పైగా గెటప్పుల్లో ఫ్లాష్ అవుతారని టాక్. డిసెంబర్‌కి షూటింగ్ పూర్తవుతుంది.

ఈ సినిమా కోసం స్పెషల్ వరల్డ్ సృష్టిస్తున్నారని, అందులో వాడే భాషను కూడా కొత్తగా క్రియేట్ చేశామని రైటర్ మదన్ కర్కి చెప్పారు. బాహుబలిలో కిలికి లాంగ్వేజ్ ఎంత ఫేమస్సో మనకు తెలుసు. ఆ రేంజ్‌లో సూర్య కంగువ లాంగ్వేజ్ కూడా ఫేమస్ అవుతుందన్నది మేకర్స్ మాట.

సౌత్ నుంచి ఎప్పుడూ ప్రయోగాలు చేయడంలో ముందుంటారు రాజమౌళి. ఇప్పుడు సూర్య అండ్ శివ టీమ్ చేస్తున్న ఈ ప్రయోగాలన్నీ రాజమౌళిని మించిపోయానని అంటున్నారు క్రిటిక్స్.





























