Bigg Boss 7 Telugu: హౌస్‌మేట్స్‌లో డబుల్ ఎలిమినేషన్ టెన్షన్.. ముగిసిన ఓటింగ్.. ఆ ఇద్దరూ బయటికే..
గత వారం హౌజ్‌లో ఎలిమినేషన్ జరగలేదు. అయితే ఈ వీక్ మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని నాగార్జున చెప్పాడు. దీంతో ఈ వారం హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోయే కంటెస్టెంట్లు ఎవరా? అన్న ఆసక్తి బిగ్ బాస్ ఆడియెన్స్‌లో ఉంది. ఇక ప్రస్తుతం హౌజ్‌లో 10 మంది సభ్యులుండగా.. 12 వారం నామినేషన్స్‌లో ఏకంగా 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే 12 వారం వీకెండ్ కు చేరుకున్న ఈ రియాలిటీ షోకు త్వరలోనే ఎండ్ కార్డ్ పడనుంది. గత వారం హౌజ్‌లో ఎలిమినేషన్ జరగలేదు. అయితే ఈ వీక్ మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని నాగార్జున చెప్పాడు. దీంతో ఈ వారం హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోయే కంటెస్టెంట్లు ఎవరా? అన్న ఆసక్తి బిగ్ బాస్ ఆడియెన్స్‌లో ఉంది. ఇక ప్రస్తుతం హౌజ్‌లో 10 మంది సభ్యులుండగా.. 12 వారం నామినేషన్స్‌లో ఏకంగా 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. రతికా రోజ్, ప్రిన్స్ యావర్, శివాజీ, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, అర్జున్ అంబటి, అమర్ దీప్, అశ్విని ఇలా 8 మంది నామినేషన్స్ జాబితాలో ఉన్నారు. వీరికి మంగళవారం నుంచి నిర్వహించిన ఓటింగ్ ప్రక్రియ శుక్రవారం (నవంబర్ 24)తో ముగిసింది. బిగ్ బాస్ 7 తెలుగు 12వ వారం ఓటింగ్‌లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతనికి 30.53 శాతం ఓట్లు పడ్డాయి. ఇక ఎప్పుడు ఓటింగ్‌లో టాప్ లో ఉండే శివాజీ ఈసారి మాత్రం వెనక్కి పడిపోయాడు. 19.99 శాతం ఓట్లతో రెండో ప్లేస్‌లో ఉన్నాడు.
ఇక సీరియర్ బ్యాచ్ లీడర్ అమర్ దీప్ చౌదరి 17.41 శాతంతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక 11.5 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో ప్రిన్స్ యావర్, 8.89 శాతంతో ఐదో స్థానంలో గౌతమ్ కృష్ణ హౌజ్‌లో కొనసాగుతున్నారు. ఇక రతికా రోజ్ 4.28 శాతం ఓట్లతో ఆరో స్థానంలో ఉండగా.. ఇన్నే ఓట్లతో సమీపంలోనే అర్జున్ అంబటి కూడా ఉన్నాడు. ఇక చివరిగా అశ్విని శ్రీ ఏడో స్థానంలో ఉంది. అంటే ప్రస్తుతం రతిక, అర్జున్, అశ్విని డేంజర్ జోన్‌లో ఉన్నారట. కాగా కంటెస్టెంట్స్‌లో డబుల్ ఎలిమినేషన్ టెన్షన్ నెలకొంది. ఒక వేళ బిగ్ బాస్ ఓటింగ్‌నే పరిగణనలోకి తీసుకుంటే అర్జున్, అశ్విన్ ఈ వీక్ హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోతారు. అయితే ఎవిక్షన్ పాస్‌తో ఒకరిని సేవ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ చాన్స్ పల్లవి ప్రశాంత్ కు ఉంది. మరి ప్రశాంత్ ఎవిక్షన్ పాస్‌తో ఎవరినైనా సేవ్ చేస్తాడా? లేదా? అన్నది వేచి చూడాల్సి ఉంది.
బిగ్ బాస్ నామినేషన్స్ లో ఉన్నది వీరే..
View this post on Instagram
డేంజర్ జోన్ లో అర్జున్, అశ్విని శ్రీ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.