- Telugu News Photo Gallery Cinema photos Manchu Manoj interesting comments brother relationship at Sampoorneshbabu movie event
Manchu Manoj: ‘అన్మదమ్ముల బంధం బలంగా ఉండాలంటే’.. మంచు మనోజ్ ఆసక్తికర కామెంట్స్
సంపూర్ణేశ్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం 'సోదరా'. మన్మోహన్ మేనంపల్లి తెరకెక్కించిన ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి రాక్ స్టార్ మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.
Updated on: Nov 25, 2023 | 1:38 PM

సంపూర్ణేశ్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం 'సోదరా'. మన్మోహన్ మేనంపల్లి తెరకెక్కించిన ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి రాక్ స్టార్ మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

ఈ సందర్భంగా సంపూర్ణేశ్ బాబు గురించి పలు ఆసక్తికర కామెంట్లు చేశాడు మనోజ్. సంపూ తనకు సోదరుడు లాంటి వాడన్నారు. సంపూ ఎంత మంచివాడో ఆయన నవ్వే చెబుతుంది. ఆయనను చూస్తుంటే మా ప్రసాద్ అన్న (బాబాయ్ కొడుకు.. ఒక ప్రమాదంలో చనిపోయారు) గుర్తొస్తారంటూ చెప్పుకొచ్చారు మనోజ్.

ఇదే సందర్బంగా అన్నదమ్ముల అనుబంధంపై మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'ఒక కుటుంబంలో అన్నదమ్ముల అనుబంధం ఎంతో ప్రత్యేకం. సోదరుల మధ్య ఇగోలు, డబ్బు సమస్యలు ఉండకూడదు. ఇద్దరి మధ్య సమస్యలు ఉన్నాయంటే వారు కూర్చొని మాట్లాడుకోవట్లేదని అర్థం' అని మనోజ్ పేర్కొన్నాడు.

అన్నదమ్ముల మధ్య సమస్య వచ్చినప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గాలి. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, కుటుంబసభ్యులంతా కలిసి చర్చించుకోవాలి. అప్పుడే కుటుంబ ప్రయాణం బాగుంటుంది' అని మనోజ్ కామెంట్స్ చేశాడు.

కొన్నినెలల క్రితం మంచు మనోజ్, విష్ణు గొడవ పడినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా వైరలైంది. మోహన్‌బాబు కూడా స్పందించి ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు.




