Bigg Boss 7 Telugu: టైమ్‌ చూసి మరీ రతికపై రివేంజ్‌ తీర్చుకున్న రైతు బిడ్డ.. దెబ్బకు హౌజ్‌ నుంచి బయటకు..

బిగ్‌ బాస్‌ కు ఎంతో ఇష్టమైన రతికా రోజ్‌ పై రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ ప్రతీకారం తీర్చుకున్నాడా? కరెక్ట్ టైమ్‌ చూసి మరీ దెబ్బ కొట్టాడా? ఎలిమినేషన్‌ ప్రాసెస్‌లో ప్రశాంత్‌ తన ఎవిక్షన్‌ ప్రాసెస్‌ అర్జున్‌కు ఇచ్చి మరీ రతికను బయటకు పంపించాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

Bigg Boss 7 Telugu: టైమ్‌ చూసి మరీ రతికపై రివేంజ్‌ తీర్చుకున్న రైతు బిడ్డ.. దెబ్బకు హౌజ్‌ నుంచి బయటకు..
Bigg Boss 7 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Nov 26, 2023 | 9:11 PM

బిగ్‌ బాస్‌ కు ఎంతో ఇష్టమైన రతికా రోజ్‌ పై రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ ప్రతీకారం తీర్చుకున్నాడా? కరెక్ట్ టైమ్‌ చూసి మరీ దెబ్బ కొట్టాడా? ఎలిమినేషన్‌ ప్రాసెస్‌లో ప్రశాంత్‌ తన ఎవిక్షన్‌ ప్రాసెస్‌ అర్జున్‌కు ఇచ్చి మరీ రతికను బయటకు పంపించాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత వారంలోఎలిమినేషన్ ఎత్తేసిన నాగార్జున ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని హౌస్‌ మేట్స్‌కు వార్నింగ్‌ ఇచ్చాడు. అందుకు తగ్గట్టుగానే శనివారమే (నవంబర్‌ 25) ఓటింగ్ లో అట్టడుగు స్థానంలో ఉన్న అశ్విని శ్రీని ఎలిమినేట్‌ చేసి బయటకు పంపించారు. ఇక ఆదివారం (నవంబర్‌ 26)న కూడా ఎలిమినేషన్‌ జరగనుంది. ప్రస్తుతం ఓటింగ్‌ ప్రకారం చూసుకుంటే అంబటి అర్జున్‌, రతికా రోజ్‌లు డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. అయితే రతికనే ఎలిమినేట్‌ అయ్యిందని తెలుస్తోంది. ప్రశాంత్ తన ఎవిక్షన్ పాస్‌తో అర్జున్‌ అంబటిని సేవ్ చేశాడని, దీంతో రతికనే ఎలిమినేట్‌ అయ్యిందని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ నుంచి రతికను రెండుసార్లు బయటకు పంపించిన ఘనత పల్లవి ప్రశాంత్‌కే చెందుతుంది. ఎందుకంటే మొదటి సారి ఆమె ఎలిమినేట్‌ అయ్యింది కూడా రైతు బిడ్డ వల్లే. ప్రశాంత్ తో ప్రేమ యవ్వారాలు నడిపిన ఈ బ్యూటీ ఆ తర్వాత అతనితోనే గొడవలకు దిగింది. చీటికి మాటికి తిట్టిపారేసింది. ఈ కారణంగా తీవ్రమైన నెగెటివిటీతో హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యింది.

అయితే రతికకు అందంతో పాటు అదృష్టం కూడా ఉంది. అందుకే వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలతో పాటు తను కూడా హౌజ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే తన పంథాను మాత్రం మార్చుకోలేదు. బిగ్‌ బాస్‌ పెద్దన్నగా చెప్పుకునే శివాజీ కాళ్లు మొక్కి మరీ ప్రసన్నం చేసుకున్న రతిక.. అదే శివాజీ బ్యాచ్‌ లో ఉండే రైతు బిడ్డతో మళల్ఈ గొడవకు దిగింది. దీంతో 12 వారంలో రతిక, ప్రశాంత్‌.. ఒకరిని ఒకరు నామినేట్‌ చేసుకున్నారు. చివరకు ఇద్దరూ నామినేషన్స్‌లోకి వచ్చారు. అయితే టాస్కుల్లో గెలిచిన ప్రశాంత్‌ ఎవిక్షన్‌ పాస్‌ గెల్చుకున్నాడు. ఇప్పుడు అదే ఎవిక్షన్‌ పాస్‌ను అర్జున్‌కు ఇచ్చి ఎలిమినేషన్‌ నుంచి కాపాడాడు. అదే సమయంలో రతికను హౌజ్‌ నుంచి బయటకు పంపించాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి రైతు బిడ్డ టైమ్‌ చూసి మరీ రతికను దెబ్బ కొట్టాడంటూ బిగ్‌ బాస్‌ ఆడియెన్స్‌ చెప్పుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ హౌజ్ లో రతిక..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.