Bigg Boss 7 Telugu: రతికకు షాకిచ్చిన రైతుబిడ్డ.. మళ్లీ ఎలిమినేట్.. ప్రశాంత్, శివాజీ గురించి ఏం చెప్పిందంటే..
అంతా ఊహించినట్లే ఆదివారం రతిక ఎలిమినేట్ అయిపోయింది. కానీ అంతకు ముందు నా కోసం ఎవిక్షన్ పాస్ ఉపయోగించు అంటూ రైతుబిడ్డను బతిమాలింది. అలాగే శివాజీని సైతం బతిమాలినా ప్రయోజనం లేకపోయింది. దీంతో మరోసారి రతికకు నిరాశ తప్పలేదు. చివరకు అర్జున్, రతిక మిగిలగా.. రతిక ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. మరీ స్టేజ్ పైకి వచ్చాక పల్లవి ప్రశాంత్, శివాజీ, యావర్ గురించి రతిక ఏం చెప్పిందో తెలుసుకుందామా. ముందుగా నిన్నటి ఎపిసోడ్ లో అశ్విని స్టే్జ్ పైకి వచ్చి అందరితో మాట్లాడి వెళ్లిపోయింది.
బిగ్బాస్ సీజన్ 7లో పన్నెండు వారాలు ముగిశాయి. ఇక ఈవారం ఆదివారం ఎపిసోడ్ సైతం పూర్తైంది. ఈసారి మాత్రం ఫస్ట్ టైమ్ డబుల్ ఎలిమినేషన్ జరిగింది. శనివారం అశ్విని ఎలిమినేట్ కాగా.. అంతా ఊహించినట్లే ఆదివారం రతిక ఎలిమినేట్ అయిపోయింది. కానీ అంతకు ముందు నా కోసం ఎవిక్షన్ పాస్ ఉపయోగించు అంటూ రైతుబిడ్డను బతిమాలింది. అలాగే శివాజీని సైతం బతిమాలినా ప్రయోజనం లేకపోయింది. దీంతో మరోసారి రతికకు నిరాశ తప్పలేదు. చివరకు అర్జున్, రతిక మిగిలగా.. రతిక ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. మరీ స్టేజ్ పైకి వచ్చాకా పల్లవి ప్రశాంత్, శివాజీ, యావర్ గురించి రతిక ఏం చెప్పిందో తెలుసుకుందామా. ముందుగా నిన్నటి ఎపిసోడ్ లో అశ్విని స్టే్జ్ పైకి వచ్చి అందరితో మాట్లాడి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఇంటి సభ్యులతో సరాదాగా గేమ్స్ ఆడించారు. SPA, SPY టీమ్ లను విడిగా కూర్చోబెట్టి ఇంట్లో ఉన్న వస్తువుల గురించి ఆసక్తికర క్వశ్చన్స్ అడిగారు. అయితే ఇందులో మాత్రం రతిక అదరగొట్టేసింది. అడిగిన ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడంతో నాగ్ సైతం ఆశ్చర్యపోయారు. ఆడడం మానేసి ఇవన్నీ లెక్కపెడుతూ కూర్చున్నావా అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఇక ఆ తర్వాత SPA బ్యాచ్ వీఐపీ రూంలో ఉంది.. అందుకే హౌస్ ను సరిగా చూడడం లేదంటూ కౌంటరిచ్చారు. ఇక ముందుగా అమర్, గౌతమ్ ఇద్దరిని సేవ్ చేశారు. ఆ తర్వాత ఫోటో చూసి సాంగ్ చెప్పే గేమ్ పెట్ట ఇందులో మళ్లీ SPY గెలిచింది.
ఇక చివరకు అర్జున్, రతిక నామినేషన్స్ లో ఉండగా..రైతుబిడ్డను ఎవిక్షన్ పాస్ క్వశ్చన్ చేశారు నాగ్. అయితే ఈసారి కూడా 14వ వారంలోనే వాడతా అంటూ చెప్పేశాడు ప్రశాంత్. అయితే ఆ తర్వాత నాగార్జున బ్రేక్ అని చెప్పడంతో ఆ గ్యాప్ లో ప్రశాంత్ పక్కన కూర్చొని కాసేపు బతిమాలింది రతిక. నాకు హెల్ప్ చేస్తానని మాటిచ్చావ్… నన్ను చూడు ఒకసారి అంటూ రతిక మాట్లాడుతున్నా.. ప్రశాంత్ మాత్రం తలదించుకుని కూర్చున్నాడు తప్పా.. రతికను చూసే ప్రయత్నం చేయలేదు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయి శివాజీని బతిమాలింది. నువ్వు అయినా తనకు చెప్పన్నా అంటూ అడగడంతో.. ఈ విషయంలో నేను కలుగజేసుకోనని ముందే చెప్పేశా.. నా కోసం కూడా వాడొద్దని చెప్పాను.. అలాగే యావర్ కూడా చెప్పేశాడంటూ శివాజీ అన్నాడు. దీంతో యావర్ కలగజేసుకుని ఎందుకు రతిక భిక్ష అడగాలి.. వద్దు అని అన్నాడు.
దీంతో ఎలిమినేట్ అయిపోతానేమో అని అంటూ రతిక టెన్షన్ పడడంతో పోతే పోతావ్ ఏమవుతుంది.. టెన్షన్ పడతావ్ ఎందుకు.. ఇంటికే పోతావ్.. రెండు వారాలు అయితే అందరూ పోతారుగా అంటూ శివాజీ ధైర్యం చెప్పాడు. చివరకు రతిక ఎలిమినేట్ అయినట్లు నాగ్ చెప్పేశాడు. ఇక స్టేజ్ పైకి వచ్చిన రతిక ఒక్కొక్కరి గురించి చెప్పేసింది. ముందుగా శివాజీ అన్నా కంట్రోల్ గా మాట్లాడు.. ఇలాగే అన్నా అని పిలుస్తుంటాను అని చెప్పింది. ఇక యావర్ టికెట్ టూ ఫినాలే విన్ అవ్వు అని.. అర్జున్ స్ట్రాంగ్ కానీ కొన్ని మార్చుకుని బాగా ఆడాలని చెప్పింది. ఇక ప్రియాంకను సరదాగా ఆటపట్టించింది రతిక. వెళ్లగానే నీ లవర్ శివ్ దగ్గరికి వెళ్లి రోజ్ తీసుకుంటా అంటూ రతిక అనడంతో తీసుకో నీకు ఉంటది అంటూ నవ్వింది ప్రియాంక. శివాజీ అన్నతో ఉన్న డిస్ట్రబెన్స్ క్లియర్ చేసుకో అంటే..నామినేషన్స్ లో మాట్లాడతా అని చెప్పేసింది. ఇక తర్వాత ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ నువ్వే వాడుకో అంటే.. సారీ అక్కా అనేశాడు. ఇక ఆ తర్వాత రతిక కోసం ఓ కవిత చెప్పాడు. “మట్టి వాసన ఎంత స్వచ్ఛంగా ఉంటుందో..నేను నీ గురించి మాట్లాడే ప్రతి మాట అలాగే మనసులో నుంచి నిజాయితీగా వచ్చింది” అంటూ చెప్పుకొచ్చాడు.