Bigg Boss 7 Telugu: హౌస్లో చుక్క బ్యాచ్, SPY బ్యాచ్.. నాగార్జున ఆసక్తికర కామెంట్స్..
అసలు ఊహించలేదు సార్ ఇంత బాగా ఆడతానని కానీ.. సెల్ఫ్ నామినేషన్ ఇక్కడి వరకూ తీసుకువస్తుందని కూడా అనుకోలేదంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇంట్లో వారిలో ఎవరు హిట్, ఎవరు ప్లాప్ చెప్పాలని అడిగారు నాగార్జున. దీంతో ఒక్కొక్కరి గురించి తన వెర్షన్ చెప్పేసింది. ముందుగా ప్రశాంత్ సూపర్ హిట్.. కానీ కొన్నిసార్లు మాట వినడు.. అంతేసార్ అంటూ చెప్పింది. ఇక తర్వాత అమర్ కాస్త ఇన్నోసెంట్.. కానీ తను కూడా హిట్ అనేసింది. యావర్ సూపర్ హిట్.. నాకు మంచి ఫ్రెండ్ అయిపోయాడు.
ఆదివారం సండె ఎపిసోడ్ పూర్తైంది. ఇక నిన్నటి ఎపిసోడ్లో శనివారం ఎలిమినేట్ అయిన అశ్విని స్టేజ్ పైకి వచ్చింది. ముందుగా ఆమెకు నాగార్జున తన జర్నీ వీడియోను ప్లే చేసి చూపించారు. ఎలా అనిపించింది అంటూ అసలు ఊహించలేదు సార్ ఇంత బాగా ఆడతానని కానీ.. సెల్ఫ్ నామినేషన్ ఇక్కడి వరకూ తీసుకువస్తుందని కూడా అనుకోలేదంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇంట్లో వారిలో ఎవరు హిట్, ఎవరు ప్లాప్ చెప్పాలని అడిగారు నాగార్జున. దీంతో ఒక్కొక్కరి గురించి తన వెర్షన్ చెప్పేసింది. ముందుగా ప్రశాంత్ సూపర్ హిట్.. కానీ కొన్నిసార్లు మాట వినడు.. అంతేసార్ అంటూ చెప్పింది. ఇక తర్వాత అమర్ కాస్త ఇన్నోసెంట్.. కానీ తను కూడా హిట్ అనేసింది. యావర్ సూపర్ హిట్.. నాకు మంచి ఫ్రెండ్ అయిపోయాడు. అలాగే రతిక అందంగా ఉంటుంది.. ఇంకా బాగా ఆడాలి అంటూ సలహా ఇచ్చింది అశ్విని.
ఆ తర్వాత ప్రియాంక గురించి అడగ్గా.. తన మనసులోని మాటను బయటపెట్టేసింది. ప్రియాంక మంచిదే.. కానీ దృష్టిలో మాత్రం ప్లాప్ అంటూ చెప్పేసింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన అశ్వినికి, ప్రియాంకకు మొదటి వారం నుంచి గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక గౌతమ్ హిట్ అంటూనే ఇంట్లో ఉన్న రెండు గ్రూప్స్ గురించి బయటపెట్టింది. ఇంట్లో అమర్, ప్రియాంక, శోభా ఒక గ్రూప్, రెండోది శివాజీ, ప్రశాంత్, యావర్, రతిక గ్రూప్ అని చెప్పగా.. గౌతమ్, నేను ఏకాకిగా మిగిలిపోయమని అన్నది. దీంతో నేను ఏకాకి గ్రూపులో కూడా లేనా అంటూ చేయి ఎత్తాడు. ఇక ఇదే సమయంలో రెండు గ్రూపుల గురించి కామెంట్స్ చేశారు. ముందు అమర్ బ్యాచ్ కు రెండు పేర్లు ఉన్నాయని చెప్పాడు. ఒకటి SPA (శోభా, ప్రియాంక, అమర్) అని చెప్పగా..మరొకటి.. చుక్క బ్యాచ్ అంటూ చెప్పేశాడు. చుక్క బ్యాచ్ అంటే స్టార్ మా బ్యాచ్ అని, ఇక తర్వాత SPY (శివాజీ, ప్రశాంత్, యావర్) బ్యాచ్ అంటూ చెప్పాడు. ఇక చివరగా శోభా, అర్జున్, శివాజీ ముగ్గురు హిట్ అంటూ చెప్పేసి అశ్విని వెళ్లిపోయింది.
ఇక ఆ తర్వాత టాస్కులలో రతిక తన తెలివితేటలతో అందరిని ఆశ్చర్యపరిచింది. ఇంట్లో అన్ని వస్తువుల గురించి కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చి నాగార్జుననే అవాక్కయ్యేలా చేసింది. ఇక ఎప్పటిలాగే న్యూటన్ ఫోటో చూసి శివుడంటూ తింగరి ఆన్సర్ ఇచ్చాడు అమర్. మళ్లీ అదే ఫోటోను దగ్గర్నుంచి చూసి ఐన్ స్టీన్ అంటూ మళ్లీ తప్పు ఆన్సర్ ఇచ్చాడు. ఇక గౌతమ్ మాత్రం న్యూటన్ ను షేక్ స్పియర్ అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. మొత్తానికి ఈ వారం ఇద్దరి ఎలిమినేషన్ జరిగింది. ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది మిగిలారు.