Sai Kiran- Laya: హీరోయిన్‌ లయను పెళ్లి చేసుకోవాలనుకున్నా.. కానీ ఆ కారణంతో ఆగిపోయింది: సాయి కిరణ్‌

ప్రస్తుతం టీఆర్పీ రేటింగ్‌లో దూసుకెళుతోన్న గుప్పెడంత మనసులోనూ మహేంద్ర భూషణ్‌గా అలరిస్తున్నాడు సాయి కిరణ్. అలాగే పడమటి సంధ్యారాగం ధారా వాహికలోనూ ఓ కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సాయి కిరణ్‌ తన పర్సనల్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ లైఫ్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ముఖ్యంగా ప్రేమించు సినిమాలో తనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న లయ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు.

Sai Kiran- Laya: హీరోయిన్‌ లయను పెళ్లి చేసుకోవాలనుకున్నా.. కానీ ఆ కారణంతో ఆగిపోయింది: సాయి కిరణ్‌
Sai Kiran, Laya
Follow us
Basha Shek

|

Updated on: Nov 27, 2023 | 11:03 AM

నువ్వే కావాలి సినిమాతో నటుడిగా టాలీవుడ్‌ లోకి అడుగు పెట్టాడు సాయి కిరణ్‌. ఆ తర్వాత ప్రేమించు సినిమాతో సూపర్‌ హిట్ కొట్టాడు. ఇందులో లయ, సాయి కిరణ్‌ల కెమిస్ట్రీ అందరినీ అలరించింది. ఆ తర్వాత రావే నా చెలియా, డార్లింగ్‌ డార్లింగ్‌, మనసుంటే చాలు, ఆడంతే అదో టైపు, పెళ్లి కోసం వంటి సినిమాల్లో సెకెండ్‌ లీడ్‌గా నటించాడు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే సుడి గుండాలు, కోయిలమ్మ, అభిలాష, మౌన రాగం, ఇంటి గుట్టు వంటి సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకుల మనసులు చూరగొన్నాడు. ప్రస్తుతం టీఆర్పీ రేటింగ్‌లో దూసుకెళుతోన్న గుప్పెడంత మనసులోనూ మహేంద్ర భూషణ్‌గా అలరిస్తున్నాడు సాయి కిరణ్. అలాగే పడమటి సంధ్యారాగం ధారా వాహికలోనూ ఓ కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సాయి కిరణ్‌ తన పర్సనల్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ లైఫ్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ముఖ్యంగా ప్రేమించు సినిమాలో తనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న లయ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు.

జాతకాలు కలవలేదని..

ప్రేమించు సినిమాలో అంధురాలిగా కనిపించేందుకు లయప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నారు. ఒక వారం రోజుల పాటు ప్రాక్టీస్ చేశారు. అందువల్లే ఈ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. ఇక లయతో పెళ్లి విషయంపై మాట్లాడుతూ.. ‘ చూడడానికి మా జంట బాగుంది. పెళ్లి చేసుకుంటే బాగుంటుందని మా పేరెంట్స్‌ అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తూ మా జాతకాలు కలవలేదు. అందువల్లే మా ఇద్దరికీ అవ్వలేదు. మా మధ్య ప్రేమ అలాంటివేమీ లేవు. మేం కూడా కుదిరితే వివాహం చేసుకుందామనుకున్నాం. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నాం. నేను జాతకాలు నేను చాలా గట్టిగా నమ్ముతా. అమ్మానాన్నలు కూడా వీటిని విశ్వసిస్తారు. ఒకప్పుడు నమ్మేవాడిని కాదు. కానీ ఆ తర్వాత వాటి గురించి తెలుసుకున్నా’ అని సాయి కిరణ్‌ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మెగాస్టార్ చిరంజీవితో సాయి కిరణ్

కూతురుతో నటి లయ..

View this post on Instagram

A post shared by Laya Gorty (@layagorty)

ధమాకా సాంగ్ కు లయ స్టెప్పులు..

View this post on Instagram

A post shared by Laya Gorty (@layagorty)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..