- Telugu News Photo Gallery Cinema photos Vijay Deverakonda Set To Relaunch His Rwdy Indian Street Culture In December
Vijay Deverakonda: ఈసారి అంతకుమించి.. రౌడీ బ్రాండ్‌ను రీలాంఛ్ చేస్తోన్న విజయ్ దేవరకొండ.. ధరల వివరాలివే
స్టార్ హీరోగా సక్సెస్ ఫుల్ మూవీస్ చేస్తూ పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకుల అభిమానం పొందుతున్నారు విజయ్ దేవరకొండ. ఆయన స్టార్ గా కొనసాగుతూనే ఫ్యాషన్ పట్ల తనకున్న ఇష్టాన్ని తన సొంత రౌడీ క్లాత్ బ్రాండింగ్ ద్వారా చూపిస్తున్నారు. రౌడీ క్లాత్ బ్రాండింగ్ ఇప్పటికే యూత్ లో బాగా క్రేజ్ తెచ్చుకుంది.
Updated on: Nov 26, 2023 | 9:49 PM

స్టార్ హీరోగా సక్సెస్ ఫుల్ మూవీస్ చేస్తూ పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకుల అభిమానం పొందుతున్నారు విజయ్ దేవరకొండ. ఆయన స్టార్ గా కొనసాగుతూనే ఫ్యాషన్ పట్ల తనకున్న ఇష్టాన్ని తన సొంత రౌడీ క్లాత్ బ్రాండింగ్ ద్వారా చూపిస్తున్నారు. రౌడీ క్లాత్ బ్రాండింగ్ ఇప్పటికే యూత్ లో బాగా క్రేజ్ తెచ్చుకుంది.

తన ఫ్యాన్స్ ను రౌడీస్ అంటూ విజయ్ ప్రేమగా పలకరిస్తుంటారు. తన క్లాతింగ్ బ్రాండ్ కు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకున్న రౌడీ ఇండియన్ స్ట్రీట్ కల్చర్ పేరుతో రీ లాంఛ్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ.

డిసెంబర్ లో రౌడీ ఇండియన్ స్ట్రీట్ కల్చర్ రీలాంఛ్ కాబోతోంది. ఫ్యాషన్ రంగంలో ఇండియన్ ఆధిపత్యాన్ని రౌడీ క్లాత్ బ్రాండింగ్ ముందుకు తీసుకెళ్తుందని గర్వంగా ప్రకటించారు విజయ్ దేవరకొండ.

ఈ క్లాతింగ్ బ్రాండ్ రేట్స్, వివరాలు ప్రస్తుతానికి ప్రకటించలేదు. ఎర్లీ యాక్సెస్ చేసుకోవాలనుకునే వారికి రిజిస్ట్రేషన్ కోసం లింక్ ఇచ్చారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. పరశురాం దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ అనే ఓ సినిమాను చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమా కొన్ని కారణాలతో వాయిదా పడింది.