Dhruva Natchathiram: ఈ రోజు రిలీజ్ కావాల్సిన ధృవ నక్షత్రం సినిమా మరోసారి వాయిదా పడింది. ఆర్ధిక సమస్యల కారణంగా రిలీజ్ వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. దీంతో ప్రేక్షకులకు సారీ చెప్పిన దర్శకుడు గౌతమ్ మీనన్, త్వరలో కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తామన్నారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విక్రమ్ హీరోగా నటించారు.