ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెడతామంటున్న తారక్, చరణ్ !! మరో సారి దద్దరిల్లిపోవాల్సిందే
మల్టీస్టారర్ మూవీస్‌లో గోల్డెన్ లెటర్స్ లో రాసుకోవాల్సిన పేరు ట్రిపుల్ ఆర్. తారక్, చరణ్ కలిసి నటించిన ఈ సినిమా గురించి ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు జనాలు... ఇప్పుడే కాదు, నెక్స్ట్ ఇయర్ కూడా డిస్కషన్‌లోనే ఉంటుంది ఈ సినిమా. రీజన్ ఏంటంటారా? చూసేద్దాం రండి. రాజమౌళి సినిమాలో నటించడమంటే ఏళ్లకు ఏళ్లు ఆయనకు రాసిచ్చేయడమే అనే టాక్ ఉంది ఇండస్ట్రీలో. అలా తారక్ అండ్ చెర్రీ కలిసి జక్కన్నకు కొన్నేళ్లు రాసిచ్చారు. దానికి తగ్గ రిజల్ట్ ఆస్కార్ లెవల్లో వినిపించింది. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ సినీ పటం మీద సగర్వంగానూ నిలిపింది