- Telugu News Photo Gallery Cinema photos Will Heroes being over cautious be disadvantage to them, fans are worried
హీరోల అతి జాగ్రత్త కొంప ముంచుతోందా ?? వర్రీ అవుతున్న ఫ్యాన్స్
రీజన్స్ కాదు... రిజల్ట్ కావాలి అని అంటారు ఫ్యాన్స్. ఆ రిజల్టు బెస్టుగా ఉండటం కోసమే ఇన్ని తిప్పలూ అంటూ ఒన్, టూ త్రీ ఫోర్ రీజన్లు చెబుతున్నారు స్టార్స్. తమ అభిమాన హీరోల రాక ఆలస్యమైన ప్రతిసారీ ఫ్యాన్స్ వర్రీ అవుతుంటే, అభిమానుల ఎక్స్ పెక్టేషన్స్ కి రీచ్ అయ్యేలా ప్రాడెక్ట్ వస్తోందా? లేదా? అంటూ రీచెక్ చేసుకుంటూ స్టార్స్ డిలే చేస్తున్నారు. ఇంతకీ ఏమిటీ తికమక.... కాస్త్ డీటైల్డ్ గా చూసేద్దాం రండి. సూపర్‌డూపర్ హిట్ అవుతుందనుకున్న రాధేశ్యామ్ ఫ్లాప్ అయినప్పుడు... ఏదో అలా అయిపోయిందిలే అని అనుకున్నారేమో డార్లింగ్.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Nov 26, 2023 | 6:51 PM

రీజన్స్ కాదు... రిజల్ట్ కావాలి అని అంటారు ఫ్యాన్స్. ఆ రిజల్టు బెస్టుగా ఉండటం కోసమే ఇన్ని తిప్పలూ అంటూ ఒన్, టూ త్రీ ఫోర్ రీజన్లు చెబుతున్నారు స్టార్స్. తమ అభిమాన హీరోల రాక ఆలస్యమైన ప్రతిసారీ ఫ్యాన్స్ వర్రీ అవుతుంటే, అభిమానుల ఎక్స్ పెక్టేషన్స్ కి రీచ్ అయ్యేలా ప్రాడెక్ట్ వస్తోందా? లేదా? అంటూ రీచెక్ చేసుకుంటూ స్టార్స్ డిలే చేస్తున్నారు. ఇంతకీ ఏమిటీ తికమక.... కాస్త్ డీటైల్డ్ గా చూసేద్దాం రండి.

సూపర్‌డూపర్ హిట్ అవుతుందనుకున్న రాధేశ్యామ్ ఫ్లాప్ అయినప్పుడు... ఏదో అలా అయిపోయిందిలే అని అనుకున్నారేమో డార్లింగ్. కానీ ఆదిపురుష్ అట్టర్ ఫ్లాప్ అయినప్పుడు మాత్రం సీరియస్‌గా తీసుకున్నారు. ఆ ఎఫెక్ట్ మొత్తం సలార్ మీద పడింది. ప్రభాస్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకపోవడంతో సలార్ వాయిదాల పర్వం మొదలైంది. ప్రభాస్ అతి జాగత్త తీసుకోకపోతే, సలార్ ఇదివరకే విడుదల కావాల్సిందన్నది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట.

పవన్ కల్యాణ్ కూడా అతి జాగ్రత్తకు పోతున్నారా? హరిహరవీరమల్లుని ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేయగానే ఆయన ఎక్కువ కేర్ తీసుకోవడం మొదలుపెట్టారా? అందుకే ఆచితూచి షెడ్యూల్స్ చేశారా? అనే అనుమానాలు ఇప్పుడు అదేపనిగా వినిపిస్తున్నాయి.

గబ్బర్‌సింగ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్‌సింగ్. గబ్బర్‌సింగ్ ఎక్స్ పెక్టేషన్స్ ని రీచ్ అయ్యేలా ఉస్తాద్ భగత్‌సింగ్ ఉండాలని ఆచితూచి అడుగులు వేస్తున్నారట మేకర్స్. దీనికి తోడు, పవన్ పొలిటికల్ కమిట్‌మెంట్స్ కూడా సినిమా ఆలస్యానికి కారణమవుతున్నాయి.

ఆల్రెడీ హిట్ మీదున్న మహేష్, గుంటూరు కారంతో జబర్దస్త్ హిట్ అందుకోవాలని ఫిక్స్ అయిపోయారు. నెక్స్ట్ రాజమౌళి మూవీతో ప్యాన్ ఇండియా స్టేజ్‌కి వెళ్తున్న మహేష్ గుంటూరు కారాన్ని అందుకు తొలి మెట్టుగా ఫీలవుతున్నారు. అందుకే పర్సనల్ డిస్టర్‌బెన్సులు మూవీ మీద లేకుండా కాస్త గ్యాప్ తీసుకునే రెగ్యులర్ షెడ్యూల్స్ కి హాజరయ్యారు. ఆ డిలేల వల్లనే 2023లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ పొంగల్ రేస్‌కి షిఫ్ట్ అయింది.





























